ఈనాడు Education అంటూ Agitation నుప్రేరేపిస్తున్నారు. కొందరు గురువులు. Agitation కాదు. Elevation ను ప్రదర్శించాలి. ఈనాడు కొన్నివిద్యాలయాలలో ఆశాంతి ప్రబలటానికి కారకులు కొందరు అధ్యాపకులే అవటం మిక్కిలి దురదృష్టకరం, కొన్ని కొన్ని సందర్భాలలో విద్యార్థులలో క్రమశిక్షణా రాహిత్యం పెచ్చు. పెరిగిపోవటానికి కారణభూతులవు తున్నారు. కొందరు అధ్యాపకులు. ముఖ్యంగా అధ్యాపకులలో పరివర్తన రావాలి. ఒక విద్యార్థి చెడిపోతే పెద్ద ప్రమాదం లేదు గాని, ఒక ఉపాధ్యాయుడు కనుక తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకపోతే వేలాది మంది విద్యార్థులు చెడిపాయే ప్రమాదం ఉన్నది. కనుక విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలి అధ్యాపకులు,
(శ్రీవా.97 పు.14)
పుట్టిన తక్షణమే ఏ వ్యక్తి విద్యార్థి కాడు. పుట్టిన తక్షణమే ఏ వ్యక్తి పండితుడు కాడు. క్రమక్రమేణా సాధనలు సలిపి, ఆ సాధనల ద్వారా ఆవిర్భవింప జేసుకున్నవే ఆ విద్యలు. ఇట్టి ఆవిర్భవింపజేసుకున్న వాటినే Educare అన్నారు. ఈనాడు మనం చదువుకుంటున్న చదువులు అన్నీ Education మాత్రమే. ఇవన్నీ Artificial. Art బయట ఉన్నది Heart లోపల ఉన్నది. Art is outside, Heart is inside. కనక, Art అంతా Education, Heart మాత్రం Educare దానినే మనం ఆవిర్భవింప జేసుకొని, తిరిగి బయటకు తెప్పించుకోవాలి. అసలు చదువు చదివినటువంటివాడు ఈ జగత్తులో కానరాడు. కనుక దీనికి ఒక ప్రమాణం కూడా ఏర్పర్చారు.
(శ్రీ. అ. 2000 పు. 9)
నిజమైన విద్యార్థి తనకు ఉపకారము చేసిన వానికే కాక తనకు అపకారము చేసిన వానికే అధిక ఉపకారము చేయవలెను. ఇది మరింత పవిత్రము. ఉపకారము చేసినవానికి ఉపకారము చేయుట సామాన్యము. అపకారము చేసినవానికి ఉపకారము చేయుటే గొప్పగుణము. ఈ విషయమున కొంత ఇంగిత జ్ఞానము, విచక్షణా బుద్ధి అత్యవసరము. అట్టి ఇంగితజ్ఞానమును, విచక్షణా తత్వమును ఉపదేశించునదే విద్య. కొన్ని సమయములందు మూర్ఖుల విషయములో తప్పని సరిగావిచక్షణ చూపించాలి. చేసిన మేలు మరచిన కృతఘ్నుల విషయములో విజ్ఞతను ప్రదర్శించాలి. అపకారము చేసిన వారిని దండించడం ప్రభుత్వము యొక్క ధర్మము. అయితే విద్యార్థి ఆ స్థాయిని అందుకొనరాదు. తన సహజత్యాగమును, స్వభావమున అయిన పరోపకార భావమునే అధికంగా ఆలవరచుకోవాలి.
(వి.వా.పు.69)
ఆధిక భాషణ శూరత్వ మధికమయ్యే,
కార్య శూరత్వ క్షీణమై కరిగి పోయె
బ్రతుకు లాడంబరములతో భారమాయె
నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయె.
(పా.పు.39)
విద్యార్థులు విద్యకంటే గుణము అధికంగా పోషించుకోవాలి.
అధిక విద్యావంతుల ప్రయోజకులైరి
పూర్ణశుంఠలు మహా పూజ్యాలైరి
ఈనాటి విద్యార్థులు గుణములు అమితముగా పోషించుకోవాలి. గుణవంతుల వల్లనే సమాజమునకు ఎంతో శ్రేయస్సు కలుగగలదు. కనుక ప్రతి విద్యార్థి సామాజిక దృష్టిని తన మనస్సు నందుంచుకొని సమాజసేవ, సమాజమును సంరక్షించడమే సరైన లక్ష్యమని భావించాలి.
(భ...మ.పు 2/3)
ఈనాడు విద్యార్థులు రక్షించవలసినది దేశముకాదు. సత్యధర్మములను మాత్రమే రక్షించాలి. సత్యధర్మములే దేశమును రక్షిస్తాయి. సత్యధర్మములు విస్మరించి దేవ రక్షణ దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు. ఈనాటి విద్యావంతులు, విద్యలు నేర్చినంత మాత్రమున వివేకులు కారు.
(బ్బ.త్ర.పు.2)
|నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయె
హృదయమంతయు దుర్గంధ సదనమయ్యె
చేతలన్నియు స్వార్థంపు చేతలయ్యె
ఇదియె ప్రోగ్రెస్సు ఈ నాటి విద్యార్థులందు.(శ్రీవామా2020పు15)
ఈనాటి విద్యార్థులు ఎన్నెన్ని రకములైన విద్యలను అభ్యసించినూతనమైన విద్యలను అభివృద్ధిపరచుకొని ఇవన్నీ కేవలమూ స్వార్థమునకే వినియోగిస్తున్నారు. ఇది కాదు మనము చేయవలసినది. అందరూ విశాలమైన జగత్తులో సోదరసోదరీమణులుగానే భావించాలి. మానవ సోదరత్వాన్ని, జీవిత స్వేచ్చను సమత్వాన్ని సంపాదించుకోవాలనుకుంటే కేవలమూ నైతిక విద్యను మసం అభ్యసించాలి. ఈనాడు నైతిక విద్య, ఆధ్యాత్మిక విద్య క్షీణించిపోయాయి. అన్ని దేశములయందు ఈవిధమైన సంక్షోభము జరుగుతూనే వుంది. ఈనాటి ప్రభుత్వము కూడా వస్తు ఉత్పత్తికి, ఆర్థిక అభివృద్ధికి మితిమీరిన ప్రాధాన్యతఇస్తూ వస్తున్నారు. కానీ దీని పైన నైతికమైన అదుపు లేకపోవడంచేత మానవుడు సర్వస్వతంత్రుడుగా మారి విదేశ నాగరికతకు ఇదే ముఖ్యమైన క్షోభగా మారుతుంది. స్వాతంత్ర్యము - ఏమిటి ఈ స్వాతంత్ర్యము? ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించడమా స్వాతంత్ర్యము? కాదు కాదు. ఆత్మ నిగ్రహమే నిజమైన స్వాతంత్ర్యము. ఇంద్రియ నిగ్రహమే నిజమైన స్వాతంత్ర్యము. మనో నిగ్రహమే నిజమైన స్వాతంత్ర్యము. ఇట్టి నిజమైన స్వాతంత్ర్యము మనము సంపాదించుకోవాలి. ఈనాడు భారతదేశము రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించింది. కానీ నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఏమాత్రమూ స్వాతంత్ర్యము సంపాదించ లేదు. స్వాతంత్ర్యము సంపాదించటం అంటే ఏమిటి? తనతత్వము పైన తను విశ్వసించాలి. ఎవరి కాళ్ల పైననో పడికాదు నీవు అర్థించవలసింది. నీ కాళ్లపైన నీవు జీవించాలి. అదే సెల్ఫ్ సపోర్ట్. కానీ నాడుసెల్ఫ్ సపోర్ట్ అనేది విరిగిపోయింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అసలే లేకుండా పోయింది. సెల్ఫ్ సాటిస్ ఫాక్షన్గాలికి కొట్టుకుపోయింది. ఇక్కడ ఈ విద్యార్థులకుండవలసిన సద్గుణములు ఏమాత్రమూ విద్యార్ధియందు కనిపించడంలేదు. గ్రంథపరిచయమును మాత్రము కేవలము మీరు చేసుకుంటు న్నారు. ఈ బుక్స్ నాలెడ్జ్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమాత్రమూ ప్రాప్తించదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. మేథమెటిక్స్ ను మరువక జపియించు గణిత శాస్త్రమువంక చూడబోడు అమెరికా మార్గంబుసరయచూచునుగాని కాశీకామార్గమ్ము కాసరాడు ఆల్జిబ్రాయంత అరయచూచుసు కాని ఇంటి వైశాల్యంబు నెరుగబోడు అనుదినంబును డ్రిల్లు ననుసరించునుగాని ప ద్మాసనము వేయు బాధపడును వృ క్షశాస్త్ర మెరుగు సంవృ ద్ధిగాను తులసి ఉ పయొగమెరుగడు మానవుండును (శ్రీ సత్యసాయి దివ్యబోధ 1993 పు171-172) ఈనాటి విద్యార్థులు ఎన్నెన్ని రకములైన విద్యలను అభ్యసించినూతనమైన విద్యలను అభివృద్ధిపరచుకొని ఇవన్నీ కేవలమూ స్వార్థమునకే వినియోగిస్తున్నారు. ఇది కాదు మనము చేయవలసినది. అందరూ విశాలమైన జగత్తులో సోదరసోదరీమణులుగానే భావించాలి. మానవ సోదరత్వాన్ని, జీవిత స్వేచ్చను సమత్వాన్ని సంపాదించుకోవాలనుకుంటే కేవలమూ నైతిక విద్యను మసం అభ్యసించాలి. ఈనాడు నైతిక విద్య, ఆధ్యాత్మిక విద్య క్షీణించిపోయాయి. అన్ని దేశములయందు ఈవిధమైన సంక్షోభము జరుగుతూనే వుంది. ఈనాటి ప్రభుత్వము కూడా వస్తు ఉత్పత్తికి, ఆర్థిక అభివృద్ధికి మితిమీరిన ప్రాధాన్యతఇస్తూ వస్తున్నారు. కానీ దీని పైన నైతికమైన అదుపు లేకపోవడంచేత మానవుడు సర్వస్వతంత్రుడుగా మారి విదేశ నాగరికతకు ఇదే ముఖ్యమైన క్షోభగా మారుతుంది. స్వాతంత్ర్యము - ఏమిటి ఈ స్వాతంత్ర్యము? ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించడమా స్వాతంత్ర్యము? కాదు కాదు. ఆత్మ నిగ్రహమే నిజమైన స్వాతంత్ర్యము. ఇంద్రియ నిగ్రహమే నిజమైన స్వాతంత్ర్యము. మనో నిగ్రహమే నిజమైన స్వాతంత్ర్యము. ఇట్టి నిజమైన స్వాతంత్ర్యము మనము సంపాదించుకోవాలి. ఈనాడు భారతదేశము రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించింది. కానీ నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఏమాత్రమూ స్వాతంత్ర్యము సంపాదించ లేదు. స్వాతంత్ర్యము సంపాదించటం అంటే ఏమిటి? తనతత్వము పైన తను విశ్వసించాలి. ఎవరి కాళ్ల పైననో పడికాదు నీవు అర్థించవలసింది. నీ కాళ్లపైన నీవు జీవించాలి. అదే సెల్ఫ్ సపోర్ట్. కానీ నాడుసెల్ఫ్ సపోర్ట్ అనేది విరిగిపోయింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అసలే లేకుండా పోయింది. సెల్ఫ్ సాటిస్ ఫాక్షన్గాలికి కొట్టుకుపోయింది. ఇక్కడ ఈ విద్యార్థులకుండవలసిన సద్గుణములు ఏమాత్రమూ విద్యార్ధియందు కనిపించడంలేదు. గ్రంథపరిచయమును మాత్రము కేవలము మీరు చేసుకుంటు న్నారు. ఈ బుక్స్ నాలెడ్జ్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమాత్రమూ ప్రాప్తించదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. మేథమెటిక్స్ ను మరువక జపియించు గణిత శాస్త్రమువంక చూడబోడు అమెరికా మార్గంబుసరయచూచునుగాని కాశీకామార్గమ్ము కాసరాడు ఆల్జిబ్రాయంత అరయచూచుసు కాని ఇంటి వైశాల్యంబు నెరుగబోడు అనుదినంబును డ్రిల్లు ననుసరించునుగాని ప ద్మాసనము వేయు బాధపడును వృ క్షశాస్త్ర మెరుగు సంవృ ద్ధిగాను తులసి ఉ పయొగమెరుగడు మానవుండును (శ్రీ సత్యసాయి దివ్యబోధ 1993 పు171-172) పిల్లలకు తల్లిదండ్రుల గృహమే మొట్టమొదటి పాఠశాల ఈనాడు తల్లిదండ్రులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఏదో ఐదు సంవత్సరములు వస్తే పిల్లలను ప్రైమరీ స్కూల్లోనో, విలేజి స్కూల్లోనో చేర్చి తమ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు. ఆ పాఠశాలయందే పెద్దలను ఏరీతిగా గౌరవించాలి, సత్యమును ఏరీతిగా సంభాషించాలి, ఈ సత్యధర్మములను ఏరీతిగా మనం ఆచరించాలి, పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో ఏవిధంగా ప్రవర్తించాలి, గురువులను ఏరీతిగా గౌరవించాలి, తోటిబాలురతో ఏరీతిగా ప్రవర్తించాలి... ఈవిధమైన విషయములను పిల్లలు నేర్చుకోవాలి. నిబంధనలను, క్రమశిక్షణను గుర్తించి వర్తించాలి. అప్పుడే విద్యార్థులు ఆదర్శవంతంగా రూపొందుతారు. కొక్కొరొకోయని కోడి కూయగనే ఇటువంటి బోధలు ఈనాడు ఎవ్వరూ పిల్లలకు చేయడంలేదు. ఈ పరిస్థితులలో ప్రాచీన చరిత్రయైన రామాయణం అన్ని రంగములందు ఆదర్శము నందిస్తుంది. రామాయణము చాలా పవిత్రమైన చరిత్ర. రామనామము నామిని (రాముని) చూపును. నామరూపములు రెండూ ఎట్టి ప్రవర్తనను ప్రబోధిస్తాయో దానిని ఆచరణలో పెట్టి ఆదర్శమునందించాలి. (రామాయణ దర్శనము (వేసవి తరగతులు -2002 పు 30-31) ఈనాడు తల్లిదండ్రులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఏదో ఐదు సంవత్సరములు వస్తే పిల్లలను ప్రైమరీ స్కూల్లోనో, విలేజి స్కూల్లోనో చేర్చి తమ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు. పిల్లలకు తల్లిదండ్రుల గృహమే మొట్టమొదటి పాఠశాల. ఆ పాఠశాలయందే పెద్దలను ఏరీతిగా గౌరవించాలి, సత్యమును ఏరీతిగా సంభాషించాలి, ఈ సత్యధర్మములను ఏరీతిగా మనం ఆచరించాలి, పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో ఏవిధంగా ప్రవర్తించాలి, గురువులను ఏరీతిగా గౌరవించాలి, తోటి బాలురతో ఏరీతిగా ప్రవర్తించాలి... ఈ విధమైన విషయములను పిల్లలు నేర్చుకోవాలి. నిబంధనలను, క్రమశిక్షణను గుర్తించి వర్తించాలి. అప్పుడే విద్యార్థులు ఆదర్శవంతంగా రూపొందుతారు. కొక్కొరొకోయని కోడి కూయగనే పరుగుడు చెడుగుడు బంతులాటయును ఇటువంటి బోధలు ఈనాడు ఎవ్వరూ పిల్లలకు చేయడంలేదు. ఈ పరిస్థితులలో ప్రాచీన చరిత్రయైన రామాయణం అన్ని రంగములందు ఆదర్శము నందిస్తుంది. రామాయణము చాలా పవిత్రమైన చరిత్ర. రామనామము నామిని (రాముని) చూపును. నామరూపములు రెండూ ఎట్టి ప్రవర్తనను ప్రబోధిస్తాయో దానిని ఆచరణలో పెట్టి ఆదర్శమునందించాలి. (రామాయణ దర్శనము (వేసవి తరగతులు 2002 పు 30-31)
చక్కగా నిద్రమంచమునుండి లెమ్ము
పలు దోముకొని దేహబాధ తీర్చుకొని
జలకమాడి దుస్తులు ధరించి చల్ది భుజించి
హితమైన వస్తువు ఎంతయు నమిలి
మితముగ భుజించిన మేలగు నీకు
బడికేగి శ్రద్ధగా పాఠాల్ నేర్చి
అణకువ గల బాలుడని అనిపించుకొనుము
తేమలో నెప్పుడు తిరుగంగబోకు
మురికిగుంటల చెంత పోబోకుమెపుడు
పరుగుడు చెడుగుడు బంతులాటయును
సర్వ వేళల సలుపుచునుండు
పైరీతుల నీవు పరిగణింతువేని
ఆరోగ్య భాగ్యంబుల ననుభవించెదవు
చక్కగా నిద్రమంచమునుండి లెమ్ము
పలు దోముకొని దేహబాధ తీర్చుకొని
జలకమాడి దుస్తులు ధరించి చల్టి భుజించి
హితమైన వస్తువు ఎంతయు నమిలి
మితముగ భుజించిన మేలగు నీకు
బడికేగి శ్రద్ధగా పాఠాల్ నేర్చి
అణకువ గల బాలుడని అనిపించుకొనుము
తేమలో నెప్పుడు తిరుగంగబోకు
మురికిగుంటల చెంత పోబోకుమెపుడు
సర్వ వేళల సలుపుచునుండు
పైరీతుల నీవు పరిగణింతువేని
ఆరోగ్య భాగ్యంబుల ననుభవించెదవు