ఆత్మజ్ఞానము యొక్క పరాకాష్ట

పట్టుదలనూ శ్రద్ధనూ యముడు గ్రహించి ఆత్మజ్ఞానమునకు నచికేతుడర్హుడని నిశ్చయించి, నాయనా! శ్రేయస్సు అనియు ప్రేయస్సు అనియు రెండు పురుషార్థములు. అవి రెండును పురుషుని బంధించునవియే. శ్రేయోమారము నవలంబించువాడు శుభమును పొందును. ప్రేయోమార్గమునవలంబించు వాడు పరమ పురుషార్థము నుంచి విదూరుడగును. ఈ రెండును విభిన్నములు. రెండునూ పురుషాధీనములే, ఒకటి వివేకముచే లభించును మరియెకటి అవివేకముచే లభించును. విరుద్ధములగుటచే, అవి ఒక దానినొకటి త్రోసివేయును. ఒకటి మోక్షకారణము: రెండవది సంసారహేతువు. ప్రేయోమార్గము అవిద్యాకల్పిత మనియు, శ్రేయోమార్గము విద్యాకల్పితమనియు, అయితే, శ్రేయస్సును కోరువారు చాల అరుదనియూ యముడు చెప్పెను. ఆత్మ వికల్పరహితమగు అఖండరస ఘనస్వరూపము కనుక, అతను అస్తి నాస్తి, కర్త అకర్త మొదలగు వికల్పముల కాస్పదుడు కాడు; అతను ఙ్ణేయవస్తువు కాడు. కనుక అతనిని గూర్చి జ్ఞాతృ, జ్ఞానఙ్ణేయ భేదము లేదు. ఇదియే ఆత్మజ్ఞానము యొక్క పరాకాష్ఠ. ఉపదేశికుడే బ్రహ్మము. శ్రోతయే బ్రహ్మమని తెలియుచున్నది. ఈ విధమగు జ్ఞానము, సర్వసంసారనివారకమగుటచే జన్మ రాహిత్యము నిశ్చల మగుచున్నది. శ్రుతిసమ్మతము కాని, కేవలము తర్కమునకీ పరమ రహస్యము అందదనియూ, సాధ్యము కాదనియూ, కఠోపనిషత్తు తెలుపుచున్నది.

(ఉ.వా.పు. 16/17)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage