పరమాత్ముని నీ చెంతకు రప్పించుకునే సామర్థ్యం నీకు వుంటే తనంతట తానే వచ్చి నీ సరసన నిలబడుతాడు. వేణువులాగా సరళంగా, తేలికగా ఉండాలి. ఆయన వూదేనాలుక లోపల అడ్డం ఏదీ ఉండరాదు.అప్పుడు కిందికి వచ్చి కరాలతో అందుకుంటాడు. తన సుకుమార కరాంగుళులతో స్వరాలు చేస్తూ మీ మేనులను వేణువులుగా దివ్య మధుర సంగీతంతో నింపివేస్తాడు. ఈ వేణువును పట్టుదట్టీలో దాచుకుంటాడు.కోమలాధర స్పర్శ అనుగ్రహిస్తాడు. తన చేతులలో ధరించి గౌరవం చేకూర్చి నలుగురికి ప్రదర్శిస్తాడు. ఆయన హస్త స్పర్శలో అణువు ఘనమై ఆల్పవస్తువు మహత్తరమై అలరారుతుంది.
(శ్రీ స.సూ.పు. 19)