ఆధ్యాత్మిక సాధనలో విశ్వాసము ఊపిరివంటిది. సందేహము సాధన యొక్క పునాదులను సైతం కదలించి వేస్తుంది. అందువలన దానిని తొలగించాలి. మనపూర్వుల యొక్క విజ్ఞాన సంపదయందు విశ్వాసము కలిగి యుండుము. మన మహర్షుల యొక్క స్వయం ప్రేరితమైన మనస్సును (Intution) గాని, తద్వారా వారు కనిపెట్టిన గొప్ప గొప్ప విషయాలు గాని నీ అల్పబుద్ధితో శంకించకు. నీ యందు నీవు విశ్వాసము ఏర్పచుకో. ఇటువంటి విశ్వాసము ఏర్పరచుకోవటానికి అనేక సంవత్సరాలు పట్టవచ్చు. ఈ విశ్వాసము జీవితంలో నీకు ఉపయోగ పడాలంటే, నీ మనసులో గల విశ్వాసము నిరంతరాయము గాను, అచంచలమైనదిగాను ఉండాలి. సాధనలో ఎదురయ్యే నిరాశా నిస్పృహలవంటి ఆటంకములను, భగవంతుని యందు మనకు గల విశ్వాసమును గట్టిపరచి, మనలను ఉన్నత స్థితికి తీసికొని వెళ్ళడానికి ఆయనే కల్పించిన పరిస్థితులుగా ఆత్మ సంయమనములతో స్వీకరించాలి.
(దై.పు. 328)