భగవంతుని సృష్టియే మహావిచిత్రం. ఒక మానవుని వలె మరొక మానవుడు లేడు. ఒక వేలిముద్రవలె ఇంకొక వ్రేలి ముద్ర లేదు. అంతా చిత్రంగా ఉంటున్నది. భగవంతుని సృష్టి ఒక మూస (Mould) తో చేసేది కాదు, లేక ఒక రబ్బరు స్టాంపుతో చేసేది కాదు. ఇది క్షణ క్షణమునకు మారేటటువంటిది. విభిన్నమైన రూపనామములను ధరించేటటువంటిది. కవల పిల్లలయందు కూడా ఏదో వ్యత్యాసం ఉండే తీరుతుంది. ఇంత విచిత్రమైనది భగవత్ సృష్టి! ఇలాంటి సృష్టిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ‘మానవ సేవే మాధవ సేవ’. ప్రతి మానవుని యందు మాధవుడు ఉంటున్నాడు. “ఈశ్వరః సర్వభూతానాం " !
(శ్రీ భ.ఉ. పు. 155)