ఆరోగ్య అనారోగ్యములకు మనస్సే కారణము. మానవుని భావమే ప్రధానము. దానిని గురించి ఆలోచించునది కూడా అతడే. కావున రోగ నివారణకు కావలసిన మనోబలము, విశ్వాసము అతని యందే ఉద్భవించాలి.
((శ్రీ.ది. స.వీ.పు.24)
మానవుడి ఆరోగ్యానికి ఆనారోగ్యానికి మనస్సే కారణం. వ్యాధి నివారణ కావాలంటే గాఢమైన విశ్వాసం మనస్సులో నాటుకోవాలి. వ్యాధిని నివారించుకోగలను అనే సంకల్పమునూ, విశ్వాసముమా రోగి మనస్సులో నేను ప్రతిష్టిస్తాను. అపారమైన నా ప్రేమ అనుగుణంగా భక్తుని హృదయంలో గాఢమైన విశ్వాసం నెల్పుకొనగలదు. అప్పుడు ఆశించిన ఫలితం లభిస్తుంది.
(స.ప్ర.పు. 19)