అనకూల వతియైన అర్థాంగియున్న
తనను పూజించెడి తనయుడున్న
తగు సేవలొనరించు దాన దాసీలున్న
గుణవంతురాలైన కోడలున్న
అమిత ప్రేమగజూచు అక్కచెల్లెండ్రున్న
తన ఆజ్ఞపాలించు తమ్ములున్న
మైత్రి నిత్యము గోరు మిత్రబృందమున్న
తగిన అధికార ఉద్యోగమున్న
విశ్వవ్యాప్తిని గావించు కవితయున్న
చక్రవర్తుల మించిన ధనముయున్న
దైవ ప్రేమయె లేకున్న ధరణియందు
సర్వమును వ్యర్థ మగును రా చనెడువేళ.
(భ.ప్ర.పు.15)