ఒక ఆస్తికుడు దేవు డున్నా డంటాడు. There is God నాస్తికుడైనటువంటివాడు There is no God ఆంటాడు. There is no God అనే పదములలో ఉన్న అంతరార్థమును మనము చక్కగా సూక్ష్మబుద్ధిలో విచారణ చేస్తే, అందులోనే మనకు స్పష్టమవుతుంది. ఉన్న దానినే లేదని చెపుతున్నాడు కాని, లేనిదానిని లేదని చెప్పటములేదు. ఇక్కడ ఈ పదమును మనము చూచినపుడు There is అని మొదట వచ్చినది. తరువాత No God" అని వస్తుంది. ఇంకా కొంత స్థాయి పైకిపోయినపుడు God is nowhere అంటాడు నాస్తికత్వములో ముదిరినటువంటి వాడు. God is nowhere ఇక్కడ నాలుగు పదములు ఉన్నవి. ఇందలి where లోని Wను. No కు చేర్చితే God is now here అవుతుంది. No కు W దూరము చేస్తే Nowhere అవుతుంది. Noకు W దగ్గర చేస్తే Now here అవుతుంది. ఇది words magic తప్ప సత్యము కానేరదు.
(ఆ.రా.పు. 53)
ఆస్తికుడనగా ప్రహ్లాదుని వంటివాడు. ఇది జన్మతో ప్రారంభమైన పవిత్రభావము. ఒకరి బోధనచేతగానీ, ఒకరి నిర్బంధముచేతగాని ప్రారంభించినది గాదు. స్వాభావికమైన తత్వం చేత స్వరూపాన్ని దర్శించ గలిగాడు. ప్రహ్లాదుడు. హృదయవాసి అయిన పరమాత్ముని తాను నిరంతరము అనుభవిస్తూ వుండటము చేతనే ఆనందానికి గురి అయ్యాడు. అందువలననే అతనికి ప్రహ్లాదుడనే పేరు సార్థకమైంది. ప్ర +హ్లాద = ప్రహ్లాద. నిరంతరము ఆనందముతో వుండేవాడు కనుక ప్రహ్లాద అని పేరు. హ్లాద మనగా ఆనందము. ఆహ్లాదమనగా ఆనందము. ప్ర అనగా వికాసము. ప్రపంచము అన్నారు. అనగా పంచభూతములతో కూడి ప్రకాశించేది. ప్రపంచము అని. అదే విధముగా ప్రహ్లాద అనగా ఆనందముతో వికసించబడినవాడే ప్రహ్లాదుడు అని. నిరంతరము దైవచింతన చేయుటచేత మనలో ఆనందమనేది తేజరిల్లు తుంది. మన వర్చస్పే మారిపోతుంది. బ్రహ్మత్వముతో ఏకమైపోతుంది.
(శ్రీ స. గీపు 73)