విప్లవాలతో మనం ఎట్టి కార్యమును సాధించలేదు. ఈనాడు కావల్సింది కల్లోలం కాదు. కార్యాచరణ. కల్లోలమునకు దారితీయక, కార్యమును సాధించడానికి ప్రయత్నించాలి. శాంతముతో శాశ్వత లాభమును పొందుతాం. సమాజమునకు నష్టం కలుగజేయటం అంటే, తనకు తాను నష్టం కలుగజేసికోవటమే. వేళ్ళు మనవి, కన్నులు మనవి. ఏ వ్రేలుతో పొడుచుకున్నా మన కన్నులకే ముప్పు. ఏదో కంపెనీ అని, ప్రభుత్వ ఆస్తి అని, అది మనదికాదనే భావంతో విధ్వంసానికి పూనుకుంటున్నారు కొందరు. నిజానికి అది అంతా మనదే. దానికి నష్టం కలిగితే మనకు నష్టం కలిగినట్లే. కనుక ప్రేమతో జీవించి, ప్రేమతో కార్యం చేసి, ప్రేమతో అన్యోన్య అనురాగములు పెంచుకొని మానవత్వాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. ప్రేమతో మానవత్వం దైవత్వముగా మారిపోతుంది. ప్రేమ ఉన్నచోట ద్వేషమునకు అవకాశమే ఉండదు.
(శ్రీ.. డి. 2001 పు. 26)||