కొబ్బరికాయలోని నీటిని ప్రాపంచిక వాంఛలో పోల్చవచ్చును. కాయలో ఈ నీరు ఉన్నంత వరకూ, కొబ్బరి పెంకును అంటి పెట్టుకొని ఉన్నంత వరకూ, కాయను నాటిన మళ్ళీ మొలకెత్తును.కాయను నాటకుండా ఉంచిన, కొంతకాలమునకు అందులోని నీరు ఇగిరిపోవును. కొబ్బరి, పెంకునుండి విడివడును. అటువంటి కాయను నాటినా మొలకెత్తదు. కొబ్బరి కాయకు ఉన్న మూడు నేత్రములు దానిని ఎంచుకొనుటకు కారణము. రెండు నేత్రములను భౌతిక నేత్రములతో పోల్చవచ్చును. మూడవది జ్ఞాన నేత్రము (ఇది అచ్ఛాదితమైనది). కాయను పగులగొట్టుట అనగా ముకుళించిన హృదయమును ఛేదించి ఆంతర్భాగములను భగవంతునికి అర్పించుట. అదే సంపూర్ణ సమర్పణ. అనగా భగవంతుని ముందు ఏదీ మరుగుపరచబడుట లేదు. ఒక పర్యాయము పగులగొట్టబడిన కొబ్బరి కాయ ఇక ఎన్నటికి మొలకెత్తదు.
(ప. పు.135)