సామవేదీయ తలవాకారాన్తర్భాగమునకు సంబంధించి యుండుట వలన దీనికే తలవాకారోపనిషత్తనికూడా పేరుకలదు. ఈ ఉపనిషత్తు మొదటి ఖండమున మొదటి శ్లోకము కేన అను పదముతో ఆరంభమగుట వలన కేనోపనిషత్తనికూడా పిలువబడుచున్నది.
శ్లో:కేనేషితo పతతి ప్రేషితం మనః కేన ప్రాణ: ప్రధమః ప్రైతియుక్తః
కేనేషితాం వాచమిమాం వదన్తి చిక్షుః శ్రోతం క ఉదేవో యునక్తిః:
శ్రోత్రత్వ క్చక్షు ర్జిహ్వా ఘ్రూణములను పంచేద్రియము లకు శబ్ద, స్పర్శరూపరసగంధము లనునవి వరుసగా విషయములగుచున్నవి. ప్రపంచమునందు ఙ్ణేయములగు విషయములన్నియు, ఈ ఐదింటిలో అవాంతర భేదములనందున్నవి. విషయములను తెలిసికొనగల ఆంత:కరణ శక్తి మనస్సని పిలువబడుచున్నది. అట్టి మనస్సు జ్ఞానేంద్రియముల ద్వారా బహిర్గతమై ఆ విషయములతో సంబంధించినపుడు ఆ ఆకారమును పొందును. వివిధ విషయాకారములను పొందిన మానసిక స్థితి వృత్తి అనబడును.
(ఉ. వా. పు. 50)