పర్షియనుల యొక్క ప్రాచీన మతమైన జోరాస్ట్రియను మతమును స్థాపించిన వారు జోరాష్ట్రుడు. ఆయన బోధలలో అగ్నిదేవుడు కేంద్రస్థానములో ఉంటాడు. భగవంతుని యొక్క ఈ చరాచర సృష్టిలో ప్రతివస్తువు కూడా చివరకు అగ్నికి ఆహుతై భస్మమవుతుంది. అలాగే మానవ శరీరము కూడా, దీనికి తిరుగులేదు. ప్రాపంచికమైన కోర్కెలను ఆధ్యాత్మిక జ్ఞానమనే అగ్నిలో దగ్ధము చేసి బూడిద చేయవలెనని దీని యొక్క అంతరార్థము. నిషిద్ధమైన ఆలోచనలను, కోరికలను దగ్ధం చేసి భస్మము చేసే నిమిత్తమై నిరంతరము మన హృదయాలలో ఆ పవిత్రాగ్ని వెలుగుతూ ఉండాలని ఆయన బోధిస్తూ వచ్చారు. మనలో నిరంతరం వెలుగొందే ఆ పవిత్రాగ్ని యొక్క వెలుగు కిరణాలు మనలోను, మనచుట్టూను ప్రసరించి, ఆ కాంతి అంతటా నిండి పోవాలి...
(దై.మ. పు. 36)