భగవంతుడు నీ సేవలను కాంక్షించడు. భగవంతునికి నీ పూజలు, పునస్కారాలు అక్కర్లేదు. భగవంతుడు కోరేది ఒక్కటే ఒక్కటి. అదే నీ ప్రేమ. అది నీ సొ త్తు కాదు. నీతాత సొత్తు కాదు; ఒకరి నుండి బహుమతిగా పొందేదీ కాదు; కంపెనీలో తయారయ్యేదీ కాదు; గురూపదేశంలో లభించేది కాదు. ప్రేమ దైవానుగ్రహం. ఆ ప్రేమ దైవానికే ఆర్పితం కావాలి. వివాహాలకు, విందులకు వంట సామాగ్రిని అద్దెకు తెచ్చుకుంటావు. వాటిని ఉపయోగించుకున్న తరువాత శుభ్రపరచి, మొదట అద్దెకు తెచ్చుకున్నప్పుడు అవి ఏ స్థితిలో ఉన్నవో ఆ స్థితిలోనే తిరిగి యజమానికి వాపసు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా, భగవంతుడు అనుగ్రహించిన హృదయపాత్రను యథాతథంగా భగవంతునికే అర్పించాలి. భగవదను గ్రహమైన ప్రేమను భగవంతునికే నివేదించాలి. అదే జనిమైన ఆరాధన. మరి భగవంతుని ఎట్లా ప్రేమించాలి? "ది బెస్ట్ వేటు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ ఎండ్ సర్వ్ ఆల్". అందరినిప్రేమించాలి. సేవించాలి అప్పుడే భగవంతుణ్ణి ప్రేమించిన వాడవవుతావు. భగవంతుడు ఆశించేది ఏదీ లేదు. సర్వమునూ అనుగ్రహించేవాడు, సర్వమూ తానైనవాడు ఆశించడమేమిటి! పవిత్ర హృదయమే దైవమందిరం,పవిత్రత అనగా మనోవాక్కాయకర్మల ఏకత్వమే. అదే నేను అప్పుడప్పుడు చెపుతుంటాను: The proper Study of mankind is man.నిస్పార్థ భావంతో, నిర్మల మనస్సుతో, ప్రేమతో చేసిన కర్మలన్నీ భగవదారాధనలే అవుతాయి. Work will be transformed into worship.మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. డ్యూటీ ఈజ్ గాడ్", సమాజ సేవయే సర్వేశ్వర పూజ, మానవ సేవయే మాధవసేవ. వాడిపోయే, రాలిపోయే పుష్పాలు భగవంతుణ్ణి సంతృప్తి పరచలేవు. నీ హృదయ బృందావనంలో పూచే సద్గుణాలనే సుగంధ పుష్పాలతో భగవంతుణ్ణి పూజించాలి.
(స.సా.డి.98 పు.336)