"యోగమము పదమునకు ప్రేమభక్తి యోగమమనదే సరయైన నిర్వచనము. దైవమును చేరుకొనుటకిది చక్కటి రాజమార్గము. మిగిలిన యోగములు క్రియాయోగము హఠయోగము రాజయోగము కొందరు వర్ణించుచున్ననూ "సాయియోగము ఇవియన్నియూ యోగమ’ను పేరిట పిలువబడుచున్ననూ, దీనిలో శరీరమునకు, లౌకిక వ్యవహారములతో సంబంధముకల ఒక విధమైన డ్రిల్లు Drill కవాతు ప్రధానమైన అంగముగా ఉంటున్నది. లెఫ్ట్ రైట్ "ఆప్ డౌన్ అంటూ! దీనివలన లాభమేమిటి? ఇవియన్నియూ నిరుపయోగమైనవి! దీనిపై కాలమును వ్యర్థము చేయుట తప్ప ప్రయోజనమేమియు లేదు. హృదయమును లగ్నము చేసి చేయు ప్రేమ యోగమే నేరుగా దైవము వద్దకు చేర్చును."
(లీ.నా.పు.228/229)