"మత్కర్మకృత్మత్పరమో మద్భక్తః” మత్క్ ర్మకృత్ అనగా నేమి?అన్ని కర్మలు నాకు సంబంధించినవిగా నీవుఆచరించు. నీవు ఏకర్మలు చేసినప్పటికినీ, ఈ భూతాకాశములో అన్ని నీకు సంబంధించినవే. నాకంటే అన్యమైన కర్మలు ఈ జగత్తులో కానరావు. నీవు ఏ కర్మలు చేసినప్పటికినీ నాకు సంబంధించిన కర్మలుగా ఆచరించు అని మొట్ట మొదట భక్తి యోగము మనకు బోధిస్తుంది. మత్పరమో నాకోసం నీవు చేయి నీవు చేస్తుండేది నీకోసం కాదు. నీవు, నీవు. నీవు అనుకొంటున్నావు. నీవు ఎవరు? నీయందు అణుస్వరూపుడై, ఆత్మస్వరూపుడై ప్రకాశించేది నేనే. ఆత్మస్థానము నుండియే, నేను నేను అనే పదము ఆవిర్భవిస్తూ వచ్చింది. కనుక నేను అనే పదము ఈ దేహమునకు సంబంధించినట్టిది కాదు. ఇది ఆత్మకు సంబంధించినట్టిది. ఆత్మ యొక్క -- ఆత్మ యొక్క -- ఆత్మ యొక్క -- ఈ నేను అనే పదము దేహమునకు గానీ, మనస్సునకు గానీ, బుద్ధికి గానీ, యింద్రియములకు గానీ, సంబంధించినది గాదు. దేహమనస్తత్వములకు అతీతమైన నేను అనే పదము ఆత్మకు సంబంధించినట్టిది. నీవు ఏమి చేసినప్పటికీ ఆత్మతృప్తి నిమిత్తమై ఆచరిస్తున్నావు. ఈ రహస్యమును గుర్తించక యేదో బాహ్యదేహమే నేనని భావించి. మాయలో మునిగి, నాది నేను నావారు అనే భ్రాంతిలో కొట్టుకొనిపోతున్నారు. ఏమి చేసినప్పటికినీ నా తృప్తి నిమిత్తమై నీవు చేస్తున్నావు. నాపరమై నీవు ఆచరిస్తున్నావు. నీవు నా ఏజంటుగాప్రవర్తిస్తున్నావు. మర్పరమో నా కోసమే నీవు ఆచరిస్తున్నావు. ఈ సత్యాన్ని నీవు గుర్తుంచుకో.
(శ్రీ. గీ.పు 10/11)