మానవుడు సుఖాభిలాషి ఆనందపిపాసి, అహారాత్రములు అనేక శ్రమలు పడి యీ సుఖానందములను సంపాదించు కొనుటకై కృషి చేస్తున్నాడు. అన్ని రంగముల యందు మానవుడు ఆశించునవి రెండు; ఒకటి సుఖ ప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి. ఆధ్యాత్మిమునందే కాక వైజ్ఞానికమునందు దీనికి ఆధారములుంటున్నవి. మానవుడు సుఖాన్ని కోరటంలో ఆనందము ఆశించుటలో అంతరార్థము ఏమిటి? మానవుని స్వభావము స్వరూపము ఆనందమే.
(బృత్ర.పు.115)
ఆత్మజ్ఞాన విచారమే సనాతన ధర్మము. ఆత్మజ్ఞాన విచారమే జీవుని కర్తవ్యము. అంతవంత ఇమే దుఃఖ దేహ: దేహత్వము అంతమయ్యేది పంచభూతములు పాంచభౌతిక దేహమును బాధింప వచ్చునే కాని, ఆత్మతత్త్వాన్ని అవి చలింపలేవు. శరీర, ఆత్మల కూడిక మానవుడు.
(సా.పు.453/454)
శరీరము, మనస్సు, ఆత్మల కూడిక మనుష్యుడు. ఇక ఆత్మ ఇది నిత్యము శుద్ధము, సత్యము, నిర్మలము, నిస్వార్ధము. ప్రకాశవంతమైన స్వరూపము. మార్పుచెందునది కాదు. ఇది మానవుని అంతరాత్మ యందు (గుహయందు) పరంజ్యోతిగా వెలుగుచున్నది. దీనినే దైవత్వమని చెప్పుచున్నది శాస్త్రము. .
(సా.పు.460)
శరీరము మనస్సు ఆత్మల కలయికనే మానవుడు. ఇవి మానవుని భావములను నిర్ణయించి అతణ్ణి ఉన్నత స్థితికి గొని పోయే సోపానములు. కర్మలు ఆచరించునది దేహము, తెలుసుకొనునది మనస్సు, నిత్యమై సత్యమై నిరంతరము ఉండునది. ఆత్మ. ఇదియే మానవుని యందలి దేవత. చేయుట, తెలిసికొనుట, ఉండుట ఈ త్రిశక్తులు అభివ్యక్తియే మానవత్వము. మనసు దేహము, ఆత్మ వేరు వేరు రూపముల చేత వేరు వేరు ఫలితములును అందించుచు వేరు వేరు నామములు కలిగి ఉండినప్పటికిని ఈ మూడింటి ఏకత్వముచేతనే మానవత్వము దివ్యత్వము నొందుచున్నది. ఈ మూడింటి భిన్నత్వమే మానవుని పశుత్వమునకు గొనిపోతుంది.
(బృత్ర.పు.68)
హృదయమందు ప్రేమ పండించుకొనుచున్న
వాడే క్రైస్తవుడు వాడే సిక్కు
వాడే హైందవుడు వాడే ముస్లిము కూడ
వాడే మానవుండు వసుధలోన
(శ్రీ ఆ.2001పు.3)
“విమల భావము గలుగుటే విద్యయగును
సరసగుణములు కలుగుటే చదువు లగును
సహజ భావము కలుగుటే సరస మగును
మంచి నడతలు ఉండుటే మానవుండు”
(శ్రీసత్యసాయి విద్యార్థి వాహిని పు 155)
మనసు నిలిపినవాడె పో మానవుండు
బుద్థి నెరిగిన మనుజండె బుధవరుండు
చెప్పుచేతలు ఒక టైన శ్రేష్ఠుడగును
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.
(శ్రీసత్యసాయి విద్యార్థి వాహిని పు 164)
"బాల్యంబునందున పలువురితోకూడి
ఆట పాటలయందు ఐక్యుడగును
యవ్వనం బలరిన విలిపుత్రునిపోల్కియ
కామినీలోలుడై కొలుచుండు
అర్ధవయస్సున ఐహికంబున మునిగి
ద్రవ్య మార్జించుటను దవిలియుండు
ముదిమి వచ్చినయంత మురహరిని తలవక
అది ఇదేదని ఆలపించు
వివిధ దుర్వ్యసనంబులు వీడలేక
భక్తి మార్గంబు వెతుక ఆశక్తి లేక –
కర్మ పంకిలమున బడి కొలుచుండు
మట్టి కల్పును జన్మంబు మానవుండు.”
(మ మ పు64)
మానవుడు మాధవుడుగా పరిణమించాలి. అదే అతని గమ్యం . ఇతర జంతువులకు వేటి కీలేని విధంగా విజ్ఞానమనే ఖడ్గమూ వివేకమనే డాలూ మానవునికి అమర్చుటలో వున్న ఆంతర్యమూ ప్రయోజ నమూ ఇదే. జంతువుల్లో పూర్వజన్మను గురించి తెలుసుకోగల వాడు మానవు డొక్కడే. ఒక దాని వెంట ఒకటి పరంపరగా సాగే జన్మలను గురించి. ఒక జన్మనుంచి ఇంకొక జన్మకు పోగుచేసుకుంటూ వెళ్లే అనుభూతులను గురించీ అతనికి తెలుసు. మేలుకుని వున్న సమయంలో చూసినదానిమీద ఆధారపడి వుంటుంది. కలలో మనకు కలిగే అనుభవమూ మనం చూసే దృశ్యమూ. అదేవిధంగా ఈనాడు జీవితంలో మనం చూస్తున్నదీ గడిచిన జన్మ పరంపరల్లో మనం చూసి అనుభనించినదాని పైన ఆధారపడి వుంటుంది. ((శ్రీ సత్య సాయి వచనా మృ తము 1963 పు 4-5)