ఎక్కువమంది మూర్తిపూజలపై దాడివెడలుదురు. మూర్తిపూజ అనగా ఒక చిన్న వస్తువులో బ్రహ్మాండమును దర్శించు శక్తియే. ఇది ఊహాభావముకాదు. అనుభవసిద్ధమే. విరాట్స్వరూపములో యేమున్నదో అది అంతయూ ఒక చిన్న స్వరపూపమందు కూడా వున్నది. కావ్యములో ఉపమానములు దృష్టాంతములూ మొదలైన వానికున్న ఆధారములే మూర్తిపూజకున్నవి.
(ప్రే,వా...పు.13)