ఈనాడు ఈ జగత్తులో ఇన్ని కల్లోలములకు మూలకారణంమానసిక ప్రమాణములే. వ్యక్తి యొక్క ప్రవర్తనలే దీనికి మూల కారణం. జాతి, మత, కుల భేదములు ఏమాత్రం కారణాలు కావు. ఈ మూలాధార తత్త్వమును గుర్తించుకోలేని వ్యక్తులు మాత్రమే, జాతి మత కుల భేదములే ఈ కలహాలకు మూలకారణమనిభావిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. కనుక మన సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
(శ్రీ.. ఆ.2000 పు.33)
(చూ|| అజ్ఞానం, దేశశ్రేయస్సు, దైవసంకల్పము, ప్రథమస్థానము, మదాలస, శరీరము)