మానవుని సంకల్ప వికల్పములే మూలకారణమని తెలుస్తుంది. మనలను గౌరవించి, మన క్షేమమును, ఆశయములను అభివృద్ధి చేసి ఆనందమును అందించేవారే మన బంధువులని విశ్వసిస్తున్నాము. మనలను ద్వేషించి మన ఆశయాలకు విరుద్ధముగా నడిచి, కష్టనష్టములను కలిగించేవారిని విరోధులుగా భావిస్తున్నాము. నిజముగా ఇందులో మిత్రులెవ్వరు? శత్రులెవ్వరు? కబీరు చెప్పినట్లు మనము దూషించేవారే మనకు మిత్రులు. కారణము ఏమిటి? మనము అనేక పాపములను చేసినప్పటికీ, మనలను దూషించేవారు ఆపాపములను హరిస్తారు. అందువలవవే "పరిహాసమ్ పాపనాశనమ్" అన్నారు. నిజముగా మన పాపములను హరించేవారే మనకు మిత్రులు. పాపములను అభివృద్ధి పరచేవారే మనకు శత్రువులు, ప్రహ్లాదుడు తన తండ్రితో "వైరెవ్వరు చిత్తంబె వైరి కాదె" అన్నాడు. "దేశము లన్సియిన్ గడియలోన జయించినవాడ నింద్రియానీకముఁ జిత్తమున్ గెలువనేరవు" అన్నాడు. కనుక ఇంద్రియ నిగ్రహము కావాలె. ఇంద్రియముల నరికట్టు ప్రయత్నమునకు ఆత్మవిశ్వాసము, దైవవిశ్వాసము అత్యవసరము. ఇవి లేకపోతే ఇంద్రియ నిగ్రహము కష్టము. ఈ రెండూ లేక ఎట్టి ప్రయత్నము చేసినా ఆది నిష్ఫలమే...
(వి.పు.135)
(చూ|| కలియుగం, భక్తుడు, భగవంతుడు, శ్రీరాముడు)