మూడు జన్మలు

ప్రేమస్వరూపులారా! “దిక్కులేనివానికి దేవుడే దిక్కు" అను సామెతను వినియుందురుగదా? ఒకదిక్కు లేని భక్తుడిఘోరవ్యాధితో బాధ నొందుచు. నార్తుడైనన్ను పిలచినందున వానికి రక్షణనిచ్చి వాని వ్యాధిని నేను గైకొంటిని. భక్తసంరక్షణమే నా ధర్మము. నా పూర్వ శరీరమునందును నిట్టి భక్త రక్షణలు జరిపి యుంటిని. ఇది నా లీల. షిర్డి యవతారమందు సముద్రము. నదులను త్రిప్పికొట్టవచ్చునుగాక! నేనుమాత్రము నాభక్తుల నెన్నడు మపేక్షింపను. అని బాబా చెప్పియుండలేదా? "చాల కాలము నుండి మీకొక రహస్యమును చెప్పక దాచియుంటిని. ఈ పవిత్రదినమున మీ కారహస్యమును దెలుపుచున్నాను. శ్రద్ధతో నాలకింపుడు. నేను శివశక్తిని - (అర్ధనారీశ్వరుడను) భారద్వాజుడను ఋషి కొసంగిన వరప్రకారము నేను

నాశ క్త్యంశమున షిర్డి బాబాగ భరద్వాజ గోత్రమున నవతరించితిని. ఇప్పుడును

నా శివశక్త్యంశలతో ఆ భరద్వాజ గోత్రమునందే, పుట్టపర్తియందు నవతరించితివి. రాబోవు మూడవ జన్మయందును నా భారద్వాజ గోత్రమందే యొక శివాంశముతో మాత్రమే మైసూరులో నవతరింపగలను. ఈ దేహముందు కుడి భాగము శివునిది. ఎడమభాగము శక్తిదని జ్ఞప్తి యందుంచుకొనుడు. ప్రస్తుత వ్యాధికి కారణము చెప్పుచున్నాను వినుడు. పూర్వము కైలాసములో అర్ధనారీశ్వరులమగు (శవ-శక్తి)మమ్ము దర్శించుటకు భరద్వాజ మహర్షి వచ్చెను. ఏకారణముననో ఆ మహర్షిని పార్వతిగమనించకుండ నుండెను. అట్లే నిల్చియుండుటచేత భరద్వాజానికి పక్షవాతము సంభవించెను. అంతట శివుడు మంత్రజల ప్రోక్షణ చేసి భరద్వాజుని వ్యాధిని పోగొట్టెను. ఆనాటి దోషమే (పాపఫలమే) ఈ దేహ ఎడమ భాగము. (శక్తి). యీనాడు 8 రోజులును ఘోర పక్షపాత బాధ ననుబవించిన పిమ్మట, కుడి భాగము (శివుడు) మంత్రజల ప్రోక్షణము చేతనే నివారించుటను మీరు ప్రత్యక్షముగ చూచితిరిగదా? ఇట్టి రహస్యములు మానవులు తెలియజాలరు. ఇది యసలు విషయము. కాని ప్రస్తుతమీ దీనభక్తుని రక్షణ నెపమున ఆనాటి పాపఫలమును నీ దేహమందలి శక్తి భాగముచేత ననుబవింపజేసి, శివుని భాగముచేత శక్తి భాగపు బాధను మీ యెదుట జలప్రోక్షణముచేత బాపితివి. ఇట్లుభక్తరక్షణమును, శక్తి పాప ఫలమును రెంటిని యేకకాలమున ఈ దేహము ద్వారా యనుభవింపజేసి చూపితిని. ఈ 8 రోజులును మీరు భయాందోళనములతో గడిపితిరి. ఇదే మీకందఱకును యానందమును గూర్చుచున్నాను. (హర హర శివ శివ సుబ్రహ్మణ్యం! శివ శివ హర హర సుబ్రహ్మణ్యం! గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం! అని భజన చేయించెను.

అంతట మామూలుగ మెట్లనెక్కి మిద్దెపైకిపోయి వరండా నుండి దిగువనుండు భక్తుల నుద్దేశించి, మరుసటి దినముదయము 6-30 గంటలకు పాద నమస్కారము నిచ్చెదనని సెలవిచ్చెను. ఆ రాత్రి సుమాఱుగ బాబా భుజించెను. ఆరాత్రియంతయు భక్తులు బాబా మహిమలను తలచుకొనుచు పరమానందములో పరస్పరము చెప్పుకొనుచు గడిపిరి. మరుసటి రోజు సాయంకాలమును బాబా యుపన్యసించెను. దుష్టప్రచారములను నమ్మవలదనెను.) ఈ యవతార కార్యక్రమమున కెన్ని యాటంకములు కలిగినను, కార్యక్రమము నిలువక సాగిపోవుచునే యుండును. కృష్ణావతారమునందు నొక్క గోవర్ధనగిరినే యెత్తవలసి వచ్చెను. ఈ యవతారమునందో: యట్టి గిరుల నెన్నింటినోయెత్తవలసియున్నది. గంగానది లోకమునకు మేలు చేయుటకై నిరాఘాటముగా ప్రవహించుచున్నది గదా! ఒక్కనికాపాడుటకై పెక్కు మంది భక్తులను దుఃఖసాగరములో ముంచుట ధర్మమా యని నన్నొకరు ప్రశ్నించిరి. కాని భక్తరక్షణమే నా ధర్మమైనందున నట్టి నాకార్యముల వలన నితరులకు కించిత్ బాధ కలిగినను నేను లెక్కచేయను. శ్రీరామచంద్రమూర్తి తండ్రి యాజ్ఞను పరిపాలించెనే గాని. అయోధ్యా ప్రజల దుఃఖమును శమింపయుటకు ప్రయత్నించేనా? దు:ఖ తప్తుడైన భరతుని ప్రార్థన నంగీకరించి అయోధ్యా పట్టణమునకు తిరిగి వచ్చేనా? నేనిట్లు భక్తరక్షణను, కష్టములకు సహించియైన చేసినప్పుడే భక్తులు నా యాదర్శమును గ్రహించి, తాము నట్లే నడుచుకొందురు. ఇంద్రుడు బృందావనముపై కుంభవృష్టిని గురిపింప వరుణు నాజ్ఞాపించి నప్పుడు కృష్ణుడు వరుణుని ఇంద్రు నాజ్ఞనుల్లంఘింపమని కోరెనా? కుంభవృష్టి కురియగా, ఆ వర్థమును నివారింపవేసి గోవర్ధనగిరినెత్తిగోపికా గోపకులకు తన మహిమను - జూపెనుగదా? అట్లే నాడును భక్తరక్షణమును చేసి, భగవన్మహిమజూపెనుగదా? అట్లే నేడును భక్తరక్షణమును జేసి, భగవన్మహిమ వెల్లడింపబడినది. ఈ 8 రోజులు మీరు పడిన యాందోళన, కష్టము నాయందు మీకుగల యచంచల భక్తి నిరూపణమగు చున్నది కదా? అతి శీఘ్రముగా నా వ్యాధి నివారణము కావలెనని మీరు ప్రార్థనముల, వ్రతముల, నుపవాసముల నెన్నింటినో జేసితిరిగదా? ఇట్లు మీరు చేసినదంతయు నావలన మీరు పొందగల యుద్ధరణము కొఱకే గదా?

(స.శి.సు..ద్వి పు. 75/78)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage