నీట మునిగిపోవువానికి ఏ చిన్నపుల్ల అయిన కూడా ఆధారమగును. అట్లే సంసార సాగరమున మునిగిన వారికి ఏ కొంచెము మంచిగా మాట్లాడిననూ అదే జీవితమునకాధారము కావచ్చును. చేసిన మేలు వ్యర్థము కాదు. చేసిన కీడుకూడా వృథాపోదు. కనుక లేశ మాత్రము కూడా చెడ్డ సంస్కారము కలుగనీయక, కనులు పవిత్రములై యుండునట్లు చెవులు నిందావాక్యములను వినక సాధ్యమైనంతవరకు భగవద్వాక్యములు, సద్విషయములు వినుచుండునట్లు, నోరు మంచి మాటలనే, భగవత్ స్మరణనే, సత్య వాక్కునే, పలుకు చుండునట్లు సదా ప్రయత్నించవలెను. ఇట్టి జాగరూకలలో నుండిన చివరకు విజయము కలిగి తీరును.
(జ.పు.75)