ఆనందమును. ప్రశాంతతను అర్జించు వారందరూ మోక్షమును అర్థించినట్లే. ఆనందమును, ప్రశాంతతను ఆర్జించని వారెవరు? నీకు శాశ్వతానందము, శాశ్వత ప్రశాంతత లభించినప్పుడు మోక్షము ప్రాప్తించును. తాత్కాలికానందముతో, అస్థిరమైన శాంతితో అలసట చెందిన మానవుడు తుట్టతుదకు శాశ్వతానందమునకై, శాశ్వత ప్రశాంతతకై కృషిచేయును. అదే మోక్షాన్వేషణము. శాశ్వతానందమును, శాశ్వత ప్రశాంతతను పొందు మార్గము తెలిసినవారు ఇంద్రియ భోగలాలసత్వమనే డొంక దారుల వెంట పరువెత్తరు.
(ప.ప్ర.పు6)