భారతదేశంలో ఉన్న జీవనదులు ఏ దేశంలోనూ లేవు. భారతదేశంలో అన్నపూర్ణను అందించేటటువంటి సారవంతమైన సువిశాలమైన భూములు కూడా ఉన్నాయి. కానీ వీటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. గంగా, కావేరి, కృష్ణా, గోదావరి మొదలైన జీవనదులెన్నో భారతదేశంలో ఉన్నాయి. దేశంలోని నదీజలాలన్నింటిని జాతీయ ఆస్తిగా ప్రకటించితే ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఈనాడు ఒక నది కర్ణాటకదని మరోనది మహారాష్ట్ర దని భావిస్తూ నదీ జలాల పంపిణీ విషయంలో పోరాటం చేస్తున్నారు. ఈ భేదం ఎవరు పెట్టారు?
కొందరు స్వార్థపరులో ఆవేశపరులో పెట్టిన భేదం ఇది. ఇది దేశము యొక్క ఆస్తి. ఇది జాతీయ సంపద. నీటిని అందరూ ఉపయోగించుకోవచ్చును. ఐకమత్యం లేక ఇది నానది, అది నీనది అని తేడాలు రావడం చేతనే, చివరికి అంత జలమూ సముద్రములో వృధాగా చేరిపోతున్నది. ఇది మన సంపద, మనందరిసంపద. ఇట్టి విశాలమైన త్యాగ భాగమును అంతా పెంపొందించుకోవాలి. ,
(శ్రీ.. సా.గీ.పు,285/286)