కల్పవృక్షమువంటివాడను! యెవరు దేనిని కోరిన అది అందించుటే నా కర్తవ్యము, వ్యక్తుల భావనాను కూలము ననుసరించుచూ, దానికి తగిన ఫలమును ప్రసాదించు చుందును. ద్వేషము కాని, భేదముగాని, పక్షపాతము కాని నాకు యేనాడునూ లేదు; రాదు. నిర్ణయ నా నీడను కూడా తాకలేదు; నాలో యెట్టి వైషమ్యమునూ ఆరోపించుటకు వీలులేదు. ప్రకాశించు సూర్యుని కిరణములు తనకు యెదురైన వాటిపైనంతా వ్యాపించును. తనకు మరుగైన వాటిని తానెట్లు ఆక్రమించును! అటులనే నేనూ, ఏ విధమయిన అభీష్టములను కోరుదురో ఆ యభీష్టములను తీర్తును. కనుక ఉత్తమభావముల వృద్ధి చేసుకొన్న ఉత్తమస్థానమును, అల్ప భావములు వృద్ధి చేసుకున్న అధమస్థానమును అందింతును. దీనికి భక్తుల భావదోషములు తప్ప భగవంతుని అనుగ్రహలోప మేనాడునూ లేదు.
(గీ.పు.68)
(చూ॥ జ్ఞానసిద్ధి)