ప్రహ్లాదుడు భగవచ్చింతన తప్ప చింతన ఎరుగడు. అతని దృష్టిలో ఏనుగు, పాము, విషము, అగ్ని అన్నియు నారాయణ స్వరూపములే. అవి ఎట్లాతనకి హాని చేయగలవు? నీ హృదయమును ముట్టడించి పీడించు రాజస తామసగుణములనెడు హిరణ్యకశిపుని పాలిటికి భగవన్నామము నృసింహావతారము వంటిది. వైద్యులిచ్చు కాల్షియం ఘటికలు, విటమిన్ ఘుటికలు రక్తహీనతయను వ్యాధిని పోగొట్టునట్లు నామఘుటికలు మానసికాందోళన మను వ్యాధిని పోగొట్టును. భగవన్నామమును నోరార కీర్తింపుము. నాలుకపై నామము ఇంటి గడప పై దీపమువలె లోపల వెలుపల గూడా వెలుగును ప్రసరింపజేయును.
(నా.పు.8)