నిగ్రహము ఉంటే అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఒక ఉదాహరణ: నీవు కంసాలి చేతికి బంగారం ఇచ్చి నీకు కావలసిన ఆభరణం యొక్క డిజైను చెపుతావు. నీవిచ్చిన బంగారం యొక్క బరువును వ్రాసుకుంటావు. అంతేగాని, దీనిని కాల్చకూడదు. సుత్తితో కొట్టకూడదు, ముక్కలుగా కట్ చేయకూడదు" అని నిబంధనలు విధిస్తావా? నీకు కావలసింది నీవు కోరుకున్న డిజైనులో అదే బరువుగల బంగారు నగయే కదా! నేనూ అంతే. మీ Manners (మర్యాద) Behaviour (నడత) Discipline క్రమశిక్షణ) - ఈ మూడింటిని సరిచేసి మిమ్మల్ని బంగారు నగ గా మారుస్తాను. మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. Boy కి Behaviour బాగుండాలి, Man & Manners బాగుండాలి Devotee కి (భక్తునికి) Discipline (క్రమశిక్షణ) ఉండాలి. "మనిసి’ని త్రిప్పి చదివితే సినిమ అవుతుంది. అలాంటి కృత్రిమమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈనాటి మానవులు అలాంటివారు నన్నెలా గుర్తించగలరు?
(స. సా.మే99పు.139)
(చూ సంయమము)