నీతి

నీతియమము లేక తిరిగిన - ధాతకైన అజ్ఞాన మొదగదు

జ్యోతిలేనిది అంధకారము - భూతలంబున లేదటంచును

కన్ను విప్పి చూడరోరన్నా - ఈ దేవదేవుని

యెన్నగా యెందైన కలడన్నా !

(శ్రీస.వి.వా.పు.43)||

 

మనకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీసంఘానికి మేలు చేయాలన్న భావం లేకపోతే చదువుల వల్ల ఉపయోగం ఉండదు. సద్గుణాలుసంస్కృతినాగరకతనీతి లేకపోతే విద్య ఏ విధమైన ప్రఖ్యాతిని కలిగించదు.

(లో.పు.75)

 

దేశకాల మతముల నియమములననుసరించి ఆచరించే సదాచారమే నీతి. దీనినే ప్రవర్తననడతసదాచారము అని చెప్పవచ్చును.

(వ.1984.పు.84)

 

జాతి గౌరవంబు నీతిపై నిలుచును

నీతి లేక యున్న జాతి చెడును

నీతి గల్గుజాతి నిజమైన జాతిరా

 వినుము భారతీయ వీరసుతుడా.

 

మానవజాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలతో కూడిన మానవత్వముపై ఆధారపడి ఉంటుండాది. ఈనాడు విద్యార్థులు పోషించుకొన వలసినది మానవత్వము. ఈ మానవత్వము ఆధ్యాత్మిక వాతావరణమునందు మాత్రమే అభివృద్ధి కాగలదు. అన్యవాతావరణములందు అభివృద్ధి అగుటకు అవకాశములేదు. విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలము లభిస్తుంది. అట్లు కాక బీజములు ఒక టిన్నులో ఎట్టి నీరుపోస్తే కుళ్ళిపోతుంది. నీతినిజాయితీలు మానవతా హృదయమునందు మాత్రమే అభివృద్ధి అగుటకు అవకాశమున్నది. మావనత్వానికి సద్గుణములకు ఆధారము నీతి! నడత యొక్క పరిపూర్ణతయే నీతి. భోగభాగ్యములు సిరిసంపదలు నీతి పైననే ఆధారపడి ఉంటున్నవి. నీతి మానవుని ఉన్నతస్థాయికి గాని పోతుంది.

 

ప్రాచీన కాలమునుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతినిజాయితీలను బోధించిన దేశము. నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు. నిత్య నిలయాలునీతియే లేకుండిన మానవజాతియే పోతుంది. ఈనాడు దేశమునకు అవసరమైనది నీతియే. నీతి అన్ని సమయములయందు సర్వత్ర అత్యవసరంగా పాటించాలి. మార్షల్ పోప్ యుద్ధ సమయమునందుగానిప్రాణాపాయ సమయమునందుగాని ఎట్టి కఠినమైన స్థితి యందైనను గాని నీతిని విసర్జించకూడదని బోధించాడు. విక్టోరియా రాణి ప్రధానమంత్రి ఐన విలియమ్ గ్లా డ్  స్టన్ నీతి నిజాయితీ లను సర్వకాలముల యందు పోషించినాడు. కనుకనే విక్టోరియా రాణి కంటేను ప్రధాన మంత్రిని ప్రజలు గౌరవించేవారు.

 

ఈ నీతి ఇంద్రియనిగ్రహము చేత అలవడుతుంది. ఎవరిని వారు శాసించుకో తగిన శక్తి కలిగిన వారే ఇతరులను శాచటానికి అధికారులౌతారు. తనను తానే శాసించుకోలేని బలహీనుడు ఇతరులను ఏ రీతిగా శాసించగలడు. తన మాట తన ప్రవర్తన రెండింటిని గావించే జీవితమును గడపాలి. ఈ విధముగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైన విభూతులను అనుభవించగలడు.

(బ్బ.పు.139/170/171)

 

నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయె హృదయమంతయు దుర్గంధ సదనమయ్యె చేతలన్నియు స్వార్థంపు చేతలయ్యె ఇదియె ప్రోగ్రెస్సు ఈ నాటి విద్యార్థులందు,

కృష్ణ/మచిలీపట్నం ,  మార్చి – 2020  15  సంపుటి -36  సంచిక – 03  శ్రీవాణి

 

(చూ॥ అవినీతిఇస్లామ్బెస్ట్ ఫ్రెండ్స్మానవ జీవితము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage