వాక్కు ద్వారా మీశీలం వెల్లడి అవుతుంది. మీ అనుభూతులను ఇతరులకు తెలిపి, సమాచారం చెప్పి వాళ్ళను వివేకవంతులను చేయగలదు. కాబట్టి, మాటల విషయంలో జాగ్రత్త చూపండి. కాలుజారితే తగిలే దెబ్బ నయమవుతుంది. కాని, నోరుజారితే కలిగే గాయం, మానదు. ఈశ్వరాను గ్రహమే అసలు సంపాదించ దగిన ఐశ్వర్యం. ఆయనే మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడగలరు. ఈ విషయంలో సందేహం వద్దు.
(శ్రీసూ .పు.68)
(చూ|| నరజన్మ)