దురదృష్టవశాత్తు ఈనాడు న్యూస్ ను మాత్రమే తీసుకోకుండా న్యూసెన్సును తీసుకుంటున్నారు. న్యూసెన్సు కాదు మనకు కావలసింది. చక్కని న్యూస్ కావాలి. ఏమిటి ఈ NEWS? N-North, W-West, E -East, S-South. East, West, North, South. అన్నింటి యందు ఏకత్వంగా ఉండిన దివ్యత్వాన్ని మనం తీసుకోవాలి. ఐతే ఈనాటి సైంటిస్టులలో కూడా North, South, East, West అనేది లేదు. ప్రాకృతమైన జీవితము న్యూస్ మనము గడుపుతున్నాము. కనుక ఈనాడు North, South, East, West అని చెబుతున్నాము. ఇది సత్యము కాదు. సత్యము కానిదాన్ని మీరు అనుసరిస్తున్నారు. సూర్యోదయము తూర్పు న అవుతున్నదని అంటున్నారు. Sunset West న అంటున్నారు. It is not right, complete wrong. ఎట్లనగా సూర్యుడు ఉదయించడము లేదు. అస్తమించడం లేదు. సూర్యుడు ఉన్నచోటే ఉన్నాడు. మనం తిరుగుతూ ఉండటం చేత East, West గా అవుతున్నది. సత్యము విచారించుకుంటే దైవము ఒక్కడే. ఏకత్వము. ఆదే ఉన్న స్థిరత్వము. దీనినే వేదాంతము అన్నారు.
(భ.మ.పు.10)