ప్రేమ దిక్సూచివంటిది. దిక్సూచిని ఎక్కడ పెట్టినా దీని ముల్లు ఉత్తర దిశకే ఉంటుంది. అదేవిధముగా ప్రేమ, ఏ ప్రదేశమునందైనా, ఏ పరిస్థితులందైనా దైవము వైపునే మరలి ఉంటుంది. ఈ ప్రేమకు దేశకాల పరిస్థితుల ప్రభావము ఏమాత్రము వర్తించదు. ఇట్టి పవిత్రమైన ప్రేమతత్వమే దైవత్వమునకు ప్రధాన చిహ్నము.
(ద...98 పు85)