రాముని కంటే రావణుడే ఎక్కువ విద్యలు చదివాడు, అయితే రాముడు తాను నేర్చిన విద్యలను ఆచరణలో పెట్టి జీర్ణించుకున్నాడు. కనుకనే అవి అతనికి శక్తిని, పుష్టిని అందించాయి. కాని రావణుడు తాను నేర్చిన విద్యలను ఆచరణలో పెట్టకపోవడం వలన అజీర్ణరోగం బయలు దేరింది. అజీర్ణరోగం’ వల్ల అన్ని అప్రమాణ బుద్దులే అభివృద్ధి అయినాయి. దేహానికి కడుపే కేంద్రము. కడుపు చెడిపోతే దేహమంతా చెడినట్లే! అదేవిధంగా తలలో దుర్బుద్దులు ప్రవేశిస్తే జీవితమే నాశనమవుతుంది.
(శ్రీ. భ. ఉపు.84)
(చూ॥ దుష్ప్రచారములు, శివరాత్రి)