ఈనాటి నుండి స్త్రీలు పురుషులు కాని ఇతరుల తప్పు పెద్దదైననూ చిన్నదిగా తీసుకోండి. మీ చిన్న తప్పును పెద్దదిగా భావించండి. అప్పుడింక తప్పులే చేయరు. పరులలో ఉన్న మంచిని చూడండి. పరులలో ఉన్న మంచిని చూస్తే మీరు కూడా బాగుపడగలరు. మీలో ఉన్న చెడును చూస్తే మీరు సరిదిద్దుకోగలరు. కాని, ఈనాడు పరులలో ఉన్న తప్పులనే వెతుకుతున్నారు. తెలుగులో ఒక సామెత ఉంది. "దుష్టులు తప్పులను వెతుకుతారు. కుక్క చెప్పులను వెతుకుతుంది" దుష్టునికి కుక్కకు ఏమీ వ్యత్యాసం లేదు. కనుక, మీరు కుక్కలు కాకూడదు.Dog కాకూడదు. God కావాలి. మనం చక్కదిద్దుకొని తిరిగి అలాంటి తప్పులు రాకుండా చూసుకోవాలి. మనం ఏ తప్పు చేసినప్పటికీ దాని ఫలితం మననే బాధిస్తుంది. ఎవరికో చెడ్డ చేస్తున్నామని భావించరాదు. మనకు మనమే చెడ్డ చేసుకుంటున్నాము. మనమే చెడిపోతున్నాము. మనకు చెడ్డ పేరు సంపాదించుకుంటున్నాము. కనుక, మనమంతా మంచి మనసులో జీవించాలి.
(శ్రీభ.ఉపు.185/186)
(చూ|| ధర్మోద్ధరణ, రాక్షసత్వం)