ఫోటోగ్రాఫరు ఫోటో తిసేముందు ‘రెడీ అంటాడు. అతను రెడీ" అన్నప్పుడు మనం స్టెడీ గా ఉంటే ఫోటో చక్కగా పడుతుంది. అతడు రెడీ అని చెప్పక మునుపు ఎటు తిరిగినా ఫరవాలేదు. కాని, భగవంతుడనే ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు. ఎప్పుడు తీస్తాడో ఏమిటో! కాబట్టి మీరు ఎప్పటికీ రెడీగా ఉండాలి. అప్పుడే ఆ హృదయంలో మీ చిత్రము చక్కగా చేరిపోతుంది. భగవంతుడొక పెద్ద ఫోటోగ్రాఫర్. కాని, రెడీ అని చెప్పడు. ఎప్పుడు తీస్తాడో మీ పిక్చరు! కనుక, మీరు ఎప్పుడూ రెడీ గానే ఉండాలి. దేనికైనా రెడీగా ఉండాలి. Always be ready అదే సరియైన తత్వము.
(శ్రీ భ...పు.200)