కర్మదాటవశమా నరుడా కర్మదాటవశమా
ధనికుడు త్రుటిలో బికారికాడా
పండితుడింతలో పశువైపోడా
క ర్రేపామై కరువనురాదా
కర్మే హేతువు కర్మే మూలము "కర్మ"
చిన్న చెలిమిలో ముంచినగానీ
ఎన్ని సముద్రముల్ నించినగానీ
కడవెంతోరా నీరంతేరా
కావాలన్నను యెక్కువ రాదురా "కర్మ"
అని చక్కగా రాగాలాపనలో పాడేవారు
దయచేత ధన్యులు కావలేరా, యెంతటివారు. “దయ”
అసురుడైనా భూసురుడైనా ఆఖండ తెలివి
కలవాడైనా "దయ”
కాషాయ వస్త్రము వేసినగాని కంఠమాల ధరియించినగానీ
గడగడమని జపమాల త్రిప్పినా
కడకు నీ యొద్దకు రావలె బాబా "దయ"
విద్య నేర్చి వా దాడినగానీ
పద్యము లెంతో పాడినగానీ
బాగుగ గడ్డము పెంచిన గానీ
పట్టెనామాలు పెట్టినగాననీ “ దయ"
(ఆ.శ.నా పు.11)
"శీర్షిపీఠికమునందేమున్నదోగాని, మ్రోగుచున్నది నిన్నుమ్రొక్కినపుడు హృదయ పీఠము నందేమున్నదో గాని, తోణు కుచున్నది. నిన్ను తలచినప్పుడు ఈమనః పీఠమునందేమున్నదోగాని, జారుచున్నది. నిన్ను కోరినపుడు"
పాటువైనది చెట్టురా. పట్టునైనది కొమ్మరా
పాటు తప్పి పట్టు విడచితే పరబ్రహ్మమే చేరురా
సారమైనది చమురురా. సత్యమైనది వత్తిరా
వెలుగుతీరిపోయేటపుడు వెంట యెవ్వరూ రారురా"
వత్తిరాదు, నూనె రాదు, మరి తాను యెక్కడవుంటాడురా
అంటే,
కోటయేడు చుట్టరా. కోటలోపల తోటరా
తోటలోనికి పోదమంటే, దారి తెలియదు యెట్టరా॥
మదిలో పొంగే ప్రీతిపూట. అనురాగమనే ఆ నీట
తడుపబడిన హృదయతోట. ప్రేమమొలక అందులో నాట
మనసులోని మనమాట. ఆదియే మధురబాట!
(ఆ.శ.నా. పు.206)
"సిరులను కోరను. సర్వ భాగ్యతలుల చెల్లారనిమ్మంచు నే
వరముల్ వేడను. నెల్లవేళలా భవత్పాదారవిందంబు.
నా యురమందుంచు, శక్తి నిమ్మని సదాయుల్లంబున గోరితి
తరమా నిన్ను నుతింపనాకు. దయలేదా సత్యసాయి ప్రభూ"
(ఆ.శ.నా. పు.18)