మనస్సుకు ఎటువంటి జ్ఞానమూ లేదు. విద్యగా మనము భావించేది పుస్తక పరిజ్ఞానము. ఈ జ్ఞానముతో పాటు తాత్త్విక జ్ఞాన సముపార్జన జరుగవలెను. తాత్త్విక భావన మత సంబంధమైనది కాదు: అది భగవత్ప్రేమ. ఇది నామ స్మరణ వలన, కీర్తనల వలన, ఆధ్యాత్మిక ఆలోచనల వలన, భగవదైక్యము చెందవలెననే వాంఛ వలన సంస్కరింప బడుతున్నది. దీనిని సముద్రపు నీటిలోని బుడగలతో పోల్చవచ్చును. బుడగలు పగిలిపోయినపుడు అవి తమ ఆస్తిత్వమును కోల్పోయి తానే భగవంతుడగును. సాత్త్విక భావన అలవరచుకుంటే దానినుండి సంకల్ప శక్తి ఆవిర్భవించును. సంకల్ప శక్తిలేని స్థానము నిరుపయోగము. సంకల్ప శక్తి తాత్త్విక చింతన వలననే లభించును. సంకల్ప శక్తిచే ఆత్మ శక్తి నేరుగా తెలిసికొనబడుచున్నది.
(ప. పు.97/98)