సందేహాలు - సమాధానాలు

ఈ కాన్ఫెరెన్స్ లో పాల్గొంటున్న డెలిగేట్ల నుండి నాకొక లెటర్ వచ్చింది. అందులో కొన్ని సందేహాలు వ్యక్తం చేయబడినాయి. నిజంగా ఈ సందేహాలకు మూలకారణం పరిపూర్ణ విశ్వాసం లేకపోవడమే. దైవంపై పరిపూర్ణ విశ్వాసం ఉన్నవానికి సందేహాలు రావడానికి అవకాశమే లేదు. జీసస్ శిష్యులలో ఒకడైన థామస్ అన్నింటిని అనుమానించేవాడు. కనుకనే అతనికి డౌటింగ్ థామస్" అని పేరు వచ్చింది. అయితే సాధనా మార్గంలో సందేహాలు సహజంగానే వస్తుంటాయి. దైవం పైన విశ్వాసం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. ఈ లెటర్లో ఆడిగిన మొట్టమొదటి ప్రశ్న.

 

జీసస్ "నేనే సత్యాన్ని, నేనే సరియైన మార్గం చూపేవాడిని, నన్ను మించినవారు ఈ జగత్తులో లేదు" అని చెప్పాడట.

 

ఇది తప్పా, ఒప్పా?

 

మీరు చక్కగా విచారణ చేస్తే ఇది సత్యమో, అసత్యమో మీకే తెలుస్తుంది. జీసస్ నేను సత్యాన్ని నేనే కాపాడేవాడను.నేనే మిమ్మల్ని సమస్త బాధల నుండి రక్షించేవాడను" అని ఎప్పుడూ చెప్పలేదు. అతనికి ఎట్టి సమయమునందు అహంకారము లేదు. ఒక ట్యా క్స్ కలెక్టర్ బెస్తవారి దగ్గర కూర్చొని జీసస్ మాట్లాడేవన్నీ వ్రాసుకొనేవాడు. బెస్తవారితో మాట్లాడే సమయంలో, వారికి ఉత్సాహము, ధైర్యము అందించే నిమిత్తమై జీసస్ "నేను చూసుకొంటాను" అన్నాడు. అంతేగాని "నేను చూసుకొంటాను నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చినవాడను" అని అహంకారంతో చెప్పలేదు. ఆ చిన్న వాక్యమును ఆధారం చేసుకొని అనేకమంది పండితులు. అన్ని తానే చూసుకొంటానని ఎవరికీ ఏ ఆపదా లేకుండా తానే కాపాడుతాననీ జీసస్ చెప్పినట్లుగా చెపుతున్నారు. జీసస్ పుట్టిన సమయంలో ముగ్గురు అరేబియన్ రాజులు వచ్చారు. వారిలో ఒకడు ఈ బాలుణ్ణి చూసి "ఇతను దేవుని దూతవలె కనిపిస్తున్నాడు నాకు" అన్నాడు. "దేవుని దూత కాదు. దేవుని కుమారునిగా కనిపిస్తున్నాడు" అన్నాడు రెండవవాడు. "కాదు కాదు; తండ్రి, కొడుకు ఇరువురూ ఒక్కటే" అని చెప్పాడు మూడవవాడు.

 

జీసస్ కరుణామయుడు అతనికి ఏనాడూ ఆహంకారమే లేదు. బాధ పడేవారిని చూస్తే అతని హృదయం ద్రవించేది. ఈ ప్రపంచంలో మంచిని చెడ్డగాను, చెడ్డను మంచిగాను భావించే వ్యక్తులు అనేకంగా ఉంటారు. జీసస్ లో ఏ దోషమూ లేదు. అతడు అందరిని దైవమార్గంలో ప్రవేశ పెట్టాలని ఆశించాడు. కాని పాల్ అనే వ్యక్తిమొట్టమొదటి నుండి జీసనను విమర్శించేవాడు. కొంతకాలం జరిగిన తరువాత జీసస్ అతనికి స్వప్నంలో కనపడి "పాల్! నీకు నేనేమి ద్రోహం చేశాను? ఎందుకు నన్నింతగా విమర్శిస్తున్నావు?" అని ప్రశ్నించాడు. దానితో పాల్ తన దోషాన్ని గుర్తించి తన అజ్ఞానానికి పశ్చాత్తాపపడి జీసస్ యొక్క భక్తునిగా మారి పోయాడు. తరువాత అతనికి "సెయింట్ పాల్అని పేరు వచ్చింది.

 

జీసస్ కట్టకడపటికి శిలువ వేసే సమయంలో "ఓ ఫాదర్! నేనేమి తప్పు చేశాను? నన్నెందు కేవిధంగాశిక్షిస్తున్నావు?" అని గట్టిగా ప్రార్థించాడు. అతని తల్లియైన మేరీ వచ్చి ఏడుస్తున్నది. అప్పుడు అశరీరవాణి వినిపించింది. All are one my dear son, be alike to everyone  అనగా, అందరూ ఒక్కటే. అందరిపట్ల సమరస భావంలో వర్తించాలి. భగవద్గీతయందు కృష్ణుడు “చాతుర్వర్ణ్య మయా స్పష్టం" అన్నాడు. వర్ణము అనగా వేర్వేరు కులములని మీరు భావిస్తున్నారు. కాని కృష్ణుడు అలా చెప్పలేదు. నాలుగు వర్ణములవగా నాలుగు రంగులని అర్థం. జపాన్ వారు, బ్రిటీష్ వారు తెల్లగా ఉంటారు; చైనీయులు పచ్చగా ఉంటారు. రష్యన్లు ఎఱ్ఱగా ఉంటారు; భారతీయులు నీగ్రోలు నల్లగా ఉంటారు. ఈ నాల్గు వర్ణములవారిని తానే సృష్టించానని అన్నాడు కృష్ణుడు. భగవంతుడు చెప్పే ప్రతి మాట విశాలమైన భావంలో కూడియుంటుంది. కనుక మీరు సంకుచిత భావాలకు, సందేహాలకు అవకాశం ఇవ్వకండి. మీరు క్రిష్టియన్లు కావచ్చు హిందువులు కావచ్చు. ముస్లింలు కావచ్చు. జోరాష్ట్రీయన్లు కావచ్చు. ఏమతంవారైనా సరే. దైవం ఒక్కడే అని విశ్వసించండి.

 

జీసస్ మొట్టమొదట తనను తాను పర్సోనా గా వర్ణించుకొన్నాడు. రోమన్ భాషలో పర్సోవా అనగా పవిత్రమైనవాడని, దైవత్వంతో కూడినవాడని అర్థం. పర్సోనా అనే పదము నుండియే ఆంగ్లభాషలో పర్సన్ అనే పదం ఏర్పడింది. దీనినే భారతీయులు పురుష:’అన్నారు. మానవునియందు దైవత్వం ఉంది కాబట్టే మానవునికి పర్సన్ అని పేరు వచ్చింది. దైవత్వం సర్వులయందూ ఉన్నది. ఈనాడు మీరు చేయవలసినది ఏమిటి? అనే కత్వంలోని ఏకత్వాన్ని దర్శించాలి. అదియే సత్యసాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యం. భేదములకు, ద్వేషమునకు అవకాశం ఇవ్వకూడదు. అందరియందున్నది ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి. ప్రచారం కాదు, ఆచరణ ప్రధానం. మీ మాటలు హృదయం నుండి రావాలి. దానినే Expansion Talk అన్నారు. కొంతమంది కేవలం తాత్కాలిక తృప్తికోసం హృదయంలోసంబంధం లేకుండా మాట్లాడుతుంటారు. దానిని Contraction talk అన్నారు. హృదయం నుండి మాట్లాడేవారు సత్యాన్ని అనుసరిస్తుంటారు. కేవలం పెదవుల నుండి మాట్లాడేవారు ఆసత్యానికి పాల్పడుతుంటారు. ఎవరేది చెప్పినా సత్యంగానే అనిపించవచ్చు. కానీ అది మీకు అన్వయిస్తుందా, లేదా అని విచారణ చేసుకోవాలి.

 

ప్రతి మానవునియందు సత్యము, అసత్యము, ధర్మము, అధర్మము, హింస, అహింస అనేవి చేరి అనేక మార్పులు కలుగుతున్నాయి. దీనికొక ఉదాహరణ: నీ దగ్గర పరిశుద్ధమైన బంగారమున్నది. కాని కొంత కాలమునకు దానికి వెండి చేర్చావు. తరువాత రాగి చేర్చావు. మరి కొంతకాలమునకు ఇత్తడి చేర్చావు. ఈ విధంగా అనేక లోహములు చేర్చుటప్పటికి ఏమైంది బంగారానికి? దాని స్వస్వరూపం మరుగున పడి పోయింది. మానవుడు కూడా అంతే! పుట్టినప్పుడు పవిత్రంగా ఉంటున్నాడు. కాని క్రమ క్రమేణ అందరితో చేరడంచేత తనిలో సత్యము, అసత్యము, న్యాయము, అన్యాయము, హింస, అహింస ఇత్యాది గుణములు ప్రవేశిస్తున్నాయి. తద్వారా సుఖ దుఃఖములు ఏర్పడుతున్నాయి. జనన మరణములకు మూలకారణం ఇదే. పవిత్రమైన ఆత్మగా ఉన్నప్పుడు జనన మరణములకు అవకాశమే లేదు.

 

కానీ శరీరంపై అభిమానం, మనస్సుపై అభిమానం, బుద్ధిపై అభిమానం - ఇవన్నీ చేరడంచేత మానవుడు తన స్వస్వరూపాన్ని మరచి పోయి లోహములు కలిసిన బంగారంగా తయారవుతున్నాడు. కల్తీ బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు లోహములన్నీ వేరైపోయి స్వచ్ఛమైన బంగారం తయారౌతుంది. అదేవిధంగా, మానవుడు పవిత్రుడు కావాలంటే దుర్గుణాలను దూరం చేసుకోవాలి. ఈనాడు మానవునిలో ఆసూయాద్వేషాలు అధికమై పోతున్నాయి. భక్తులలో, సాధకులలో అసూయ మరింత పెరిగిపోతున్నది. అసూయతోపాటు అహంకారం కూడా పెరిగిపోతున్నది. బంగారం వంటి మానవత్వంలో ఈ లోహములను" చేర్చుకోవడంచేత మానవత్వం మరుగునపడిపోతున్నది.బంగారంలో బంగారాన్నే చేర్చుకోవాలి. అనగా సత్సంగమును చేర్చుకోవాలి. దుస్సంగమునకు దూరంగా ఉండాలి.

 

త్యజ దుర్జన సంసర్గం

భజ సాధు సమాగమమ్

కురు పుణ్య మహారాత్రం

స్మర నిత్యమనిత్యతాం

 

కొంతమంది మాటలు చాల మధురంగా ఉంటాయి. గాని వారి చర్యలు రాక్షసత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఇలాంటి వారిని విశ్వసించి మీరు చెడిపోకండి. మీరు పరిశుద్ధమైన బంగారంగా ఉండాలి. పరిశుద్ధమైన బంగారం కొంత ఉన్నా దానికి ఎంతో విలువ ఉంటుంది. అనేక లోహములు చేరిన బంగారం ఎంత ఉన్నా దానికి సరియైన విలువ రాదు. "పంట పండని భూమి పది ఎకరము లేల? కొంచెమైన చాలు మంచి భూమి", కనుక మనకు క్వాలిటీ ప్రధానం. క్వాంటిటీ కాదు. మీరు ఎవరి మాటా విననక్కర లేదు. మీ కాన్షియ మీరు అనుసరించండి. చాలు. కాన్షియన్సే మీ మాస్టర్.

 

“ఫాలోది మాస్టర్: ఫేస్ ది డెవిల్

ఫైట్ టు ది ఎన్డ్: ఫినిష్ ది గేమ్"

 

ఇదే జీవిత తత్త్వము. మీరు ఎవరు పడితే వారిని అనుసరించి, మీలో కల్తీ లోహాల ను చేర్చుకోవడం చేత మీ స్వామిని మీరు మరచిపోతున్నారు. మీ స్వస్వరూపాన్ని మీరు మరచిపోతున్నారు: చేతులారా దుఃఖాన్ని తెచ్చుకొంటున్నారు. మీ  మీరుకాన్షిన్స్  ఫాలో చేయండి. నేను ఎవ్వరిని ఏ విషయంలోను ఫోర్స్ (బలవంతం) చేయడం లేదు. ఎందుకంటే మీలోనే  స్టోర్స్ ఉన్నది. అదే ఆత్మ. అదే కాన్షియన్స్ అది ప్రేమతో కూడినది. దానిని మీరు అనుసరించండి..

 

మొదటి ప్రశ్నకు దీనిని జవాబుగా తీసుకోండి: జీసస్ "అందరినీ నేనే కాపాడుతాను.నేనేసత్యమును, మరొకటి సత్యం కాదు" అని ఎప్పుడూ చెప్పలేదు. అందరూ సత్యస్వరూపులే, అందరూ పవిత్ర స్వరూపులే, అందరూభగవంతుని బిడ్డలే

అనే విశాలమైన భావాలను ప్రచారం చేస్తూ వచ్చాడు. ఒకరినొకరు తిట్టుకోకూడదు, ఒకరినొకరు కొట్టుకోకూడదు, ఒకరినొకరు హింసించుకోకూడదు అని బోధించాడు.

 

రెండవ ప్రశ్న: స్వామి అనేకమందికి స్వప్నాలలో దర్శన మిస్తుంటారు కదా! ఆ స్వప్నాలు మాకెందుకు రాకూడదు? ఇది కూడా ఒక విధమైన అమాయకత్వమే. స్వామి కనిపించే స్వప్నాలు తల్చుకుంటే వచ్చేవి కావు. మీరెందరినో తలుచుకొంటారు కదా! వారందరూ మీ స్వప్నంలో వస్తున్నారా? రావటం లేదు. అయితే, స్వప్నంలో రాక పోయినంత మాత్రాన స్వామికి మీ మీద దయ లేదను కోవడం చాల పొరపాటు.

 

ఇప్పుడు స్వప్నముల గురించి కొంత చెపుతాను. స్వప్నమనేది ప్రతిచింబము. స్వప్నం రావడం చాల మంచిది. కొన్ని చెడ్డవి వస్తుంటాయి. కొన్ని భయంకరమైనవి వస్తుంటాయి. కొన్ని బాధాకరమైనవి వస్తుంటాయి. కొన్ని దుఃఖకరమైనవి వస్తుంటాయి. ఎందువలనంటే, అవన్నీ అప్పుడప్పుడు మీ సంకల్పములో చేరి, లోపల స్టాక్ మాదిరి ప్రోగవుతున్నాయి. కనుక అవి స్వప్పరూపంలో బయట పడిపోవటం చాల మంచిది. స్వప్నములన్నీ మీ సంకల్పముల రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లని భావించాలి. అయితే స్వామి కనిపించే స్వప్నం రిఫ్లెక్షన్ కాదు. రియాక్షన్ కాదు. రీసౌండ్ కాదు. అది నేను తలుచుకొన్నప్పుడే మీకు వస్తుందిగాని మీరు తలుచుకొంటే వచ్చేది కాదు. నిన్న సంగీత కార్యక్రమంలో పాల్గొన్న మహమ్మదీయుణ్ణి మీరు చూశారు. అతడు ఇంతకుముందు నన్ను చూసి యుండలేదు. నిన్న అతను వచ్చినప్పుడు నేను "నీవు అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ నీకు కారు యాక్సిడెంట్ జరిగింది. అక్కడ నేను కనిపించాను. నీకు జ్ఞాపకముందా?" అని అడిగాను. అతడు " ఓ మై గాడ్!" అని ఏడ్చినాడు పాపం! అతనెప్పుడూ నన్ను చూడలేదు. కానీ ఆమెరికాలో కనిపించాను. అదే రాత్రి అతనికి కలలో కనపడి "నీవు వచ్చే బర్త్ డేకి పుట్టపర్తికి వస్తున్నావు" అని చెప్పాను. చెప్పినట్లుగానే నిన్నటిదినం వచ్చాడు.

 

అయితే కొన్నిసార్లు కన్ఫ్యూషన్ కూడిన స్వప్నాలు కూడా వస్తుంటాయి. స్వామి కనబడుతుంటారు. మీ భావములు కనిపిస్తుంటాయి. అది ఇది రెండూ మిక్స్ అయిపోతాయి. ఒక క్షణంలో మీరు పుట్టపర్తి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది: మరుక్షణంలో అమెరికా వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. ఈ విధంగా ఒకేసారి రెండు మూడు కలసిపోతుంటాయి. ఇవి ఆహార దోషంవలన, అజీర్ణం వలన వచ్చే స్వప్నములేగాని స్వామి యొక్క సంకల్పంతో వచ్చేవి కాడు. నేను సంకల్పించే స్వప్నంలో కన్ఫ్యూషన్ కు అవకాశముండదు: క్లియర్‌గా వచ్చి, క్లియర్ గా మాట్లాడిపోతాము. అయితే నేను మీకు స్వప్నంలో కనిపించకపోయినంత మాత్రమున మీపై స్వామికి దయ లేదని భావించడం చాల పొరపాటు. దయ ఉంది.

 

మూడవ ప్రశ్న అనేకమంది సాధనలు చేస్తున్నారు. నేను కూడా సాధన చేయాలని ఆశిస్తున్నాను. కాని నేను ప్రాపంచిక సంబంధమైన పనులయందు నిమగ్నుడనై ఉండటంచేత స్వామిని చింతించడానికి, స్వామి సేవ చేయడానికి నాకు సమయం చిక్కడం లేదు.

 

ఇవి భావించడం చాల తప్పు. స్వామిచింతన చేయడానికి మీకు ప్రత్యేకంగా కొంత కాలం అవసరం లేదు. మీరు ఏ పని చేసినా అది దైవకార్యంగా భావించండి. మీరు ఆఫీసు మాననక్కరలేదు. ఆఫీసు పనులను కూడా దైవం యొక్క పనులుగా భావించి సక్రమంగా చేయండి. అదీ దైవసేవయే. అదీ దైవకార్యమే, అదీ స్వామికార్యమే. దీనిని పురస్కరించు కొనియే "వర్క్ ఈజ్ వర్షిప్: డ్యూటీ ఈజ్ గాడ్" అన్నారు. కనుక మీరు ప్రత్యేకంగా ఒకచోట కూర్చొని "సాయిరాం, సాయిరాం..." అని జపించనక్కర లేదు. మీరేదో సాధన చేయాలని ధ్యానంలో కూర్చుంటారు. కానీ ఒక్క క్షణమైనా మనస్సును నిలుపగల్గుతున్నారా ? లేదు. అలాంటప్పుడు ధ్యానం చేయడ మెందుకు? మీ ఇంటి పనులను మీరు చేసుకోండి. "సర్వ కర్మ భగవత్ప్రీత్యర్థం",అన్ని పనులూ భగవ

త్ప్రీత్యర్థం చేస్తున్నామనుకోండి. అదే గొప్ప సాధన. "కర్మానుబంధీనిమనుష్య లోకే" ప్రతి మానవుడు కర్మకు కట్టుబడి ఉంటున్నాడు. కర్మ అనగా ఏమిటి? చలన శక్తితో కూడినదే కర్మ. మీ ఉచ్చ్వాస నిశ్వాసములు కూడా కర్మలే: మీ కనురెప్పలు ఆడటం కూడా కర్మయే: మీరు భుజించడమూ కర్మయే, నిద్రించడమూ కర్మయే. సర్వమూ కర్మమయమే. కర్మ లేక మానవుడు క్షణమైనా జీవించుటకు వీలు కాదు. అయితే భగవత్రీత్యర్థంగా చేసే కర్మయే సార్థకమవు తుంది. ఇది నా పని. అది భగవంతుని పని అనే భేదం పెట్టుకోకూడదు. మీరు వేరు, భగవంతుడు వేరు అని భావించరాదు. మీరు, భగవంతుడు ఒక్కటే. ఇట్టి నమ్మకంతో ఏ చిన్న పని చేసినా అది గొప్పదిగా మారుతుంది. అందరికీ సహాయం చేయండి. హాస్పిటలకు పోయి పేషంట్లకు సేవ చేయండి. అయితే ఇంత మాత్రమే సేవ కాదు. మీ ఆఫీసులోను. మీ బిజినెస్ లోను మీ డ్యూటీని మీరు సక్రమంగా నిర్వర్తించండి. ప్రభుత్వం నుండి మీరు తీసుకొంటున్న జీతానికి తగిన పని చేయండి. అదియే సేవ, అదియే సాధన. ఏ పనైనా చేసుకోండి అన్ని దైవకార్యాలుగా భావించండి.

 

దైవచింతన చేయడానికి నాకు సమయం చాలడం లేదని సాకు చెప్పకూడదు. కావలసినంత సమయమున్నది. 24 గంటలలో 7,8 గంటలు ఆఫీసులో పని చేస్తున్నారు. 6 గంటలు నిద్రపోతున్నారు. మరి మిగిలిన టైమ్ లో ఏమి చేస్తున్నారు? ఒక చిన్న కథ చెపుతాను మీకు. ఒక వ్యక్తి తన జీవితంలో దైవచింతనకు కొంత కాలం కేటాయించా లనుకొన్నాడు. అందుచేత తన ఆయుష్షు ఎంతనో తెలియజేయవలసిందని భగవంతుణ్ణి ప్రార్థించాడు. భగవంతుడు "నయనా! నీకు 80 సంవత్సరముల ఆయుపు నిచ్చాను" అన్నాడు. అప్పుడా వ్యక్తి "స్వామీ!

మొదటి 25 సంవత్సరాలు ఆటపాటలతో చదువు సంధ్యలలో జరిగిపోతాయి. తరువాత 25 సంవత్సరాలు నా భార్యాబిడ్డలను, ఇతర వ్యవహారములను చూసుకోవాలి. తరువాత 30 సంవత్సరాలు నా పిల్లల భవిష్యత్తుకు తగిన భద్రతను చేకూర్చడంలో గడచిపోతాయి. ఈవిధంగా మీరిచ్చిన 80 సంవత్సరాలు నా పనులకు సరిపోతుంది. ఇంక నేను మీ చింతన చేసేదెప్పుడు? కనుక నాకింకా 20 సంవత్సరాలు ఇవ్వవలసింది " అని ఆడిగాడు. అప్పుడు భగవంతుడు "పిచ్చివాడా! నీకింకా 20 సంవత్సరముల నిచ్చినా వాటిని దేనికి ఉపయోగ పెడతావో ఏమిటో! ఇది పక్కా సోయరితనం! నన్ను తలుచుకోవడానికి నీకు 20 సంవత్సరములు అక్కర లేదు, 2 సెకండ్లు చాలు" అన్నాడు ఎట్లా? కరెంటు ఉన్నది. మీకు లైటు కావాలి. స్విచ్ నొక్కడానికి మీకు ఎంత టైమ్ పడుతుంది? 20 సంవత్సరములు కావలెనా? కాదు, కాదు. ఒక్క సెకండు చాలు. అదేవిధంగా భగవంతుణ్ణి హృదయ పూర్వకంగా స్మరించుకోవడానికి ఒక్క క్షణం చాలు. కాలం భగవత్స్వరూపం. కాలాన్ని వ్యర్థం చేస్తే జీవితాన్ని వ్యర్థం చేసినట్లే. కాబట్టి కాలాన్ని సద్వినియోగంచేసుకోండి. అదే నిజమైన సాధన కాబట్టి స్వామి చింతన - చేయడానికి స్వామి సేవ చేయడానికి నాకు టైమ్ లేదనివగచ నవసరం లేదు. ఈ ప్రశ్న వ్రాసిందెవరోగాని వారు పక్కా సోమరిపోతులే! మొట్టమొదట సోమరితన్నాన్ని దూరం చేసుకోండి. Laziness is rust and dust; realisation is best and rest. ఈ సత్యా న్ని చక్కగా గుర్తుంచుకోండి.

 

నాల్గవ ప్రశ్న : మేము విదేశాలలో ఉండటంచేత స్వామి సేవ చేయడానికి అవకాశం చిక్కడం లేదు. కాబట్టి మేము ఇండియాకు వచ్చి స్వామి సేవ సంపూర్ణంగా, హృదయ పూర్వకంగా చేయాలని ఆశిస్తున్నాము.

 

ఇది కూడా సోమరితనమే. సేవ చేయడానికి స్వదేశమేమిటి, విదేశమేమిటి! అక్కడ చేసినా సేవయే, ఇక్కడ చేసినా సేవయే. ఎక్కడున్నా సేవ చేయవచ్చు. అంతేగాని ప్రశాంతి నిలయానికి వచ్చి, స్వామి దగ్గరే ఉండి సేవచేయాలని ఆశించడం స్వార్థమే. కావాలంటే రిటైర్ అయిన తరువాత ఇక్కడకు వచ్చి చేయండి. సంతోషమే. మీ పిల్లల చదువు తదితర బాధ్యతలు మీపై దండిగా ఉంటాయి. కాబట్టి అక్కడే మీ డ్యూటీని మీరు సక్రంగాచేయండి. అవన్నీ వదలి పెట్టి ప్రశాంతి నిలయానికి వస్తే, కొన్ని దినములు బాగానే చేయవచ్చుగాని తరువాత మీ మనస్సు భ్రమించి పోవచ్చు. కాబట్టి డో న్ట్ కమ్ మీరు అక్కడే ఉండి సేవ చేయండి. ఎక్కడ చేసినా సేవ సేవయే. నేను ఏ సేవనూ  ఆశించడం లేదు. నా పని నేనే చేసుకొంటున్నాను. మా పిల్లలు ఇంతమంది ఇక్కడుంటున్నారు. ఎవరు చేస్తున్నారు. స్వామి సేవ? అయితే వారు కూడా మీలాగే స్వామి సేవ చేయాలని ఆశిస్తున్నారు. కానీ ఏపవిత్రమైన వ్యక్తులతో ఈ పవిత్రమైన సేవ చిక్కుతుంది. ఎవ్వరూ  నాకు  సేవ  చేయనక్కరలేదు. సేవ చేయకుండా పోయినంత మాత్రమున నాకు దూరమైనవారని నేను భావించను. నేను ఏనాడూ ఏ సేవనూ ఆశించడం లేదు. మీ సేవలు మీరు చేసుకోండి, మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకోండి. నాకు ఏ సేవలూ అక్కర లేదు. నా కాళ్ళు, చేతులు, కన్సులు అన్నీ భద్రంగా ఉన్నాయి. నా పనులను నేను చేసుకోగలను. ఇంకొకరి సేవలు నేను ఆశించడం లేదు. కనుక శక్తి లేనివారికి మీరు సేవ చేయండి. ఆదియే స్వామి సేవగాభావించండి. స్వామి ఎప్పుడూ భక్తుల మధ్యలో తిరుగుతుంటారు. కాబట్టి స్వామికి కాళ్ళు నొప్పిగా ఉండవచ్చునని మీరనుకొంటారు. కానీ నాకు కాళ్ళనొప్పి ఎప్పుడూ లేదు. నేను ఏనొప్పీ అనుభవించ లేదు. ఎవరిదైనా తీసుకొన్నప్పుడు నేను అనుభవిస్తానేగాని లేకపోతే నాకు ఏ నొప్పీ లేదు. ఈ దేహానికి ఏ బాధలూ లేవు. ఎప్పుడు చూసినా బ్లడ్ ప్రెషర్, పల్స్ రేటు పర్‌ఫెక్ట్ నార్మల్ గా ఉంటాయి. ఎంత సేపు మాట్లాడినా, ఏ పనిచేసినా నా బ్లడ్ ప్రెషర్ లో మార్పు ఉండదు. ఈ దేహం చాల పవిత్రమైనది. దీనికి కారణం నాలో Purity (పవిత్రత) Patience (సహనం), Perseverance (పట్టుదల) ఈ మూడు ఉన్నాయి. కనుక మీరెవ్వరూ నాకు సేవలు చేయనక్కర లేదు. మీ సేవలు మీరు చేసుకోండి. మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి.

 

ఐదవ ప్రశ్న: మేము చేసుకొన్న కర్మ ఫలితముల బాకీలు ఎట్లా తీరుతాయి? 

 

ఎలాంటి  కర్మఫలితమునైనా  ప్రేమ అనే మందుతోనివారణ చేసుకోవ చ్చు.  ప్రేమను మించినది మరొకటి లేదు. హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి ప్రేమిస్తే మీ సర్వ బాధలూ, సర్వ రోగములూ నివారణ అవుతాయి. కొంతమంది పూజా రూమ్లో కూర్చొని “సాయిరాం, సాయిరాం.." అని జపం చేస్తుంటారు గాని వారి మనస్సు చాకలివానిపై పోలుంది. జపం చేస్తూ మధ్యలో "ఏమిటే, చాకలివాడు గుడ్డలు తెచ్చాడా?" అని అడుగుతారుభార్యను. లేకపోతే వంటగది నుండి పొగ వస్తుంటే వంట మాడిపోతున్నది చూడు" అంటారు. ఇది భగవత్రార్థన ఎట్లా అవుతుంది? మీరు చేసే సాధనలన్నీ చంచలమైన మనస్సుతో చేస్తున్నారు. స్థిరమైన మనస్సుతో చేయండి మీకు తప్పక ఫలితం లభిస్తుంది. ఏ సాధనలైనా చేసుకోండిగాని భగవంతుణ్ణి హృదయ పూర్వకంగాప్రేమించండి. ప్రేమతోనే సర్వ చింతలూ నివారణ అవుతాయి. మొట్టమొదట ప్రేమను పెంచుకోండి. ఏరీతిగా పెంచుకోవాలి? మొక్కను భూమిలో నాటి నీరు పోయాలిగాని, టిన్నులో పెట్టి నీరు పోస్తే ఫలితం ఉండదు. భగవంతుడు ప్రేమస్వరూపుడు కనుక భగవంతుని రూపమును, నామమును హృదయ భూమిలో నాటుకొనిప్రేమజలమును పోయండి. తప్పక మీలో ప్రేమ అభివృద్ధి అవుతుంది. ఇంతకంటే ప్రత్యేకంగా మొరక సాధన చేయనక్కరలేదు.

 

ఆరవ ప్రశ్నచాలా విచిత్రమైనది: మా పూజా రూమ్ లో రాముడు, కృష్ణుడు ఈశ్వరుడు, జీసస్  మొదలైన ఫోటోలన్ని పెట్టుకొన్నాము. వీటి మధ్యలో స్వామి ఫోటో కూడా పెట్టుకున్నాము. ఇది తప్పా?

 

భగవంతుడు సర్వ స్వరూపుడు అనే విశ్వాసం మీలో దృఢంగా ఉంటే ఏ ఫోటో పెట్టుకుంటే ఏమి! రాముణ్ణిగాని, ఈశ్వరుణ్ణిగాని, అల్లానుగాని, జీసు , జోరాష్ట్రనుగాని, సాయినిగాని ఎవ్వరినైనా పూజించండి. కాని అందరూ ఒక్కటే అనే భావమును పెట్టుకోండి. దీనికొక చిన్న ఉదాహరణ : గోధుమ హల్వా. బాదంఖీరు, గులాబ్జామ్, జిలేబి, లడ్డు, మైసూర్పాక మొదలైన స్వీట్ల యొక్క రూపనామములు వేరువేరుగాని అన్నింటియందూ ఉన్న చక్కెర ఒక్కటే కదా! అదేవిధంగా మీరు ఏ దేవుణ్ణి పూజించినా అందరి యందున్న దివ్యత్వం ఒక్కటే అని విశ్వసించండి. "ఆల్ ఆర్ వన్" (అందరూ ఒక్కటే) అని విశ్వసించినప్పుడు ఇంక భేదములు ఏమాత్రము మిమ్మల్ని బాధించవు. ఒకవేళ మీకు సాయిబాబా అంటే ఇష్టం లేకపోతే సాయిబాబా ఫొటో తీసివేయండి. రాముడంటే ఇష్టం లేకపోతే రాముని ఫొటో తీసివేయండి. మీకు ఇష్టం వచ్చిన ఫొటో పెట్టుకోండి. అయితే ఈ ఫొటోలను మార్చటంవలన వచ్చే ఫలితమేమీ లేదు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథను అప్పుడప్పుడు మా పిల్లలకు చెపుతుంటాను. ఒక పిల్లవాడు మేథమెటిక్స్ పరీక్షకు వెళ్ళే ముందు సాయిబాబా ఫొటో పెట్టి పూజ చేశాడు. కానీ ఆ రోజు పరీక్ష సరిగా వ్రాయలేదు. ఇంటికి వస్తూనే సాయిబాబా ఫొటో తీసి కప్ బోర్డ్ లో పడేశాడు. రెండవ దినం పరీక్షకు వెళ్ళే ముందు రాముని ఫొటో పెట్టి పూజ చేశాడు. కానీ ఆ రోజ పరీక్ష మరింత కఠినంగా అనిపించింది.

 

రాముని ఫొటో కూడా తీసి కప్ బోర్డ్ లో పడేశాడు. మూడవ దినము పరీక్షకు వెళ్ళే ముందు ఏ దేవుణ్ణి పూజించాలి? అని యోచించాడు. ఈ మగ దేవుళ్ళకు ఆసలు ప్రేమలేదు. అమ్మకు మాత్రం చాలప్రేమ ఆనుకొన్నాడు. వెంటనే దేవి ఫొటో పెట్టి పూజ చేసి, పరీక్షకు వెళ్ళాడు.

 

కానీ ఆ రోజు పరీక్షలో కనీసం ప్రశ్నలు కూడా వానికి అర్థం కాలేదు. దాంతో ఇంటికి వస్తూనే దేవి ఫోటో కూడా తీసి కబోర్డ్లో పడేశాడు. మరునాడు వినాయకుని ఫొటో పెట్టి పూజించాడు.

కానీ తాను వెలిగించిన ఊదిబత్తీల పొగ కప్ బోర్డ్ పడేసిన ఫొటోల వైపు వెళ్ళడం గమనించాడు. తనకు ద్రోహం చేసిన దేవుళ్ళకు ఆ సువాసన పీల్చే అధికారం లేదని భావించి, ఒక గుడ్డ తెచ్చి ఆ ఫొటోల చుట్టూ కట్టేశాడు. తక్షణమే సాయిబాబా, రాముడు, దేవి ప్రత్యక్షమయ్యారు. ఆ పిల్లవాడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తాను పూజించినంతకాలం ప్రత్యక్షం కాకుండా తిరస్కరించినప్పుడు ప్రత్యక్షం కావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించాడు. అప్పుడు సాయిబాబా చెప్పాడు: "నాయనా ! ఇంతకాలం మమ్మల్ని నీవు ఫొటోలుగా భావించి పూజించావు. అందుచేత ఫలితం లేకపోయింది. కానీ ఈనాడు మమ్మల్ని సజీవ స్వరూపాలుగా విశ్వసించి, ఆ సువాసన మాకు చేరకూడదనే ఉద్దేశ్యంతో మా ముక్కు చుట్టూ గుడ్డ కట్టేశావు. అందుచేతనే ప్రత్యక్షమైనాము." You may worship picture as God, but not God as picture.భగవంతుణ్ణి ఫొటోగా పూజిస్తే ప్రయోజనం లేదు. ఫొటోను సాక్షాత్తు భగవంతునిగా భావించి పూజించాలి. అప్పుడే మీ అభీష్టములన్నీ నెరవేరుతాయి. ఏ ఫోటో పెట్టుకొన్నా ఏ నామం తల్చుకొన్నా ఫరవాలేదు. కాని అన్ని రూపములూ, అన్ని నామములూ ఒక్క దైవానివే అని గుర్తించుకోండి. అందరూ దైవస్వరూపులే. మీ తల్లిదండ్రులు కూడా దైవస్వరూపులే. కాబట్టి వారినే పూజించండి. వేదము "మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ..." అన్నది. అలాంటప్పుడు ఈ దైవాన్ని పూజించాలా, లేక ఆ దైవాన్ని పూజించాలా? అనే సందేహాలు మీకెందుకు రావాలి? దైవం పైన అనుమానము నకు ఏమాత్రము అవకాశమివ్వవద్దు. దైవం ఒక్కడే. "ఏకం సత్ విప్రా: బహుధా వదంతి". కనుక భేదాలను పెట్టుకొని ఫొటోలు మార్చకండి. మీకిష్టమైన రూపనామము లను పూజించండి. అదే సరియైన మార్గము.

 

ఏడవ ప్రశ్న :మేము చేసే సాధన స్వామిని సంతృప్తి పర్చాలి. కనుక మేము ఏ సాధన చేస్తే స్వామికి సంతృప్తి కల్గుతుందో తెలియజేస్తే ఆ సాధన చేస్తాము.

 

దీనికి జవాబు ఒక్కటే. నాకు ఏ సాధనా అవసరం లేదు. సర్వ మానవులనూ దైవస్వరూపులుగా విశ్వసించండి. అది నాకు చాల ఇష్టం. ఇతరులు ఏది చేస్తే మీకు ఆనందమనిపిస్తుందో దానిని మీరు ఇతరులకు చేయండి. అనేక పర్యాయములు చెపుతూనే ఉన్నాను. "హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్". ఇది నాకు చాల ఇష్టం. నిరంతరముసహాయం చేయండి. ఎవ్వరిని బాధించవద్దు. హింసించవద్దు. ఇతరులపట్ల దుర్భావములను పెంచు కోకండి. ఎదుటివారు మిమ్మల్ని దూషించినా, ద్వేషించినామీరు వారిని ప్రేమించండి. అదియే స్వామి తత్త్వము. ఈ లోకంలో ఎంతమందో ఉన్నారు. అందరూ స్వామిని పూజించేవారు కాదు. కొంతమంది పూజిస్తున్నారు. కొంతమంది దూషిస్తున్నారు. కాని నేను ఈ రెండింటిని చూడను. అందరిని ప్రేమిస్తూనే ఉంటాను. నాకు అందరూ ఒక్కటే. అందరూ ఆనందంగా ఉండాలన్నదే నా ఆశ. అయితే మీ కెపాసిటీని బట్టి మీరు అర్థం చేసుకొంటున్నారు. మంచి చెడ్డలు మీకేగాని నాకు లేవు. రావు. ఎవరు చేసినది వారే అనుభవిస్తారుగాని అది  నావరకు రాదు. ఎవరి కర్మ వారిది. ఈనాడు కాకపోయినా ఏనాటికైనా కర్మఫలితం తప్పు దు.

 

"ఎవరు చేసిన కర్మ వారనుభవించక

ఎవరికైనా తప్పదన్నా!

ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పాగలరు

అనుభవించుట సిద్ధమన్నా!

అలనాటి పాండవులు ఆకులలములు మేసి

అడవి పాలైపోయిరన్నా!

రాముడంతటివాడు రమణి సీతను బాసి

పామరునివలె ఏడ్చెనన్నా!"

 

మీరు మంచి చేస్తే మంచి వస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. దీనిని మొట్టమొదట గుర్తించుకోండి. నేను ఎల్లప్పుడు "లోకాస్సమస్తా స్సుఖినోభవంతు" అని ఆశిస్తాను. న న్ను మీరు ద్వేషించినా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. అది నాకు సహజం. అదే డివైవ్ క్వాలిటీ. మీరు ఒక రోజు పూజిస్తారు. మరొక రోజా దూషిస్తారు. త్రాగినవాడు ఒక రకంగా మాట్లాడుతాడు. త్రాగనప్పుడు మరో రకంగా మాట్లాడుతాడు. అదేవిధంగా ప్రాపంచిక వాంఛలలో మునిగినవారి విశ్వాసం అటూ ఇటూ చలిస్తూ ఉంటుంది. కాని పరిపూర్ణ ప్రేమ కల్గిన వారు ఎప్పుడూ ఒకే మాదిరి ఉంటారు. నేనెప్పుడూ అలాంటి వారి ఇంటనే, వెంటనే, జంటనే, కంటనే ఉంటాను. అలాంటివారు ఎంతో ఆదృష్టము చేసుకొన్నవారు. ఎంతో పవిత్ర హృదయులు, అది ఈ ఒక్క జన్మలో వచ్చినది కాదు. ఎన్ని జన్మల పుణ్యఫలమో! స్వామికి ఏది ఇష్టము, ఏది అయిష్టము. అని మీరు విచారణ చేయనక్కర లేదు. మీ హృదయ పవిత్రతే నాకు కావాలి. ప్రేమతో మీరు ఏ సేవైనా చేయండి. స్వామిపై మీకు పరిపూర్ణ విశ్వాసమే ఉంటే స్వామి ఆజ్ఞను శిరసావహించండి. నేనెప్పుడూ ఎవ్వరికీ చెడు చెప్పను. నేనేది చెప్పినా మీ మంచికోసమే. "వాటెవర్ ఐ సే, వాటెవర్ ఐ డూ ఈజ్ గుడ్ ఫర్ యూ నాట్ ఫర్ మీ", నేనేమి చెప్పినా, ఏమి చేసినా మీ మంచి కోసమేగాని నాకోసం కాదు. నా పని అనేది నాకు ఏ ఒక్కటీ లేదు, అన్నీ మీ పనులే. నిరంతరము మీ పకనులే చేస్తుంటాను. కనుక మీపై నాకు ప్రేమ లేదని భావించకండి. అయితే అదృష్టవంతులకు పవిత్రమైన సేవ, పవిత్రమైన సన్నిధి లభిస్తుంటాయి. వారికి చిక్కించే, నాకు చిక్కలేదే అని ఆసూయకు అవకాశమివ్వకండి. అన్ని జబ్బులను మించిన ఇబ్బు అసూయ, క్యాన్సర్ నైనా క్యాన్సిల్ చేయవచ్చుగాని అసూయకు మాత్రం ముందు లేదు. అది మనిషిని కృంగదీసి, కృంగదీసి కట్టకడపటికి నాశనం చేస్తుంది.

 

ప్రేమస్వరూపులారా!అసూయాహంకారములకు అవకాశమివ్వకుండా, అందరినిసో దర సోదరీమణులుగాభావించుకొని మీరు ఆనందంగా సేవలు చేయాలి. భావించుకొని మీరు ఆనందంగా సేవలు చేయాలి.

ఈనాటి విద్యావిధానంలో అనేక మార్పులు తెప్పించాలి. విద్య ధనముకోసం కాదు, గుణంకోసమని పిల్లలకు బోధించాలి. కలిమి, బలిమి, చెలిమి శాశ్వతమైనవి కావు. ధనము వస్తుంది, పోతుంది. ఈనాటి మిత్రుడు రేపు శత్రువుగా మారవచ్చు. కనుక శాశ్వతమైన, పవిత్రమైన గుణాన్ని మీరు అభివృద్ధి పర్చుకోండి. సర్వులకూ సహాయం చేయండి. చేతులనిచ్చినది పరోపకారం చేయడానికేగాని నోటికి ముద్దందించడానికి కాదు. కంఠము నిచ్చినదిదైవనామాన్ని గానం చేయడానికేగాని సినిమా పాటలు పాడటానికి కాదు. పరులను దూషించడానికి కాదు.తెలివిని ఇచ్చినది దైవాన్ని ఏరీతిగా పొందాలని విచారణ చేయడానికేగాని అహంకారపడటానికి కాదు. మీ దేహంలోని ప్రతి అంగమును పవిత్రమైన కర్మలలో ప్రవేశ పెట్టి సార్థకం చేసుకోండి.

 

ప్రేమస్వరూపులారా! మీరు సక్రమమైన మార్గంలో నడుచుకొన్నప్పుడు ఎన్ని వేలమందినైనా మీరు చక్కగా తీర్చిదిద్దవచ్చు. మీరు ఆచరణ మాని పదిమందికి బోధిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఒకటి రెండైనా ఆచరించి చూపించండి. అన్నీ చేసి చూపించమని నేను కోరటం లేదు. మీరు ఆదర్శప్రాయులై దేశాన్ని బాగుపర్చండి. నా పేరుకోసం నేను ఆశించడం లేదు. నాకు పేరు ప్రతిష్ఠలు అవసరం లేదు. నేనింకా ఆశించడం లేదుగాని ఆశిస్తే ప్రపంచమంతా ఇక్కడ వ్రాలిపోతుంది. కానీ నాకది అవసరం లేదు. నాకు కావలసింది మీరు బాగుపడటమే. ఇంక ఏదీ అక్కర లేదు. స్వామిది ఇచ్చే స్వభావమేగాని పుచ్చుకొనే స్వభావం కాదని గోల్డ్ స్టీన్ తన ప్రసంగంలో చెప్పాడు. అయితే ఒక్కటి ఆశిస్తున్నాను, అడుగుతున్నాను. అదే ప్రేమ, మరేదీ వద్దు. ప్రేమను ఇస్తే మీరు ఏది కోరినా ఇస్తాను. ప్రేమను ఇచ్చుకొని సర్వమునూ పుచ్చుకోండి. కలసి మెలసి పని చేయండి. మీలో మీకు అసూయ లేకుండా, భేదాలు లేకుండా,ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా ఐకమత్యంతో మెలగినప్పుడు నాకు అంతకంటే కావలసింది ఏముంది! మీరు స్వామి సంకల్పానుసారం పని చేస్తే అంతకంటే ఆనందం ఏముంది! “హేపీన్స్ ఈజ్ యూనియన్ విత్ గాడ్". భగవద్భావంతో పని చేసినప్పుడే విజమైన హేపీనెస్ పొందుతారు. మీలో మీకు ఎలాంటి భిన్నాభిప్రాయము లున్నా కలసి మెలసి పని చేయండి. మీరెవ్వరిని బాధ పెట్టినా ఆ బాధ నాకు వస్తుంది. అందరూ ఒక్కటిగా ఉంటే నేను ఆనందిస్తాను. మీకెవరైనా ద్వేషులుంటే, ఇక్కడి నుండి వెళ్ళిన తరువాత వారిని ప్రేమతో పలకరించండి. మీ ప్రేమను అందరికీ పంచండి. ఇదే నిజమైన తపస్సు, ధ్యానము, జపము, సాధన కూడా.ప్రేమ లేకుండా ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం లేదు. ప్రేమను ఇచ్చి, ప్రేమము పుచ్చుకోండి. ఏ యుగంలోను లేని ఆనందాన్ని ఈ యుగంలో మీరు అందుకోవచ్చును. ఐకమత్యంలో ఎంతో బలమున్నది. ప్రేమ ఉంటే ఐకమత్యం ఎంతైనా అభివృద్ధి అవుతుంది. ప్రేమస్వరూపులారా! ఈనాడు మీలో ఉన్న దోషాలన్నింటిని దూరం చేసుకోండి. హృదయాన్ని పవిత్రం గావించుకొని ఆనందంగా తిరిగి వెళ్ళండి. ఈ ప్రశాంతి నిలయం ఒక పెద్ద వర్క్ షాప్. ఇందులో మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని వెళ్ళండి. మీరు మీమీ దేశాలకు తిరిగి వెళ్ళిన తరువాత ఇతరులు మిమ్మల్సి చూసి"అబ్బ ! పుట్టపర్తికి వెళ్ళి వచ్చిన తరువాత ఇతనిలో ఎంత మంచి మార్పు వచ్చిందిరా" అని ఆశ్చర్యపోవాలి. ఆనందించాలి, మిమ్మల్ని మెచ్చుకోవాలి.

(సపా.డి. 98 పు. 325/334)

 

(అంతర్జాతీయ విద్యాసంస్థల సదస్సు ప్రశాంతి నిలయంలో జరిగింది. ఆ సదస్సులో ప్రతినిధులు వెలిబుచ్చిన సందేహాలను క్రోడీకరించి శ్రీ అనిల్ కుమార్ 13 ప్రశ్నలు భగవాన్ సత్యసాయిబాబావారిని అడుగగా ది.21.11.2001 స్వామివారు తమ ప్రసంగంలో సమాధానం యిచ్చినారు.)

 

1ప్రశ్న: What is the relationship between religion, spirituality and educare?

సమాధానం:

"తలచినట్టి పనులు తారుమారైనను

తొక వలదు ఎవరు తొణకవలదు

చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన

అతని గుండె పండినట్టిగుండె"

 

ప్రేమస్వరూపులారా! మతమునకు, ఆధ్యాత్మికమునకు, Educare కును వున్నటువంటి సంబంధ బాంధవ్యములు మీరు గుర్తించ లేదంటే నాకు చాలా ఆశ్యర్యంగా ఉంటున్నది.

మొట్టమొదట Religion (మతం) అంటే ఏమిటి? అర్థం చేసుకోండి.Realize is religion.దేనిని రీలైజేషన్చేయాలి? ఎవెవరో మొదట గుర్తించినప్పుడే ఈ రెలిజియన్ అనేది నీకు బాగా అర్థమవుతుంది. ఆధ్యాత్మికము (Spirituality) అంటే ఏమిటి? కేవలం భజనలు చేయటం, పూజలు చేయటం, ఆరాధనలు సల్పటం, దేవాలయములను దర్శించటం, యాత్రలు సల్పటం లాంటివన్ని ఇత్యాది సత్కర్మలన్ని కూడనూ కేవలం ఆధ్యాత్మికమార్గమునకు సంబంధించినవి భావిస్తున్నారు. ఇది కాదు. ఆధ్యాత్మికము. నాయందు ఏ ఆత్మ కలదో, ఆ ఆత్మనే సర్వులయందునూ వున్నదని అనేటటువంటి ఏకాత్మభావవమ గుర్తించటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికము . అనేకత్వంలో ఏకత్వాన్ని గుర్తించటమే ఆధ్యాత్మికము. దీనికొక చిన్న ఉదాహరణ. నీవు కన్నులు మూసుకుంటే ఒక వ్యక్తి కూడా నీకు కనిపించడు. ఆ కన్నులే తెరచిన అనేక వేల శిరస్సులు కనిపిస్తాయి. ఈ శిరస్సులు ఎక్కడ నుంచి వచ్చాయి? నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉన్నాయి? కన్నులు తెరచేటప్పటికి ఈ శిరస్సులన్నీ ఎక్కడ నుంచి ఆవిర్భవించాయి? వీరందరూ ఎవరు? ఈ శిరస్సులు ఎవరివి? అని విచారణ చేస్తే. ఇన్ని శిరస్సులు నీ నేత్రములయందే ఉన్నాయిగాని బయటనుంచి రాలేదు. కనుకనే అన్ని భూతములు కూడనూ నీ యందే ఉన్నాయి. నీవు అన్ని భూతములయందు ఉంటున్నావు. కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించేదే ఆధ్యాత్మికము.నేను ఒక్కడిని కాదు, అనేకత్వంలో నేను ఒక్కడను అనేటటు వంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తింపజేస్తుంది ఆధ్యాత్మికము . కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతికమైన, ఇలాంటి కర్మలు ఆచరించటం ఆధ్యాత్మికము కాదు. ఆది+ఆత్మ=ఆధ్యాత్మ, అందరి యందునూ ఒకటే ఆత్మ ఉన్నది. ప్రత్యేకంగా లేదు. కాని ఇది ప్రత్యేకంగా, ప్రపంచమునందు వేరుగా ఉన్నదని భావించి, అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురియై, ఏకత్వాన్ని భిన్నత్వంగావిస్తున్నారు. ఇవన్నీ కూడనూ నీ ప్రేమనుండి ఆవిర్భవించి నటువంటివే. కనుక మతమునకు, ఆధ్యాత్మికమునకు, Educare కును వున్న సంబంధం ఏమిటనేది సందేహం. ఈమూడు కూడానూ వేరు కాదు. It is my kerchief. kerchief is separate from me. This is my Body. Body is separate from me. I am not the Body. But who am I? దీనిని విచారణ చేసుకుంటే, వీటన్నింటికిని వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక - వ్యక్తిత్వము. వీటన్నింటికిని Master నీవు. మిగతావన్నీమెటీరియల్స్, కనుకనే Master the mind be a master mind. వీటన్నింటికి నీవే మాష్ట ర్ వు , ఆ మాష్టరే ఆత్మ, ఆ ఆత్మనే సర్వులయందునూ ఉన్నటువంటిది. అదే నీలో కూడనూ ఉన్నది. ఇందులో ఏకాత్మభావన సులభంగా మనకు అర్థమవుతుంది. ఇక Educareఅంటే ఏమిటి? ఇంగ్లీషు భాషనుండి Education (విద్య) అనే పదము వచ్చింది. లాటి న్ నుండి Educare అనే పదము వచ్చింది. ఈ Educare నుంచే Education అనేది వచ్చింది. ఈ రెండూ వేరు కాదు. రెండూ ఒక్కటే, Education అనేటటు వంటిది బయట ప్రపంచమునుంచి సంగ్రహించు కుంటున్నాం. కాని Educare అనేటటు వంటిది లోపల నుంచి బయటకు తీస్తున్నాం. ఇది రెండు విధములగా చూడవచ్చు. 1. జీవనోపాధి. 2 జీవిత పరమావధి. మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం బయట నుండి తీస్తున్నాం. మనకు తెలియనటువంటివి ఎన్నో లోపల అగోచరంగా ఉంటున్నాయి. వాటిని మనం ప్రయత్న పూర్వకంగా బయటకు తీయాలి. మొట్టమొదట మనం A,B,C,D అనే అక్షరాలు నేర్చుకున్నాం. ఇవి మనం నేర్చిన అక్షరాలు. ఇవి భౌతికమైనవి. అయితే క్రమక్రమేగా G..O.D.. అని పెట్టేటప్పటికి GOD (గాడ్) ఆవుతుంది.ఈ మూడూ కూడను నీవు కూర్చుకున్నటువంటివే. ఈ అక్షరాలు పూర్వమే ఉంటున్నాయి. అయితే ఈ అక్షరాలను ఒక శబ్దరూపంలో కూర్చడం... అది నీ ప్రయత్నం అదే విధముగనే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రెండవది తెలియనటువంటి విషయాన్ని రెండింటినికూడనూ మనం లోపలనుంచి కూడా తీసుకోవాలి. Educare అనేదానికి లోపలనుంచి యివ్వటం అని దీని అర్ధం. దేనిని లోపల నుంచి యివ్వాలి? Educare నుంచి Educationను యివ్వాలి. అది కూడనూ మనయందే ఉంటున్నది. ఉన్నదానినే మనం యివ్వటం కనుక మతమునకు, ఆధ్యాత్మికమునకు, Educare కు ఎట్టిభేదమూ లేదు. కేవలం రీలైజ్ చేసినటువంటిది మాత్రమే కాదు రెలిజియన్ రెలిజియన్ ఆనగా Love (పేమ). ఈప్రేమ అనేదాని వలవనే ఒక విధమైన "రీలైజేషన్ జరుగుతున్నది. నీవు కొన్ని తప్పు పనులు చేసివుంటే, ఆ తప్పుపనులు చేసిన వానిని చూసేటప్పటికి నీలోవున్న తప్పుపనులన్నీ బయటకు వస్తుంటాయి. నీవు మంచి పనులు చేసివుంటే, మంచి పనులు చేసినవానిని చూచినప్పుడు, నీలో వున్న మంచితనమంతా బయటకు వస్తుంది. కేవలం అతని మంచి నీవు చూసి కాదు. నీలో వున్న మంచి చెడ్డలే బయటపడుతున్నాయి. కనుక మనం ఎవరినో చెడ్డవాడని అంటున్నాం. అతను చెడ్డవాడు కాదు. అతని పైన ఉన్న నీ భావం చెడ్డది కాని, అతను చెడ్డవాడు కాదు ఇంకొకడ్ని మంచి వాడు అంటున్నాం. కాని అతని యందున్న మంచితనం నీకు కనిపించడంలేదు. నీకు అతని పై ఉన్న మంచి భావమే ఆవిధంగా అనిపిస్తున్నది. కాబట్టి మంచి చెడ్డలన్ని కూడనూ Reflection of the inner being. అవన్నీ నీ యొక్క Reflection, Reaction, Resound లే. కనుక ప్రతిదానికీ కూడనూ తన తత్త్వమే తనకు బయట స్వరూపకంగా కనిపిస్తుంది. కనుక మనం ఎవర్ని చెడ్డ అని భావించకూడదు. "చెడ్డ అని చెప్పడానికి నీకు ఏ అధికారం వుంటున్నాది? అతనిలో చెడ్డ ఉన్నదని ఏవిధంగా గుర్తింపజేస్తున్నావు? ఇది కేవలం నీకు కొన్ని అపకారములు జరగటం వలన అతను చెడ్డవాడంటున్నావు. కాని అతనిలో ఇంకా ఎంత మంచి ఉన్నదో? ఆది నీకు ఏమాత్రం గుర్తించడానికి వీలులేదు. ఒక చిన్న ఉదాహరణ. ఇతను అనిల్ కుమార్ అని గుర్తించడానికి కొన్ని గుర్తులు చెప్పుతారు. కానీ అవన్నీమీ నేత్రాలకు మాత్రమే కనిపిస్తాయి గాని, మీ నేత్రాలకు కనిపించనివి ఎన్నో అనిల్ కుమార్ లో ఉంటున్నాయి. Height, Fat. Colour - ఈ మూడింటిని చూడగలుగుతారు కాని అతనిలో ఇంకా ఎన్ని మంచి గుణాలున్నాయో! ఆతని యందు ప్రేమ, దయలు ఉండవచ్చును. క్రోధం కూడా ఉండవచ్చును. కానీ అవి నీకు కనిపించవే! ఆతని Height, Fat, Colour చెప్పినంత మాత్రమున అతనిని నీవు గుర్తించినవాడవు కాదు. నీవు గుర్తించనటువంటివి అతనిలో ఎన్నో ఉన్నాయి. ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే, అతని స్వరూపస్వభావాలు నీకు బాగా అర్థమవుతాయి. కనుకనే ఈనాడు లోకంలోపల ఆకారమును పురస్కరించుకొని, కేవలం తాను చేసేటటువంటి చర్యలను పురస్కరించుకొని అతని మంచి చెడ్డలుగా నీవు నిరూపిస్తున్నావు. ఇది చాలా తప్పు. నీలో ఎలాంటి తప్పులున్నాయో, అలాంటి నేత్రములతోనే అతనిని నీవు చూస్తున్నావు. కనుక అతనిది నీకు తప్పుగా కనిపిస్తున్నది. కాబట్టి తప్పు అనేది ఎదుటి వ్యక్తి యందు కనిపించేది కాదు.నీ దృష్టిలోని దోషమేగాని, సృష్టిలోని దోషము కాదు. నీవు ఎర్రటి రంగు గ్లాసులు పెట్టుకుంటే, ఆంతా ఎర్రగానే కనిపిస్తుంది. నీవు ఏ కలరు గ్లాసులు పెట్టుకుంటే ఆ కలరుగానే కనిపిస్తుంది. కనుక ఇవి వ్యక్తి యొక్క దోషములే తప్ప వేరు కాదు. ఇలాంటి సత్యమును గుర్తించని మూర్ఖులే ఇతరులను విమర్శిస్తుంటారు. భగవంతుని యందు ఎంతో విలువైనవి ఉన్నాయి. కాని నీవు వచ్చి నాకు ఒక లాకెట్ ఇవ్వండి స్వామీ! అంటావు. ఎందుకు ఆవిధంగా లాకెటు అడుగుతున్నావు? అతను ఇంకా ఎలాంటిది గొప్పది ఇవ్వదలచుకున్నాడో! అది నీవు గుర్తించుకొనలేక చిన్న దానిని నీవు కోరుతున్నావు. భగవంతుడు నీకు ఎంతో గొప్పది యివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనివద్ద లేనటువంటిది లేదు. ఎంతో విలువైనవి ఉన్నాయి. అలాంటి విలువైనవి ఉన్నప్పుడు విలువైనదే ఇస్తాడో ఏమో! కనుక భగవంతుడ్ని ఏమీ కోరుకూడదు. ఒక్కొక్క సమయంలోతానే అడిగి యిస్తుంటాడు. కాబట్టి దైవత్వం యొక్క విషయమును సామాన్యులు ఎవరూ అర్థం చేసుకోలేరు. అర్థంచేసుకోలేని మూర్ఖులే, అనర్ణాలకు గురియైపోయి, యథార్థాన్ని మరచిపోయి, వివేకమైనదానిని ఏమాత్రం గుర్తించుకొనక, అనర్థాలను పెంచుతున్నారు. ఇలాంటి దానికి మనం లోబడకూడదు. కనుక మతము అనేది గాని, ఆధ్యాత్మికము అనేదిగాని Educare అనేదిగాని ప్రత్యేకమైనటు వంటివికావు. ఉదాహరణ. ఇది ఒక ఉంగరం, ఇది ఒక గొలుసు, ఇది ఒక బంగారు విగ్రహము. కాని దీనిలో ఉన్న బంగారం మాత్రం ఒక్కటే. అదే విధముగా దైవత్వమవే దివ్యత్వం ఒక్కటే. ఈ దివ్యత్వంలో అనేక రూపనామములు కనిపించవచ్చు. కాని అన్ని రూపనామములకు మూలాధారమైనటు వంటిది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమను ఇచ్చుకో! ఆ ప్రేమము పుచ్చుకో! ఆ రెండింటియందునూ ఉన్నటువంటి దివ్యశక్తులు మరెక్కడా కనిపించవు. రెలిజయన్ అనే దానిని ప్రక్కన పెట్టు. Religion of Love Educare అనగా లోపల వున్నదానిని బయటకు తీయటం. ఆదియే నీ ప్రేమను బయటకు యివ్వటం. ఈ ప్రేమస్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతున్నది. కనుకనే Love is God, Live in love.దీనిని మొట్టమొదట మీరు తెలుసుకుంటే ఏ Educare ను మనం యోచించనవసరం లేదు. ఏమతాన్ని మనం విచారించనవసరం లేదు. అప్పుడు ఏ జగడములు జగత్తులో కనిపించవు. అందరూ ఐకమత్యంలో ఆనందంగానే ఉంటారు. భేదములు వుండనే ఉండవు. జగడములు ఉండవు. మానవులందరూ ఒక్కటే. మానవజాతి అంతా ఒక్కటే. ఆవిధమైన మానవత్వాన్ని గుర్తించుకుంటేచాలు. మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము" అనేది వేరే కనిపించదు. "మతములన్ని వేరు మార్గంబు ఒక్కటే ఈ మార్గాన్ని ఒక్క దానిని గుర్తించుకుంటే చాలు. మతములన్ని ఏకమైపోతాయి. మతులు మంచివైన మతమేమి చెడ్డది?" మన మతులలో భేదాలు పెట్టుకొని, మతములలో భేదాలు వున్నాయనుకోవటం చాలా పొరపాటు. మతములను కాదు, మతులను చూడు, నీ గతిని చూడు, నీ స్థితిని చూడు, నీ సంపత్తిని చూడు. ఆదియే నీవు నేర్చుకోవలసినది. మతి, గతి, స్థితి, సంపత్తి ఈనా ల్గిం టి యందే మానవత్వం ఇమిడి వుంటున్నాది. కనుక మీరు ఏకత్వాన్ని అభివృద్ధి పరుచుకోండి. అందరియందునూ వుండినటువంటి ఆత్మతత్త్వము ఒక్కటే అని విశ్వసించండి.

 

2.ప్రశ్నWhat relationship should Sri Satya Sai Schools have with the Government?

 

(సత్యసాయి విద్యా సంస్థలకు ప్రభుత్వానికి ఏవిధమైన సంబంధ బాంధవ్యము వుండాలి?

సమాధానం: ఇక్కడ సత్యసాయి "ఎడ్యుకేషన్" అని, గవర్నమెంటు ఎడ్యుకేషన్" అని రెండు ఉన్నాయా? ఒక్కటే ఎడ్యుకేషన్. అయితే గవర్నమెంటు ఎడ్యుకేషన్‌కు, మన ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని మనం యోచన చేయాలి. మన సత్యసాయి ఇనిస్టిట్యూషన్ లోపల ఒక రైట్ ఉంటున్నాది. ఎందుకంటే సత్యసాయి అందరివాడు. కాని గవర్నమెంటు దీనిలోపల ఆందరిదీ గవర్నమెంటు కాదు. దాంట్లో కొన్ని Differences ఉంటుంటాయి. వాళ్ళ Subjects, objects వేరు వేరుగా ఉంటుంటాయి. దానికి కొంత విరుద్ధంగా పోయావంటే, దానిమీద చర్య తీసుకుంటారు. కాబట్టి గవర్నమెంటు రూ ల్సు కు విరుద్ధంగా పోగూడదు. అనుసరిస్తూ పోవాలి. మనదానికి ఏ రూల్సు లేవు. మన రూలు ఒక్కటే Love is the rule to our institution.ఆ ప్రేమచేతనే మన రూల్సును మనం అనుసరిస్తాం. హృదయపూర్వకంగాప్రేమించి ఆచరణలో పెడుతాం. నీవు గవర్నమెంటు స్కూలులో చదువుతూకూడా, సత్యసాయి ఎడ్యుకేషన్‌ను కూడా నీవు అనుసరించవచ్చు. సత్యసాయి ఎడ్యుకేషన్ లక్ష్యం మానవతా విలువలను పెంపొందించడం, మానవతా విలువలను మొట్టమొదట కాపాడుకో, దానిని నిలబెట్టు కుంటూ గవర్సమెంటు ఎడ్యుకేషన్ అనుసరించవచ్చు. ఇది వేరు, అది వేరని భేదంగా చూడకూడదు. ప్రభుత్వరూలను ధిక్కరించకూడదు. దినమునకు 24 గంటలు గదా! ఆరుగంటలు సేపు గవర్నమెంటు స్కూల్లో చదవవచ్చు. ఆరుగంటలు నిద్రకు, ఇంకో ఆరుగంటలు ఆటపాటలకు వినియోగించవచ్చు. మిగిలిన ఆరుగంటలలో మానవతా విలువలను పెంచుకోవడానికి అవకాశం వున్నది. కనుక మానవుడు కాలమును నాలుగు భాగములుగా విభజించాలి. ఒక భాగము స్వార్థమునకు, రెండవభాగము నీ డ్యూటీ, మూడవభాగము నిద్రాహారములకు, నాల్గవభాగము ఆధ్యాత్మికమునకు వినియోగించాలి. కనుక గవర్నమెంటు చదువుకు, సత్యసాయి చదువులకు భేదము చూడకూడదు. మనది సత్యమైన యదార్థమైన ఎడ్యుకేషన్, అది కేవలం Bookish Knowledge (పుస్తక జన్య జ్ఞానం) మనది. Practical knowledge. అది కేవలం పుస్తక జ్ఞానం కదాయని ప్రక్కన పెట్టకూడదు.ఇహమున సుఖింప హేవతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మవిద్య" అన్నారు. ఇహమునకు గవర్నమెంటు ఎడ్యుకేషన్ అవసరం. పరమునకు ఆధ్యాత్మిక విద్య అవసరం. కనుక ఈ రెండున తీసుకోవాలి. ఒకే నాణెమునకు రెండు ముఖాలుంటాయి. ఈ రెండూ ఉన్నప్పుడే ఈ నాణెం చెల్లుతుంది. కనుక దీనిలో భేదాలు ఏమాత్రం పెట్టుకోకూడదు.

 

3. ప్రశ్న: As teachers while improving ourselves, how can we understand the minds of students? How do teachers overcome any deep rooted weaknesses in themselves?

 

(ఉపాధ్యాయులుగా మనల్ని మనము సంస్కరించు కుంటూ, విద్యార్థుల మనస్సును ఏవిధంగా అర్థం చేసుకోవచ్చును? ఉపాధ్యాయులు తమలోని బలహీనతలను ఏవిధంగా పోగొట్టుకొనవచ్చును?)

 

సమాధానం: విద్యార్థుల మనస్సులు గుర్తించి వర్తించడానికి, విద్యార్థుల మనస్సులు ఎట్లా వుంటాయో, ఏమో తెలుసు కోవాలనుకుంటున్నారు. మొట్టమొదట మీ మనస్సులనుమీరు తెలుసుకోండి. తరువాతనే విద్యార్థుల మనస్సులనుమనం చూడవచ్చును. మీలో మంచి మనస్సును అభివృద్ధి పరుచుకుంటే, విద్యార్థుల యందు Reflection of the inner being. అది కూడా మీలో ప్రవేశిస్తుంది. కనుక అక్కడ Mind ను చూడటానికి వీలుకాదు. ఆ విద్యార్థియొక్క ప్రవర్తనను పురస్కరించుకొని Follow (వెంబడిస్తూ) చేస్తూరా. బైట ఏవిధంగా ప్రవర్తిస్తున్నాడు? ఇంటిలో ఏవిధంగా ఉంటున్నాడు? స్కూల్ లో అతని ప్రవర్తన ఎలా ఉన్నది? స్నేహితులతో ఎట్టా ఉంటాడు? వీటన్నింటిని చక్కగా విచారణ చేయాలి. అప్పుడే ఆ విద్యార్థిని చక్కని మార్గంలో పెట్టడానికి వీలవుతుంది. అతని చర్యలను గమనించకుండా, ఆతనిని మార్చాలంటే, ఎలా సాధ్యమవుతుంది? ఇంతియే కాకుండా, ఇంట్లో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛను యిస్తుంటారు. అక్కడ స్వేచ్చగా వుండటంచేత ఇంట్లో స్వేచ్ఛగా ప్రవర్తిస్తుంటారు. స్నేహితులు కూడా మరింత స్వేచ్ఛను యిస్తుంటారు. కాని స్కూలుకు వచ్చేటప్పటికి ఈ స్వేచ్ఛ కొంత కట్టుదిట్టమవుతుంది. తల్లిదండ్రులకు వుండిన ప్రేమవలన వారు ఆమితమైన స్వేచ్ఛను యిస్తుంటారు. ఈ విషయంలో విచారణ చేస్తుండాలి. ఈనాటి ఆధునిక యుగంలో తల్లిదండ్రులు పిల్లలకు కావల్సినంత స్వేచ్ఛను యిస్తున్నారు. కావల్సినంత ధనమును కూడా యిస్తున్నారు.99 శాతం పిల్లలను తల్లిదండ్రులే పాడుచేస్తున్నారు. కావల్సినంత స్వేచ్చమ యివ్వటం వలన పిల్లలు పెడమార్గం పడుతున్నారు. పెడమార్గంలో పోయేటప్పటికి ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు. ఇది తల్లిదండ్రుల తప్పు. కనుక పిల్లలనుమొదటి నుంచే తల్లిదండ్రులు అదుపులో పెట్టుకుంటూ రావాలి. మంచి రోడ్డు ఉన్నప్పుడు కారులో స్పీడుగా పోతుంటాం. జనం అధికంగా ఉన్నచోట, రోడ్డు వంకరటింకరలుగా ఉన్న చోట స్పీడ్ బ్రేకర్స్ పెడతారు. ఎందువలన? అందరి క్షేమం కోసమనే. అదే విధంగా పిల్లల క్షేమం కోసం, పిల్లల స్పీడుకు కొంత బ్రేకులు వేయాలి. ఎలాంటి దానికి స్వేచ్ఛ యివ్వాలి? ఎలాంటి దానికి స్వేచ్ఛ యివ్వకూడదు? విచక్షణా జ్ఞానాన్ని ప్రదర్శించాలి.తల్లిదండ్రులు ఒకేవళ వాడు చెడ్డ మార్గంలో పోతుంటే కఠినమైన శిక్షయివ్వాలి. అట్టివానికి స్వేచ్ఛ యివ్వకూడదు. మంచివానికి ఎంతైనా స్వేచ్ఛ యివ్వ వచ్చును. ధనము యివ్వవచ్చును. కాని వెనుక అతని ప్రవర్తనను గమనిస్తూపో, అప్పుడే ఆ పిల్లవాడు సరియైన మార్గానికి రాగలడు. పిల్లలను సరియైన మార్గంలో పెట్టే బాధ్యతమొదట తల్లిది. కొడుకు పాడైతే తండ్రి బాధ్యత కూతురుది తల్లిది. ఎందుకంటే బిడ్డ తల్లిని అనుసరిస్తూ ఉంటుంది.మొత్తం మీ ద తల్లిదండ్రులు తమ పిల్లలకు అమితమైన స్వేచ్చ యిస్తుండటంవలన, వాళ్ళ ప్రవర్తనము గమనించక పోతుండటవలవవే పిల్లలు పాడైపోతున్నారు. ఆవిధంగాప్రవర్తించకుండా ఉండే నిమిత్తమై స్కూల్ అనేది మూడవది పెట్టారు. అక్కడ అధ్యాపకులు బాధ్యతను స్వీకరించాలి. చక్కటి బుద్ధులు నేర్పిసరియైన మార్గంలో పిల్లలను నడిపించాలి అధ్యాపకులు. మంచి మార్గంలో నడుస్తూ ఇంటి పేరును, తల్లిదండ్రుల పేరును, స్కూల్ పేరును నిలబెట్టాలని ఆధ్యాపకులు విద్యార్థులకు నుంచి బోధనలు చేయాలి. మంచి మాటలతో పిల్లలను సరియైన మార్గంలో పెట్టాలి. ఈనాడు విద్యార్థులలో వినయ విధేయతలు లేకుండా పోతున్నాయి. అట్టివారికి వినయ విధేయతలను నేర్పవలసిన బాధ్యతను సత్యసాయి సంస్థల వారు కూడా తీసుకోవాలి. విద్యార్థులను సరిదిద్దటానికి ప్రయత్నించాలి అధ్యాపకులు. అప్పుడే మీ కీర్తి కూడా అభివృద్ధి అవుతుంది. నీవు ఆచార్యుడవు, అధ్యాపకుడవు కాదు. ఆచరించి బోధించేవాడు ఆచార్యుడు. నీవు ఆచరించి పిల్లలకు బోధించు. ఇక పిల్లలలో కొన్ని దురభ్యాసాలు కూడా ఉంటుంటాయి. ఆ దురభ్యాసాలనుమొట్టమొదట అధ్యాపకులు వాటిని కంట్రోల్ చేసుకొని, తరువాత పిల్లలకు బోధించాలి. ఆధ్యాపకుడు ఏ ఒక్కటి చెడ్డది చేసినా, పిల్లలు దానిని అనుసరిస్తారు. కనుక అధ్యాపకులు చెడ్డది చేయకూడదు. మంచినిచేయి, మంచిని చెప్పు. ఇదే సరియైన విద్య లక్షణం. అప్పుడే విద్యార్థులలోవున్న మంచి కూడా బయటపడుతుంది.ఆనాటి నుంచి మంచివాడుగా ప్రవర్తిస్తాడు. విద్యార్థి. ఇది నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను పిల్లలను ఎన్నో విధములుగా శిక్షిస్తుంటాను. అరుస్తుంటాను. చెబుతుంటాను, మళ్ళీ ప్రేమిస్తుంటాను. అన్ని యిస్తుంటాను. కొన్ని సమయాల లోపల చాలా కఠినంగా కూడా ఉంటాను. అప్పుడు పిల్లలే నాదగ్గరకు వచ్చి స్వామీ! నేను చేసింది తప్పు క్షమించండని ప్రాధేయపడుతుంటారు. అలాంటి తప్పులు మరల చేయమని ఏడుస్తారు. అప్పుడు స్వామి కరిగిపోతాడు. ఇకనుంచి తప్పులు చేయకు. నేను ఏది చేసినా మీ మంచికోసమే అని చెబుతాము. టీచర్పు కూడా ఆవిధంగా చేస్తుండాలి.

 

4. ప్రశ్న: What is the most important quality, a teacher must have?

ఉపాధ్యాయులకు వుండవలసిన అతి ముఖ్యమైన గుణము ఏది?

 

ఇది చాలా ముఖ్యమైనది. ఏది మంచిదని భావిస్తారో టీచర్సు దానిని ఆచరించి చూపించుతూ పిల్లలకు బోధిస్తూ రావాలి. పిల్లలకు ఆదర్శమైన జీవితాన్ని అందిస్తూ రావాలి ఆధ్యాపకులు. నేను కమలాపురంలో చదువు తున్నాను. ఆయ్యంగార్ అనే టీచర్ వుండేవాడు. ఆయన బజారులో వస్తుంటే చూచిన పిల్లలు భయపడి ప్రక్కకు తప్పుకునేవారు. దానిని గమనించాడు ఆయన ఆటీచరు వస్తుంటే, ముందుగానే చింతబెత్తాలు తీసుకొని తెచ్చి పెట్టాలి. ఆ రోజులలో ఆ క్లాసుకు నేనే మానేటరు. నేనే మానేటరు కావటం వలన బెత్తాలు తీసుకొని వచ్చే బాధ్యత నాదే. ఆ విధంగానే పెట్టాను. అందులో ఒకబెత్తం తీసుకొని ఏ రాజా!రా! అన్నాడు. ధైర్యంగా వెళ్ళాను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. నన్ను చూచి, ఎందుకు ఆ సందులోకి వెళ్ళావు? అని అడిగాడు అయ్యంగార్. "మిమ్ములను నేను చూడలేదు. కాని తని ఇంటిలోపల నా నోట్‌బుక్ ఉన్నది. దానిని తీసుకోవడానికి మాత్రమే అటువెళ్ళాను. నేను మిమ్ములను చూడలేదు సార్!" అన్నాను. ఏయి! చూడలేదా? అని గట్టిగా అరిచాడు. చూడలేదు అని గట్టిగా నేనూ చెప్పాను.

 

నిన్ను కొడతాను అన్నాడు. నన్ను కొట్టాలని కోరిక మీకు ఉంటే, కొట్టండి! అని చేయి యిచ్చాను. ఆ మాటలోని సత్యాన్ని గుర్తించిన ఆయనకు కంటిధారలు కారినాయి. దగ్గరకు వచ్చాడు.రాజూ! నీవు అలాంటి పనులు చేయవని నాకు బాగా తెలుసు. కాని నీవే అనుకొని, నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పుచేయనివాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడేమని నాకు చాలా కోపం వచ్చింది. కాని నీవు ఇలాంటి తప్పులు చేయవు. నాకు తెలుసు అని చెప్పాడు. ఆ తరువాత పిలిచి రేపు స్కూలుకు వెళ్ళేటప్పుడు మా ఇంటికి రమ్మనమని చెప్పాడు. వెళ్ళాను. వరండాలోనే నుంచున్నాను.

 

ఆయన భార్య వచ్చి నన్ను లోపలకు తీసుకొని వెళ్ళింది. లోపలకు వెళ్ళేను. ఆయన ప్రేమకు అంతులేదు. ఒక ప్లేటులో పకోడీలు పెట్టి తీసుకొని వచ్చాడు. తినమని కోరాడు. నిన్న నేను తప్పుచేశాను. నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. కొట్టాలనుకున్నాను. నీవు తప్పుచేయలేదని గ్రహించాను. బాధపడ్డాను. ఆ తప్పుకు పరిహారంగా నీతో స్నేహం చేసుకుంటున్నాను అన్నాడు. చూశారా! మన మంచితనం, మన సత్యవాక్కులు, మన మంచిగుణములు ఎలాంటి వారినైనా కరిగిస్తుంది. కదిలిస్తుంది. వయసు ప్రధానం కాదు, చదువు ప్రధానంకాదు. హృదయం ప్రధానం.

 

సహజంగా టీచర్సును చూస్తుంటే పిల్లలకు భయం. కాని నాకు భయముండేది కాదు. కారణం? నేను ఏ తప్పు చేసేవాడను కాదు. కనుక ఎందుకు భయపడాలి? అప్పుడు మహబూబ్ ఖాన్ అనే ఇంగ్లీషు టీచర్ కూడా వుండేవాడు. అతనికి నా క్లాసుకు రావటం అంటే మహా ఇష్టంగా ఉండేది. నేనంటే అతనికి ప్రేమ. అతనికి పిల్లలు లేరు. నన్ను ప్రతి దినం వచ్చి వాళ్ళ ఇంట్లో టిఫెన్ చేసి వెళ్ళమనేవాడు. 11 సంవత్సరం వచ్చేటప్పటికి ఆ స్కూలును వదిలి పెట్టాను. అయితే ఆనాటి వరకు ప్రతిరోజు నేనే ప్రార్థన చేసేవాడను. ఆ ప్రార్థనను కూడా నన్నే వ్రాయమని మాస్టార్లు కోరారు. అప్పుడు ఈ ప్రార్థనను వ్రాసి ప్రతిరోజు చదివేవాడను.

 

"అహరహతవ ఆహ్వాన ప్రచారిత

సునిశిత ఉదాహరవాణి

హిందూ, బౌద్ధ, సిక్, జైన, పారశిక్

ముసల్మాన్, కిరస్తానీ

పూరబ్ పశ్చిమ్ అసీ

తనసింహాసన్ వాసీ

ప్రేమవాహిని... ప్రేమ వాహిని.....

 

జనగణమన అధినాయక జయహే

జనగణమన అధినాయక జయహే...."

 

అని ప్రార్థన చేసేవాడను. అన్ని మతాల పేర్లను దానిలో పెట్టాను. ఆ ప్రార్థనను విని అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ చిన్ననాడే సర్వమత సమన్వయాన్ని బోధించాను. ఆ తరువాత ఆ స్కూలును వదిలి పెట్టాను.

 

"నేను సాయిని తెలియుము నిక్కముగము

మమతబాయుము యత్నముల్ మానుకొనుము

బాసె మీకు నాతోడి సంబంధమింక

కాదు నన్పట్ట మరి యెట్టి ఘనునికైన"

పిల్లలంతా బాధపడ్డారు, టీచర్పు ఆశ్చర్యబడ్డారు. రాజూ ! ...రాజూ! అంటూ పిల్లలు నావెంట పడ్డారు. ఎవరికీ నేను జవాబు చెప్పలేదు. సరాసరి ఉరవకొండ వచ్చాను. ఆంజనేయులు తోటకు వెళ్ళాను. ఒక పెద్ద బండరాయి మీద కూర్చున్నాను. వచ్చిన వారందరికీ బోధ చేస్తూ వచ్చాను.

 

"మానసభజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం ఇది నా మొదటి బోధ. రాజూ లేని స్కూలులో నేనుండను అని ఒక తెలుగు టీచర్ రాజీనామా చేశాడు. తరువాత మహబూబ్ఖాన్టీచర్ కూడా రాజీనామా చేశాడు. రెండవ దినం గొంతు బాగున్నదని ఒక మహమ్మదీయ విద్యార్థిని ప్రార్థన చేయడానికి నిలబెట్టారు. అతనే స్టేజి ఎక్కాడు. స్వామి కనిపించకపోయేటప్పటికి, ఏడ్వడం మొదలు పెట్టాడు. అందరు పిల్లలూ ఏడ్వడం మొదలు పెట్టారు. ఆనాటి నుంచి ఆ ప్రార్థన మానేశారు. పిల్లలు మాష్టర్లు ఆ విధంగా నన్ను ప్రేమించారు. నా మీద అంత అప్యాయతవారికి ఉండేది. మన ప్రేమ ద్వారా ఎలాంటి గురువులనైనా చక్కగా కైవసం చేసుకోవచ్చును. పిల్లలను కూడా మన వశం చేసుకోవచ్చును. మన ప్రేమను బట్టే వారంతాప్రేమిస్తుంటారు. కనుక టీచర్సు పిల్లల యొక్క స్వభావాన్ని చక్కగా కనిపెట్టాలి. మొట్టమొదట మనలో రావల్సింది. సత్యం. మన భారతీయ సంస్కృతిలో కూడానూ, ’మొట్టమొదట సత్యంవద, ధర్మం చర అన్నారు. నేను ఎప్పుడూ వినయంతో పలుకరించేవాడ్ని. ఇప్పుడు కూడనూ పిల్లలకు అదే చెబుతుంటాను . "You cannot always oblize, but you can speak always oblizingly”అనిచెబుతుంటాను. వినయంతో మాట్లాడే మాటలు హృదయాలను కరిగించి వేస్తాయి. అయితే కొన్ని కొన్ని సమయాలలో కఠినంగా చెప్పవలసి వస్తుంది. కఠిన విషయంలో నేను వజ్రము కంటే కఠినమే. ప్రేమలో వెన్న కంటే చాల మెత్తనే. కనక పిల్లలను మనం వశం చేసుకోవాలంటే రియైన ప్రేమతో వారిని దగ్గరకు చేర్చాలి. వారిలో తప్పులు ఏమైనా వుంటే వారికి చక్కగా చెప్పి సరియైన మార్గంలో పెట్టాలి. అప్పుడే వారికి చక్కగా చెప్పి సరియైన మార్గంలో పెట్టాలి. అప్పుడే వారు మంచి మార్గంలోనికి వస్తారు. వారి తప్పులను మన దగ్గర ఒప్పుకుంటారు. అయితే ఒప్పుకున్న తరువాత తిరిగి ఆ తప్పులు చేయకుండా చూడాలి. ఆ విధమైన మార్గమును అధ్యాపకులు అనుసరిస్తుంటే, ఎంతయో దేశానికి ఉపకారం చేసినవారవుతారు. దేశమును అంతా బాగు చేయాలను కుంటే అధ్యాపకులు, పిల్లలపైన మంచి ఆదర్శవంతమైనప్రేమను పెంచుకోవాలి. అప్పుడే ప్రపంచంలో ఎంతమంది మంచి విద్యార్ధులనైనా తయారు చేయవచ్చును.

 

5.ప్రశ్న: How to implement educare in the case of children from deprived from slum areas including children from broken homes who present discipline problems in a class.

సమాధానము: పరిశుభ్రం చేయడానికి సేవాదళ్ ఏర్పాటు చేయబడింది. ఎక్కడకు పోయినా cleanliness is Godliness అన్నారు గదా! ఇల్లు చిన్నదైనప్పటికినీ పరిశుభ్రంగాఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకోకపోతే వ్యాధులు వ్యాపిస్తాయని చెప్పాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని బోధించాలి. వారానికొక పర్యాయం పల్లెలకు వెళ్ళి మనమే పరిసరాలను శుభ్రం చేస్తూ పోతుంటే, వాళ్ళే ముందుకు వచ్చి పరిశుభ్రం చేయటంమొదలు పెడతారు. ఇటువంటి పనులు అధ్యాపకులు పిల్లలచేత చేయిస్తూండాలి.

 

6. ప్రశ్న. How do we motivate children in the Educare Programme?

ఎడ్యుకేర్ కార్యక్రమములో పాల్గొనేటట్లు పిల్లలు ఎలా ప్రోత్సహించాలి?

సమాధానము : పిల్లలలో ఈ Eduare Programmes అమలు పరచటం సాధ్యం కాదు. ఎందుకంటే వారి వయస్సు చాలా చిన్నది. Educare కార్యక్రమాన్ని కాలేజీలలో అమలు చేయవచ్చును. అంతకు పూర్వం అనగా చిన్నతనంలో చిన్న చిన్న కథలు ద్వారావారి మనస్సులలో మంచి బీజాలు నాట వచ్చును. మహానుభావుల చరిత్రలు కథలుగా చెప్పవచ్చును. ఆవిధంగా చెబుతూ పిల్లల మనస్సులను మారుస్తూరావాలి.

 

7. ప్రశ్న : How do we attract Non-devotee children to Sathya Sai Schools?

సత్యసాయి భక్తులుకాని కుటుంబాలలోని పిల్లలను సత్యసాయి స్కూల్స్ లోనికి ఏవిధంగా ఆకర్షించగలము?

సమాధానము : ఇది చాలా ముఖ్యమైనటు వంటిది. తల్లిదండ్రులకు సత్యసాయిబాబా విషయం తెలియదు. మన స్కూళ్ళకు వచ్చేవారికి మాత్రం తెలుసు. అలాంటి పిల్లలను దగ్గర కూర్చోపెట్టుకొని మంచిగా అర్థమయ్యే టట్లుగా వివరించి చెప్పాలి. స్కూల్ లో వారు నేర్చుకొనిన మంచి విషయాలను తిరిగి వారి వారి తల్లిదండ్రులకు పిల్లల చేతనే చెప్పించే ప్రయత్నం జరగాలి. సత్యసాయి స్కూలుకు వెళ్ళటం వలననే నాకు యిన్ని మంచి విషయాలు తెలిసాయని పిల్లల తల్లిదండ్రులకు చెబితే వుండే ప్రభావం అంతటిది ఇంతటిది కాదు. భోజనంచేసే ముందు మన విద్యాసంస్థలలో బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిః" అనే శ్లోకం చెబుతాం. ఇంటికి వెళ్ళినపుడు కూడా విద్యార్థులు ఈ శ్లోకం చెప్పి అన్నం తింటుంటే, తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. మన వాడికి భక్తి పెరిగిందని సంతోషిస్తారు. ఆ శ్లోకం అర్థం చెబితే తల్లి దండ్రులు యింకా సంతోషిస్తారు. మన విద్యాసంస్థల యెడల సదభిప్రాయం ఏర్పడుతుంది. మనం తినే అన్నం, ఈ శ్లోకం చెప్పి తింటే, ఆ అన్నం ప్రసాదంగా మారిపోతుందని, ఆ ప్రసాదంలో ఎట్టి దోషములూ ఉండవని తల్లి దండ్రులకు ఇంటి వద్ద పిల్లలు చెబితే ఎంతో సంతోషించి, వారు కూడా అన్నం తినేముందు ప్రతిపూట ఈ శ్లోకం చదవటం మొదలు పెడుతారు. పిల్లల ద్వారా వారి వారి తల్లిదండ్రులను కూడా మంచి మార్గంలో పెట్టవచ్చును. కనుక మొట్ట మొదట పిల్లలను మంచి మార్గంలో పెట్టి వారి ద్వారా వారి తల్లిదండ్రులను కూడా సన్మార్గంలో ప్రవేశ పెట్టవచ్చును. కనుక పిల్లలకు వారి వారి క్లాసులలో మంచి విషయాలను బోధించాలి. నేర్చుకొనిన మంచి విషయాలను పిల్లలు తమ ఇంటి వద్ద ఆచరణలో పెట్టేటట్లుగా చూడాలి. అప్పుడు దాని ప్రభావం తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది. మనస్కూళ్ళలో చెప్పే విషయాల మీద తల్లిదండ్రులకు దభిప్రాయం కూడా ఏర్పడుతుంది. పిల్లలను ప్రోత్సహిస్తారు. కనుక మొట్టమొదట మనవద్దకు చదువుకోవడానికి వచ్చే పిల్లలను మంచి మార్గంలోనికి మార్చాలి. అప్పుడు ఆ పిల్లలే వారి వారి తల్లిదండ్రులను మారుస్తారు. ఉదాహరణ: మన విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులు మాంసాహారం తినటం మానివేస్తారు. ఇంటికి వెళ్ళిన తరువాత ఆ పిల్లల ప్రవర్తనను చూచి, వారి మాటలను విని, మాంసాహారం మానివేసిన తల్లిదండ్రులెందరో ఉన్నారు. కమక పిల్లల ద్వారా వారి వారి తలిదండ్రులను కూడా మార్చవచ్చును.

 

8వ ప్రశ్న; How to actively involve parents in educare programme?

తల్లి దండ్రులు ఎడ్యుకేర్ ప్రోగ్రాములో చురుకుగా పాల్గొనేందుకు ఏం చేయాలి?

 

సమాధానం : ఈ Educare ప్రోగ్రాంలోపల తల్లి దండ్రులను కూడా ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. దీనిని పిల్లల చేత ఆచరింప జేయించి వారి ద్వారా దీనిని వారికి నేర్పించాలి. అర్థం తెలిసిన పిల్లలు దీనిని ఆచరిస్తూ పోతుంటే, తల్లిదండ్రులు కూడా అనుసరిస్తుంటారు.

 

9 ప్రశ్న: What is the role of Technology such as computer and its effects on education?

విద్యా విధానంపై నేటి కంప్యూటర్ టెక్నాలజీ పాత్ర, దాని ప్రభావము ఏమిటి?

 

సమాధానం : టెక్నాలజీ నాకొక ట్రిక్ నాలెడ్డి గా కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ కంప్యూటర్స్ మీద నాకు సమ్మకం లేదు. ఈనాడు కాదు, 5 సంవత్సరాలుగా నేను చెబుతూనే ఉన్నాను. అన్నిటికీ రోగాలు వచ్చినట్లుగా ఈ కంప్యూటర్‌కు కూడా ఏదో ఒక రోగం వస్తుందని నేను ఏనాడో చెప్పాను. ఇప్పుడు వచ్చింది. నేను అప్పుడే ఒక విషయం చెప్పాను. నీవు "కంపోజర్ కాని కంప్యూటర్ వికాకూడదు అన్నాను. కంప్యూటర్ అనేది చెడిపోతుంది. ఎప్పుడు? కంపోజర్ చెడిపోయినప్పుడే "కంప్యూటర్ చెడిపోతుంది. ఈనాడు ప్రతి చిన్నదానికీ "కంప్యూటర్స్ మీద ఆధారపడుతున్నారు. ఏ షాపుకు వెళ్ళినా, ప్రతి చిన్న లెక్కకు కాలిక్యులేటర్‌ను ఉపయోగిస్తున్నారు. భగవంతుడు ప్రసాదించిన మేధస్సును ఉపయోగించు కోవటంలేదు. కృత్రిమమైన వాటి మీద ఆధారపడు తున్నారు. అవి చెడిపోతే నిరాశపడుతున్నారు. నేను కంప్యూటర్లను వద్దని చెప్పటం లేదు. కొన్ని స్థాయిలలో అవి అవసరమే. కాని అన్ని స్థాయిలలో మాత్రం కాదు. పూర్వం ప్రతి ఒక్కరు ఒళ్ళు వంచి పనిచేసేవారు. తెల్లవారినప్పటి నుంచి రాత్రి పరుండే వరకు పనిచేసేవారు. కానినూరుమంది చేసే పని ఇప్పుడు ఒక కంప్యూటర్ చేస్తున్నది. అందువలన చాలా మందికి పనిలేకుండా పోతున్నది. పనిలేకపోవటం వలన చాలామంది పెడమార్గాన పడుతున్నారు. కనుక ప్రతి చేతికి పని కల్పించాలి. ప్రతి చేనుకు నీరు అందించాలి. ప్రతి ఇంటిని ఒక పరిశ్రమగాతయారుచేయాలి. అప్పుడు అందరికీ పని ఏర్పడుతుంది. కేవలం మిషన్ల పైననే మనం ఆధారపడకూడదు.

 

10. ప్రశ్న : How to go about starting the first Sri Sathya Sai School in a country?

ఏదైనా ఒక దేశంలో ప్రధమంగా సత్యసాయి స్కూలు ప్రారంభించాలనుకుంటే ఏమి చెయ్యాలి?

సమాధానం : అందరూ స్కూళ్ళు కట్టలేరు, నడపలేరు, అంతటి శక్తి సామర్థ్యములు అందరికీ ఉండవు. కాని బాల వికాస్ లను ప్రారంభించండి. ఆ విధంగా చేస్తూ పోతుంటే, దానికి ఆకర్షితులై ఆ గ్రామస్తులే చిన్న స్కూలను కడతారు. ఎవరి శక్తిని బట్టి వారు పనిచేయండి. ఏ దేశంలో చూచినా సరే బాలవికాస్ కార్యక్రమాలు స్త్రీలే బాగా చేస్తున్నారు.వారి వారి ఇంటి పనులను చూచుకుంటూ బాలవికాస్ కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్నారుస్త్రీలు. కనుక పెద్ద పెద్ద స్కూళ్ళు కట్టించలేదని బాధపడకండి. పదిమంది పిల్లలను ఒక వరండాలో చేర్చి మంచి విషయాలను చెప్పండి. మానవతా విలువలను బోధించండి. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను గురించి చక్కగా వివరించండి. వాటికి సంబంధించినచిన్న చిన్న కథలను చెప్పండి. ఆ విధంగా చెబుతూ పిల్లలను తీర్చిదిద్దండి.

 

11. ప్రశ్న : What is Sai Baba s vision for the future of Sathya Sai Schools around the world?

ప్రపంచవ్యాప్తంగా నడుపబడుతున్న సత్యసాయి విద్యా సంస్థల భవిష్యత్తు గురించిన స్వామి ధృక్పదం ఏమిటి?

సమాధానం : మున్ముందు ఏవిధంగా ఉండాలనేది మీరు అనుకోనక్కరలేదు. ఇప్పుడు చేయవలసింది మీరు చక్కగా చేస్తూరాండి! ఇప్పుడు మీరు చక్కగా చేస్తే, మున్ముందు అదే చక్కబడిపోతుంది. కనుక భవిష్యత్తు (future) ను గురించి యోచన చేయకండి. Future is not sure, It is not in your hand, Present is very important. Present also is not ordinary present. This is Omni - Present. అమ్ని ప్రెజెంట్ ను ప్రజెంట్ గా తీసుకోండి. తరువాత future లో అదే మార్పు చెందుతుంది. మీరు ఈనాడుఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా? లేదు. మీరు మంచి పని చేస్తూ పోతుంటే, మంచి పనే మీలో ప్రమోషన్ యిస్తుంటుంది.

 

12.ప్రశ్న: Is it necessary to admit students from KG classes or can they be admitted directly to higher classes in Sri Sathya Sai Schools?

సత్యసాయి స్కూల్స్ నందు కె.జి.తరగతి నుండే పిల్లలను చేర్పించుకొనుట అవసరమా లేక మధ్యలో కూడా చేర్పించుకొనవచ్చునా?

సమాధానము : నా ఉద్దేశ్యము మన మన స్థాయిని బట్టి మనం ప్రయత్నము చేయవచ్చును. మన శక్తి పురస్కరించుకొని మనం దానిని ఎన్నుకోవాలి. కె.జి. నుంచి తీసుకోవచ్చును. IIIrd Class, IVth Class లనుండి తీసుకోవచ్చును. మన ఆనుకూలాలను బట్టి తీసుకోవచ్చును. దానికి నిర్బంధమేదీ లేదు.

 

13.ప్రశ్న:Should Gayatri Mantra be chanted in western Satya Sai Schools? పాశ్చాత్య దేశాలలోని సత్యసాయి స్కూల్స్ లో గాయత్రి మంత్రం పఠించుట తప్పనిసరా? స్వామి సమాధానం: దీనికి నేను సమాధానం చెప్పను. ఎందు కంటే, ఎవరిష్టం వారిది. నీ హృదయాన్ని నీవు అనుసరించు. ఈ గాయత్రి చెప్పటం వనల మంచి జరిగిందని మీరు భావిస్తే తప్పక చేస్తూరాండి. గాయత్రి అనేది ఒక స్త్రీ కాదు, ఒక మతం కాదు. ఒక దేశానికి సంబంధించినది కాదు. ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది. ఇది మంత్ర స్వరూపంలో ఒక విధమైనటు వంటి శక్తితో కూడినటువంటిది. అది ప్రతి మానవునియందు ఉంటున్నది. భూర్, భువః సువఃభూర్’Body Materialisation : భువఃMind, Vibration సువఃఅనగా Radiation. ఈ మూడింటి యొక్క తత్త్వమే మానవత్వము. భూర్, భువః, సువః - ఇది ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా అవసరమే. ఓం భూర్భువస్సువః తత్స వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్. భర్గో అనగా చీకటి. అనగాఅజ్ఞానము. కనుక ఈ అజ్ఞానమును పారద్రోలి నాకు మంచిబుద్ధిని ప్రసాదించు అని చెబుతున్నది. గాయత్రి మంత్రం.ఇది ఏ దేశం వారికైనా కావాలి. కనుక ఏదేశంవారైనా, ఏజాతివారైనా ఏకులం వారైనా గాయత్రి మంత్రం చేయవచ్చును. ఇది వారి వారి ఇష్టముమ పురస్కరించుకొని చేసుకొనవచ్చును.ఇందులో ఏమాత్రం వదిలినా తప్పులేదు. మొత్తం పఠించినా తప్పులేదు. నేను ఎప్పుడూ ఎవరిని Force తో చేయమని చెప్పను, నాదంతా Source, మిలటరీది పోర్సు. కనుక ఆ మిలటరీ పని నేను చేయము. నా సోర్సు ప్రేమ. కనుక ప్రేమతో చేయమని చెబుతాను.

 

ఇంకా చాలా ప్రశ్నలున్నాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పడానికి సమయం లేదు. ముఖ్యంగా మీరందరూ హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి. పవిత్రమైన దైవ ఆజ్ఞలను శిరసా వహించండి. రామా! అనండి. ఆల్లా! అనండి. ఏసూ! ఆనండి. కృష్ణా! అనండి. ఎవరిని తలచినా ఫరవాలేదు. ఎట్టి భేదమూలేదు. వారిని తలచుకుంటూ, మీ గుణములను పవిత్రం గావించుకోండి. నాలో ఏమాత్రం స్వార్థం లేదు. నేను ఏది చెప్పినా, శిరసావహించి చేయండి. అంతా మీ మంచికే...మీ మంచికే...కనుక మీరు అనుసరించి ఆనందించి అందిరికీ పంచి పెట్టండి. అదే నేను ఆశించేటటువంటిది.

(శ్రీ.డి.2001 పు. 37/40 మరియు 22002 పు.20/22)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage