సత్యసాయి అంటే సత్యమునే ఆధారముగా నిర్ణయించుకొన్నవాడు అని అర్థం. సత్యము నిండుకొన్న హృదయాలలో స్థాయిగా నిలుచువాడు. సత్యస్య సత్యమైన సాయి మీ హృదయంలో శయనించియున్నాడు అనేది ఈ పేరు యొక్క అంతరార్థం.
(స. సాన.99పు.308)
ఇంకా మున్ముందు ఎన్నో గొప్ప కార్యములు జరగ బోతున్నాయి. సత్యసాయి చేయలేని కార్యము ఏదీ లేదు. అందరికీ ఆశ్యర్యం కలిగించే చర్యలు చేయగలడు. "లోకాస్సమస్తా: సుఖినో భవంతు", అందరూ సుఖంగా ఉండాలి, అన్నదే సాయి ఆశయం. అందరి సుఖం కోరేవారికి ఎట్టి కష్టములూ రావు; వచ్చినా అవి వారిని ఏమీ చేయలేవు. ఒక చిన్న ఉదాహరణ: ఒక పర్యాయం బుద్ధుడు ఎక్కడికో వెళుతున్నప్పుడు అసూయా రాక్షసి అతనికి ఎదురు వచ్చి "బుద్దా! నిన్ను నేను చంపి భుజిస్తాను." అని బెదిరించింది. బుద్ధుడు చిరునవ్వు నవ్వి "నా పై అసూయతో నన్ను చంపాలని వస్తున్నావా? నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను." అన్నాడు. బుద్ధుడు ఈ విధంగా పలికేసరికి ఆ అసూయా రాక్షసి శాంతి. ప్రేమలకుచిహ్నమైన పావురంగా మారి ఎగిరిపోయింది. కనుక, అసూయను, క్రోధమును, ద్వేషమును ప్రేమతో జయించాలి. శాంతమును పెంచుకోవాలి. అప్పుడే మీరు నిజమైన భక్తులవుతారు. పొగిడితే ఆనందించడం, తెగిడితే ద్వేషించడం మంచిది కాదు. రెండింటిపట్ల మనం సమత్వం వహించాలి. దూషించివారని వారిపట్ల ద్వేషం పెట్టుకో కూడదు. భూషించినారని వారితో స్నేహం పెంచుకో కూడదు. దూషణ, భూషణ, తిరస్కారములు వారి నోటికేగాని, మనకు కాదు. కనుక. మీరు ఎవరి పైనా ద్వేషం పెట్టుకోకండి. ఎక్కడైనా మంచిని చూడండి, తీసుకోండి: చెడ్డ ఎక్కడున్నా దానిని చూడకుండా వదలి పెట్టండి. దూషణ, భూషణ, తిరస్కారములు ఎన్ని కల్గినప్పటికీ సాయిని కదిలించేవాడు లేడు. సాయి ఎప్పుడూ సత్యములో నిలిచినవాడు. సత్యాన్ని ఎవ్వరూ ఏమాత్రమూ కదిలించలేరు. ఈ విధమైన దృఢనమ్మకంతో జీవించండి: దైవవిశ్వాసాన్ని దినదినానికి పెంచుకోండి. అది పెరిగితే ఈ దుర్మార్గమంతా భస్మమైపోతుంది. మీరు విన్న విషయాలను హృదయంలో పదిలపరచుకొని, మీరు చేస్తున్న సాధనలను కొసాగించండి.
(స. సా. జ .2001పు 5/6)
"సత్యసాయి అనే పదము యొక్క అంతరార్థమేమిటి? సత్య అనగా ఋగ్వేదమని అర్థము. సా అనగా సామవేదము. అ అనగా అధర్వణవేదము. "య" అనగా యజుర్వేదము. కమక సర్వవేదముల సారమే ఈ సత్యసాయి.
(ససా..ఏ. 2002 పు. 98)
(చూ|| దివ్యప్రకటనలు, పుట్టపర్తి, పువ్వులు)