సాయిసంస్థదినదినాభివృద్ధినోందుతుంది.ఇప్పుడేకాదు, సూర్యచంద్రాతులున్నంతవరకుసాయిసంస్థకుఏమాత్రముఇబ్బందిఉండదు. (స.సా.సె2013 పు.10)
ఈనాడు సాయిసంస్థలలో పని చేస్తున్నవారు గొప్ప త్యాగభావంతో, ఎలాంటి కష్టాలనైనా సహించుకొని, హృదయపూర్వకంగా సేవలు చేస్తున్నారు. మున్ముందు మీరు త్యాగాన్ని మరింత అభివృద్ధి పర్చుకొని పవిత్రమైన సేవలలో పాల్గొని సాయిభక్తులనే సార్థక నామధేయులు కావాలని నేను ఆశిస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు చేసే సేవను చూసి “వీళ్లు సాయిసంస్థలకు చెందినవారు,"అని ప్రజలు గుర్తించగల్గాలి. జాతి, మత భేదములకు అవకాశమివ్వకుండా అందరూ భగవంతుని బిడ్డలేనని భావించాలి. All are one, be alike to every one (అందరూ ఒక్కటే. అందరిపట్ల సమత్వాన్ని వహించాలి)
ప్రేమస్వరూపులారా ! ఈ నూతన సంవత్సరంలో పవిత్రమైన, ఆదర్శవంతమైన భావాలు మీలో ఉఱ్ఱూతలూగాలి. అహంకార, ఆడంబరాలకు స్వస్తి చెప్పి, వినయవిధేయతలతో, ప్రేమతో సమాజ సేవలో పాల్గొనండి. ప్రేమతో సేవ చేయడంకంటే మించిన తపస్సు మరొకటి లేదు. హృదయంలో ప్రేమ లేకుండా చేసే సాధనలన్నీ చిల్లులు పడిన పాత్రలో నీరు పోసినట్లుగా వ్యర్థమైపోతాయి. మీరు ఎక్కడికి పోయినప్పటికీ సాయిభక్తులనే పేరుకు తగినట్లు ప్రవర్తించాలి. మీ పనులయందు, మాటలయందు, నడతయందు సాయియొక్క ప్రేమతత్వం ప్రతిబింబించాలి. దైవానుస్మరణ గావిస్తూ సమాజ సేవలో పాల్గొనాలి. అప్పుడే మీ జీవితం ధన్యమౌతుంది.
(స.సా.జూ..2000పు.180/181)
పరుల కింపైనట్టి పనులు చేయకయున్న
మాటలింపుగ పల్కి మసలరయ్య
సత్సంగమును చేరి సద్గుణము లార్జించి
కర్మ బంధ విముక్తి గాంచరయ్య
పశు లక్షణము వీడి పశుపతి కావలె
నరుడవై మానవోద్ధరణ సలుపు
దయగల హృదయమే దైవమందిర మౌను
దయలేని హృదయమే దయ్యమౌను
అహము పరనిందలను పాడు కుళ్ళు తీసి
సర్వజీవుల యందు సర్వేశ్వరుండు –
ఒక్కడే యన్న భావంబు వదలకున్న
సార్థకంబౌను శ్రీ సాయి సంస్థలన్ని! - బాబా
(శ్రీ వాణి నవంబ ర్ 2021 పు 78)