అసూయా భావములు రాగద్వేషములు మున్నగు దుర్గుణాలన్నిటినీ దూరం చేస్తే ఎక్కడున్నా మీరు నావారే, నేను మీవాడనే.
అడపులందున్న ఆకసమున నున్న
పట్టణమున నున్న పల్లెనున్న
గుట్టమీదనున్న నట్టేట బడియున్న
దిక్కులేని వారికి సాయియే దిక్కు
మీరెక్కడున్నప్పటికి మీహృదయాన్ని పవిత్రం చేసుకోండి. పవిత్రమైన ప్రేమను పెంచుకోండి. ఆ ప్రేమచేత మీజన్మను సార్దకం గావించుకోవడమే గాక మీ పరివారాన్ని పరిసర ప్రాంతాలవారిని కూడా పవిత్రం చేయడానికి అవకాశ ముంటుంది.
(స.పా.డి.96పు.315)