ఒక చెట్టుమీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి. అందులో ఒకటి ఆ చెట్టు పండ్లను తింటున్నది. రెండవది ఊరక సాక్షీమాత్రంగా చూస్తున్నది. అని ఉపనిషత్తులో చిన్న సన్నివేశం ఉంది. దాని తత్త్వం ఏమిటంటే ఆ చెట్టు దేహము. పండ్లు ప్రాపించక సుఖదుఃఖాలు. ఆ పండ్లు ననుభవించే పక్షి జీవాత్మ, సాక్షిగా చూస్తున్న పక్షి పరమాత్మ.అవి రెండుగా కనిపిస్తున్నప్పటికీ వస్తుతః అవి రెండు ఒకటే. పరమాత్మ యొక్క ఆభాస రూపమే జీవాత్మ, అయినప్పటికీ సుఖ దుఃఖానుభవము జీవాత్మ కేగాని పరమాత్మకు ఉండదు. పరమాత్మ కేవలం సాక్షీభూతుడు.
(త.పు.182)