ప్రతి మానవుడూ భగవంతుని మెస్సేంజరు విశ్వసించాలి. స్వామియొక్క ఆదేశాలను, సందేశాని జగత్తుకు చాటుతూ పోవాలి. ఒకరు నో అనవచ్చు. మరొకరు “ఎస్ అనవచ్చు. ఈ ‘నో, ఎస్ లు మీ నోటికే గాని, సాయి సర్వం ఎస్, ఎస్, ఎస్ ! దైవంలో ఎట్టి దోషములూ ఉండ వు. దైవం చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పని సక్రమమైన విగానే ఉంటాయి. దైవం - మీకెప్పుడూ మంచినే ఇస్తాడు గాని చెడునివ్వడు. మీకేదైనా చెడు కనిపించిందంటే, అది మీభావముల యొక్క ప్రతిబింబమే. జీసస్ దగ్గర థామస్ అనే వాడుండేవాడు. అతనికి తలనిండా అనేక "డౌట్స్" - (సందేహాలు) ఉండేవి. కనుకనే అతనికి “డౌటింగ్ థామస్" - అని పేరు వచ్చింది. అలాంటి డౌటింగ్ థామస్ లు ఈ కలియుగంలో మరింత ఎక్కువైనారు. అలాంటివారితో మీరు స్నేహం చేయకండి. ఎందుకంటే, వారితో స్నేహం చేస్తే మీరు కూడా డౌటింగ్ థామస్ లుగా తయారౌతారు. దైవం అగ్నివంటివాడు. మీరు బొగ్గువంటివారు. బొగ్గును బాగుతో , చేర్చితే ప్రయోజనం లేదు. బొగ్గును ముట్టినా చేతికి గలీజు అవుతుంది; నీటితో కడిగినా నీరు కూడా చెడిపోతుంది. కనుక దీనిని పరిశుద్ధం చేయడం మీకు చేతకాదు. ఇది పరిశుద్ధం "కావాలంటే దైవాన్ని పరిపూర్ణంగా విశ్వసించాలి. అట్టి విశ్వాసమే దివ్యత్వాన్ని పోషిస్తుంది. బొగ్గును అగ్నితో చేర్చినప్పుడు బొగ్గు " కూడా అగ్నిగా మారుతుంది. కనుక, మీరు దైవంతో చేరండి. - మీరు కూడా దైవంగా రూపొందుతారు.
ప్రేమస్వరూపులారా! అందరూ - భగవంతుని "దూతలే, అందరూ
ప్రేమస్వరూపులే. ప్రేమ లేని మానవుడు..! | లోకంలో లేడు. కానీ ఈ ప్రేమను లోకసంబంధమైన, కుటుంబ - వ్యవహారాల, విషయాలలో ప్రవేశపెట్టి దుర్వినియోగపర్చుకొంటున్నారు. కుటుంబాన్ని కూడా చూసుకోవలసిందే; మీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే. కానీ వారే, ప్రధానమని అనుకోకూడదు. ప్రధానమైన వాడు భగవంతుడొక్కడే, కనుక నిస్సందేహం గా భగవంతుణ్ణి విశ్వసించండి. అప్పుడే మీకు సర్వ బాధలు పరిహారమవుతాయి. "ఆనందము - చేకూరుతుంది. ఈ సత్యాన్ని ఆచరించి, అనుభవించి, లోకానికి అందించినవా డు జీసస్.”
క్రిస్మస్ అనే పదము రోమన్ భాష నుండి వచ్చినది నిజంగా చూస్తే క్రిస్మస్ పండుగ డిసెంబర్ లో కాదు. కానీ డిసెంబర్ లో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కడా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదని, అందరూ ఇంటిలోనే ఉండి పండుగ జరుపుకోవచ్చునని భావించి ఈ నెలలో క్రిస్మస్ ను జరుపుకొంటున్నారే గాని, నిజంగా క్రీస్తు పుట్టినది మార్చినెలలో. జీసస్ ను గురించి ఎవరికి తోచినట్లు వారు వ్రాస్తు వచ్చారు. "ముండే ముండే మతి ర్భిన్నః", తలలు వేరైనప్పుడు తలంపులు కూడా వేరుగా ఉంటాయి. కొంతమంది అసలు జీసస్ పుట్టనే లేదని వ్రాశారు. మరి కొంతమంది, సిలువ వేసినది జీసస్ యొక్క సోదరుడినే గాని జీసస్ ను కాదని వ్రాశారు. ఆ సమయంలో జీసస్ జపాన్ లో ఉన్నాడన్నారు. ఇవన్నీ ఇమేజినేషన్లు! జీసస్ సత్యమే. ((శ్రీ వాణి డి 2011 పు 5)