ఈనాడు అనేకమంది భక్తులమని చెప్పుకొంటున్నారు; భక్తి అనగా కేవలం పూజలు, భజనలు, సేవలు చేయడం మాత్రమేనని భావిస్తున్నారు. ఇవి భక్తికి కొన్ని అంగములు మాత్రమే. భగవంతుని సందేశాన్ని ఆచరణలో పెట్టడమే నిజమైన ఆ భక్తి – ఎట్టి పరిస్థితియందైనా. దానిని ఉల్లంఘించకూడదు. సత్యహరిశ్చంద్రుడు ఎన్ని కష్టములు సంభవించినా కృంగక, జంకక సత్యమును అనుసరిస్తూ వచ్చాడు. కానీ ఈ కలిప్రభావంచేత అనేకమంది సుఖములందు మాత్రమే భగవంతుని విశ్వసిస్తున్నారు, పూజిస్తున్నారుగాని అరలు కష్టములు, డిండి నష్టములు సంభవించాయంటే మనస్సును మార్చుకుంటున్నారు.
మీకందరికీ తెలుసు; జీససను సిలువ వేయాలని నిర్ణయించినప్పుడు అతనితో పాటు అతని అనుచరులను కూడా సిలువ వేయాలనుకొన్నారు. అంతవరకు జీసస్కు ఎంతో దగ్గరగా ఉన్న కొందరు ఆ సమయంలో తాము జీసస్ యొక్క అనుచరులం కాదన్నారు. ఇలాంటి వారిని భక్తులని చెప్పవచ్చునా? భక్తులు దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితియందైనా - భగవదాజ్ఞను మీరకూడదు. అదియే నిజమైన భక్తుని దీక్ష. అట్టి దీక్షయందే త్యాగము - ఆవిర్భవిస్తుంది. త్యాగమునందే అమృతత్వం ప్రాప్తిస్తుంది. రాజు ఆ సర్వులకూ ఏ భగవత్సందేశాన్ని ఓ అందించడంలో శరీరాన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఇట్టి త్యాగమునకు మానవులు - సిద్ధంగా లేరు.దైవప్రేమకోసం పాటుపడకుండా ధనంకోసం, సుఖం కోసం ప్రాకులాడుతున్నారు. ఏమిటీ ధనము! దైవప్రేమయే నిజమైన ధనము, సత్యమే నిజమైన ధనము. నిజంగా దృఢమైన విశ్వాసంతో, అచంచలమైన ఈ ప్రతిజ్ఞతో సత్యం కోసం పాటుపడితే మీకు ఎట్టి కష్టములూ రావు. కానీ దీనికి మీరు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఇంక, భగవంతుడు మిమ్మల్ని ఏరీతిగా రక్షించగలడు? ఏరీతిగా అనుగ్రహించగలడు? భగవదనుగ్రహం పొందాలంటే మీరు త్యాగానికి సర్వవిధముల సంసిద్ధంగా ఉండాలి: తిండికి తయార్, పనికి పరార్”అన్నట్లుగాఉండకూడదు. (స.సా. డి. 2020 పు9)