ధనము దైవంబయ్యె దర్పంబె మతమయ్యె
స్వార్థమే బుద్ధికి స్థానమయ్యె
అహము ఫేషను అయ్యె, ఆశలందంబయ్యె
ధర్మంబు వమ్మయ్యె ధాత్రిలోన
దయయు హీనంబయ్యె నయము సూన్యంబయ్యె
కపటమే జీవుల కాంతులయ్యే
ప్రేమాను రాగముల్ రోగాల పాలయ్యె
కామాంధులుగ జేసెకలిని చదువు
బ్రతుకు బరువయ్యె మతులకు గతులుత ప్పె
విద్యయందున నైతిక విలువ చేర్చి
భారత బిడ్డలని పేరు బడయరయ్య!
(సత్యసారం--పద్య రూపం పు 69)