భేదములు మాని ఆశలను తిరస్కరించి, కోరికలను అదుపులో ఉంచుకున్నప్పుడే హృదయము విశాలము గా గలదు. కోరికలను అధికముగా పెంచుకొని పోవటమువల్లనే ఆ హృదయము క్షీణంచిపోతూ ఉంటుంది. క్రుంగిపోతూ ఉంటుంది. హృదయ విశాలత అనగా సర్వులందూ భగవంతుడున్నాడనే సత్యమును విశ్వసించి, సర్వులను మనము గౌరవించాలి. వ్యక్తిని వ్యక్తిగా భావించినప్పటికీ వ్యక్తియందున్న దివ్యశక్తి ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి. కోరికలను అదుపులో ఉంచుకొని ఇంద్రియములను సాద్య మైనంత వరకు అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహమే లేకుండా పొతేపశువుకంటే హీనంగా మారిపోతాడు మానవుడు. ఏది చేయతలంచినప్పటికీ ఇది సత్యమా అసత్యమా ఇది చేయతగినదా, చేయతగనిదా అని విచారణ చేయాలి. అప్పుడే ఈ సత్యాన్ని గుర్తుంచుకొని సత్యాన్ని చేరటానికి అవకాశమేర్పడుతుంది. లోక సం బంధమైన వాంఛలలో సాధ్యమైనంత వరకు ప్రవేశించక ఎంత అవసరమో అంతలోనే ప్రవర్తించటము అత్యవసరము.
వినండయా బోధ వినండయా
విని సత్యమార్గమున నడవండయా ||వినం ॥
నిమరలేచిన దాది నిదుర పోయెడుదాక
ఆస్తికై కుస్తీలు వేస్తారయా
రూపాయి కోసమై లోపాయికారిగా
అడ్డమైన గడ్డి తింటారయా ||వినం ॥
ధనంకోసం దైవధ్యానాలు బోనాలు
పెక్కు పన్నాగాలు పన్నేరయా
భూమి సూర్యుని చుట్టూ
జనులు ధనము చట్టూ
గి రగిరా తిరుగుతుంటారయా ||వినం ॥
లింగ లింగా యంచు రంగ పూజలు చేసి
దొంగ సాధన మీరు చేస్తారయా
స్వార్థమ్ముకె కీర్తి మర్యాదలాశించి
ధూర్త కార్యాలు మీరు చేస్తారయా ||వినం ॥
కలిమి కలిగిన నాడు కప్పగంతులు వేసి
కలిమి లేకున్న దుఃఖించుతారయా
గొ ప్పకు పోతారు గోవింద కొడతారు
డాబులు దంబాలు మానండయా ||వినం ॥
సర్వభూతములందు సర్వేశ్వరుని
సమముగా మీరు చూడండయా
సదయహృదయము తోడ సర్వజీవులందు
సాయి రాముని మీరు చూడండయా ||వినం ॥
శివశివ శివశివ యనరాదా జీవా
చింతలెల్ల బాపుకొని మనరాదా
శి వసాయీశుని గనరాదా జీవా
సు వివేకంబును గొనరాదా జీవా
శివమెత్తి జగమంత తిరిగేవు
ఓ చిత్తమా! నీ కెంత సిగ్గు లేదే
అవనిసుఖంబుల కల్లాడెడి
నీకావలికి మిగిలేదది ఏది? ||శివ||
ప్రొద్దుపోక యూరి వారి సుద్దులన్న
మీరు సిద్ధమౌదురే కడు శ్రద్ధతోడ
ముద్దు ముద్దుగాను సాయి ముచ్చటలు చెప్పునపు
డొద్దికగ నుండరే చెవులారా! |||శివ||
పనిమాలి సినిమాలు పలుమారు
మీరు చని చని కనినను తనివి లేదే
క్షణమైన దైవ సన్నిధి నిల్వగ
కనులారా కడు కష్టమౌగా? ||శివ||
అవినీతి రోత మాటలందరితో
నీవనుటకు గౌరవమయ్యెనుగా
నవనీత చోరుని నామము బల్కుట
నాల్కా అవమానంబగునా? ||శివ||
పనిలేని శునకంబువలె నీవు
పరుగిడి వగరించి తిరిగేవు
క్షణమైన సత్సంగతిలో నిల్వగ
సాధ్యముగాదా చరణములారా! ||శివ (|
ఇచ్చవచ్చు చెడ్డపనులెల్ల సేయ
ఆ ఈశ్వరుండు మిమ్ము సృజించినాడా
తెచ్చుకొని చేతులార! తెల్వియింకనైన మీరు
జెచ్చ రను హరి పూజ సేయరారె ||శివ||
పాటలు పాడిన ఫలమేమి?
మంచి మాటలు నేర్చిన మహిమేమి?
సూటిగ పెద్దల బాటనె పోయిన
సుఖముల మూటను జూతువుగా |శివ||
సులువుగ దొరికిన సుందర సాయిని
చులకన జే యగ జూతువుగా
పలు బొమ్మలకే పడిపడి మ్రొక్కిన
భయభక్తులతో బ్రతుకుదువా!
(శివరాత్రి సందేశము)
తేది : 23 - 2 – 1990
పూర్ణచంద్ర సభామంటపము,
ప్రశాంతి నిలయము
((శ్రీసత్యసాయి వచనామృతం 1990 (51-53)