మనలో లేని శక్తి జగత్తులో లేదు. జగత్తులో లేని శక్తి దైవములో లేదు. దైవశక్తియే జగత్తునందుంటున్నది. జగత్తు శక్తియే మానవుని యందుంటున్నది. కానీ మనకు తెలియని స్థితిలో ఉంటున్నది. ఈ అజ్ఞాత శక్తిని ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును. ఏ మాత్రము దీనికి సందేహము లేదు. అయితే, మనము కొన్ని దురభ్యాసములకు గురై పోతూ వచ్చాము. దేవుని పొందాలనుకుంటే రాంరాంరాం అనుకుంటే చాలదా అనుకుంటాం. ఈ రామ నామముతో మనం దేవుని పొందలేము. ధ్యానము చేస్తే రామతత్వం పొందవచ్చు కదా. అనుకుంటాం. ధ్యానము చేసేది, నామము సల్పేది, యజ్ఞయాగాదులు చేసేది మనస్సు యొక్క తృప్తి, మనస్సును అమనస్కంగా భావించుకోవాలి. మనస్సుండినంత వరకు ఈ విచారములు తప్పవు. మనస్సుండినంతవరకు దైవత్వము గుర్తించలేము. అమనస్కుడు కావాలి.
(శ్రీ.స. పు. 79/80)
(చూ ఆత్మ జ్ఞానము)