కాలము కూడా వ్యర్థము చేస్తున్నాము. తద్వారా మనము అశాంతికి గురికాగలము. తొందరపాటు లేకుండ జీవించడానికి ప్రయత్నించాలి. నిత్యానిత్య పరిశీలన సల్పాలి. దీనికే Haste makes waste. Waste makes worry, so don t be in a hurry. దైవ విషయములందు మాత్రము ఆతి శాంతముగా,నిశ్చలముగా,నిర్మలముగా,ప్రశాంతముగాదానిని పొందటానికి దగిన కృషి చేయాలి.
"అశాంతస్య కుతః సుఖః” అశాంతి కలినటువంటి వానికి సుఖమే లేదు. ఈ శాంతి మన కే రీతిగా లభిస్తుంది? అశాంతికి మూలకారణము అసంతృప్తి."అసంతృప్తో ద్విజోనష్టః" అసంతృప్తి వలన రెండు నష్టము లుంటున్నాయి. అశాంతి ఒకటి. అసుఖం ఒకటి, ఏర్పడుతాయి. కనుక, మానవుడు ఉన్న దానితో తృప్తిపడి, దానిలోనే అనుసరించి, ఆనంద మనుభవించే స్థితికి రావాలి. మితిమీరిన ఆశలతో మతి చెడప కూడదు. త్యాగరాజు "శాంతము లేక సౌఖ్యము లేదు" అని గానం చేశాడు. త్యాగరాజు మహా రామభక్తుడు. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క భక్తుడైనటువంటి త్యాగరాజు ఎన్ని విధములైనటువంటి అనుభూతులను తాననుభవించి లోకానికి అందిస్తూ వచ్చాడు.
(స. సా.జూ. 1989 పు 144)
(చూ: ఏకత్వము, జగత్తు, వర్తమానము, విశ్వాసము)