“ఆరోగ్యమునకు ఔషధములు ప్రధానము కాదు. మంచి మాటలు, మంచి నడతలు, మంచి చూపులు, మంచి తలపులు, మంచి వినికిడి అవసరము. ఇవే దేహమునకు అమృతత్వాన్ని అందించే టానిక్కులు. దుర్భావములు,దుశ్చింతలు,దురాలోచనలుహృదయముననింపుకొని, ఎన్ని విలువైన ఔషధములను సేవించినప్పటికీ,రోగనివారణకాదు. ఏఔషధము లేకపోయినప్పటికీ, ఏ డాక్టర్లు మనకు చిక్కకపోయినప్పటికీ,సద్గుణములనుకలిగి ఉన్నామంటే,సదాచారములనుఆచరించినామంటే,సచ్చింతనలను సంకల్పించుకున్నా మంటే - అవే మనకుసరియైనఆరోగ్యమునుఅందిస్తాయి,ఆత్మానందమునుచేకూరుస్తాయి.ఆత్మసందర్శనమునుకూడా కలిగిస్తాయి.(శ్రీన, పు. 39)
(చూ|| మందులు, రోగవిముక్తుడు)