లోకమున సమస్త పదార్థములకంటెను, మధురమైనది యును, సమస్త మంగళ వస్తువుల కంటెను మంగళకర మైనదియును. సమస్త పవిత్ర పదార్థముల కంటె పవిత్రమైనదియును ఏదైన యున్నచో అది కేవలము హరినామము లేక హరి మాత్రమే. ప్రాపంచిక చిత్తులగు అసురగుణముల సహవాసమును త్యజింపుము. సమస్త దుష్కార్యముల నుండి దూరముగా తొలగుడు. సత్సంగమును (జ్ఞానుల సహవాసమును) కలియుడు. నారాయణునిలో శరణమ న్వే షింపుడు.
ఆ పరమ పవిత్రుడే శాంతి, సౌఖ్యము. జ్ఞానుల యొక్క మూర్తీ భావము. అట్టి శ్రీహరి అందరియందు ఆసీనుడై యున్నాడు. ఏ ప్రదేశమున తన భక్తులు భక్తితో హరినామమును నితరమునుకాక గాన మొనర్తురో అచట ఆ పరమాత్ముడు నిరంతరము వసించుచున్నాడు. మొదట మీరు అట్టి పరమాత్మునిపై భక్తి నభ్యసించవలెను. అప్పుడే మీరు వాస్తవిక శాశ్వతసౌఖ్యము జ్ఞానముల నొందగలరు.
(ప్ర.వా.పు.70)
(చూ॥ తరమా!)