ఒక దినము ఒక విద్యార్థి తన టీచరు దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయములో ఆటస్థలమున కొందరు Foot Ball ఆడుతున్నారు. ఈ అబ్బాయి టీచరుని "సార్! అదేమిటి, ఆ బాల్ ను ఇరుప్రక్కలవారు అటూ, ఇటూ, మార్చి మార్చి కొడుతున్నారు కాలితో," అని అడిగాడు. టీచరు “ఆబ్బాయీ! దానిని యెంతవరకు ఇట్లా కొడతారో చెప్పు అని అన్నాడు. ఆ అబ్బాయి యోచించి “దానిలో గాలి వున్నంతవరకు" అన్నాడు. "గాలి పోయిన వెంటనే దానిని చేతులోకి తీసుకుంటారు " అని అన్నాడు. మన జీవితమే ఒక ఫుట్ బాల్ గ్రౌండ్ (Foot Ball Ground). దానిలో ప్రతి వ్యక్తి ఫుట్ బాల్ (Foot Ball) వంటి వాడు. ఈ బాల్ ను అటూ ఇటూ కొట్టేవి మనలోనున్న సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు ఒక ప్రక్క, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యము లింకొక ప్రక్క. అయితే యెంతవరకు ఇవి కొడతాయి? మనలో ఆహంకార మున్నంతవరకు, యెప్పుడు మనలో ఆహంకార ముండదో, అప్పుడు దెబ్బలు కూడా తగలవు.
(శ్రీసా.ది.పు.29)