ఆరోగ్యమునకు ఔషధములు ప్రధానముకాదు. మంచి మాటలు, మంచి నడతలు, మంచి చూపులు, మంచి తలపులు, మంచి వినికిడి అవసరము. ఇవే దేహమునకు అమృతత్వాన్ని అందించే టానిక్కులు.
దుర్భావములు, దుశ్చింతలు, దురాలోచనలు. హృదయమున నింపుకొని, ఎన్ని విలువైన ఔషధములను సేవించినప్పటికీ రోగ నివారణకాదు. ఏ ఔషధము లేకపోయినప్పటికీ, ఏడాక్టర్లు మనకు చిక్కకపోయినప్పటికీ, సద్గుణములను కలిగి ఉన్నామంటే, సదాచారములను ఆచరించినామంటే, సచ్చింతనలను సంకల్పించు కున్నామంటే అవే మనకు సరియైన ఆరోగ్యమును అందిస్తాయి. ఆత్మానందమును చేకూరుస్తాయి. ఆత్మ సందర్శనమును కూడా కలిగిస్తాయి.
(శ్రీ.న. 2000 పు. 39)